breaking news
former indian President
-
కలాం హయాంలోనే అసాధారణ పురోగతి
వాషింగ్టన్: భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం అకస్మిక మృతి పట్ల అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మంగళవారం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కలాం మృతికి సంతాపం ప్రకటించారు. భారత్ అమెరికా దేశాల మధ్య అంతరిక్ష సహకారం కోసం కలాం చేసిన కృషిని ఈ సందర్భంగా ఒబామా గుర్తు చేసుకున్నారు. అలాగే ఇరుదేశాల మధ్య సంబంధాలు దృఢపరిచే క్రమంలో ఆయన మద్దతుగా నిలిచిన వైనాన్ని ఒబామా విశదీకరించారు. ఓ శాస్త్రవేత్తగా, ఓ స్టేట్స్మెన్గానే కాకుండా భారత్లో అత్యంత అరుదైన నాయకుల్లో ఒకరిగా అబ్దుల్ కలాం దేశ విదేశాలలో గౌరవం సంపాదించారన్నారు. భారత్కు 11వ రాష్ట్రపతిగా కలాం బాధ్యతలు తీసుకున్న తర్వాత భారత - అమెరికా దేశాల మధ్య అసాధారణ పురోగతి సాధ్యమైందని ఒబామా స్పష్టం చేశారు. ప్రజల రాష్ట్రపతి అనే పదానికి అసలు సిసలైన నిర్వచనం అబ్దుల్ కలాం అని అభివర్ణించారు. కలాం వినయ విధేయతలతోపాటు ప్రజసేవకు అంకితమైన తీరు భారతీయ ప్రజలకే కాదు ప్రపంచానికే స్ఫూర్తి అని ఒబామా పేర్కొన్నారు. -
'కలాం గొప్ప మానవతావాది'
లండన్: ప్రఖ్యాత శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం మృతి పట్ల ప్రముఖ ఎన్నారై పారిశ్రామికవేత్త లార్డ్ స్వరాజ్ పాల్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అబ్దుల్ కలాంకు ఘనంగా నివాళులర్పించారు. ఆయన గొప్ప మానవతావాది అని తెలిపారు. ఎందరికో స్ఫూర్తి ప్రధాత అని అబ్దుల్ కలాంను కొనియాడారు. రాష్ట్రపతిగా కలాం దేశానికి చేసిన సేవలను లార్డ్ స్వరాజ్ పాల్ ఈ సందర్భంగా కొనియాడారు. అబ్దుల్ కలాం ప్రసిద్ధ నాయకుడని లార్డ్ స్వరాజ్ పాల్ తెలిపారు. లండన్ చెందిన ప్రముఖ ఎన్నారై పారిశ్రామికవేత్తగా ఖ్యాతి పొందిన లార్డ్ స్వరాజ్ పాల్ కపారో గ్రూప్ సంస్థలకు అధినేత అన్న విషయం తెలిసిందే.