breaking news
Footprints
-
2040 నాటికి చంద్రుడిపై మన పాదముద్ర: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ ముందంజలో దూసుకెళ్తోందని ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. 2040 నాటికి చందమామపై మన వ్యోమగాములు అడుగు పెట్టబోతున్నారని చెప్పారు. అంగారక(మార్స్), శుక్ర(వీనస్) గ్రహాలపైనా ప్రయోగాలు చేయబోతున్నట్లు వెల్లడించారు. గ్లోబల్ స్పేస్ ఎక్ప్‌ప్లోరేషన్ కాన్ఫరెన్స్(గ్లెక్స్–2025) సందర్భంగా ప్రధాని మోదీ బుధవారం ఈ మేరకు వీడియో సందేశం విడుదల చేశారు. అంతరిక్ష ప్రయోగ ప్రణాళికలు వివరించారు. 2035 నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత 2040 నాటికి చంద్రుడిపై మన పాదముద్ర ఉంటుందని పేర్కొన్నారు. మరో 15 ఏళ్లలో భారతీయ వ్యోమగాములు చందమామపై అడుగుపెట్టడం తథ్యమని స్పష్టంచేశారు. మన అంతరిక్ష ప్రయాణం ఇతరులతో పోటీకి సంబంధించింది కాదని, అందరినీ కలుపుకొని ఈ రంగంలో ఉన్నత శిఖరాలకు చేరాలన్నదే అసలు లక్ష్యమని ఉద్ఘాటించారు. మొత్తం మానవాళికి లబ్ధి చేకూరేలా అంతరిక్ష ప్రయోగాల్లో తమ ఉమ్మడి లక్ష్యాన్ని అందరితో పంచుకుంటామని వ్యాఖ్యానించారు. జీ20 ఉపగ్రహం ప్రయోగిస్తాం దక్షిణాసియా దేశాల కోసం ఒక శాటిలైట్ ప్రయోగించామని ప్రధాని మోదీ గుర్తుచేశారు. గ్లోబల్ సౌత్ దేశాలకు బహుమతిగా జీ20 ఉపగ్రహం ప్రయోగించబోతున్నామని చెప్పారు. గగన్‌యాన్ ప్రాజెక్టు మన దేశ ఆకాంక్షలకు ప్రతిబింబిస్తోందని అన్నారు. మన తొలి మానవసహిత స్పేస్–ఫ్లైట్‌ను త్వరలో అంతరిక్షంలోకి పంపించబోతున్నామని చెప్పారు. ఇస్రో–నాసా ఉమ్మడి మిషన్‌లో భాగంగా భారతీయ వ్యోమగామి మరికొన్ని వారాల్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్ఎస్) చేరుకోబోతున్నాడని వివరించారు. అంతరిక్షం అంటే కేవలం ఒక గమ్యం కాదని.. ఉత్సకత, ధైర్యం, సమీకృత ప్రగతికి ఒక ప్రతీక అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. భారతదేశ అంతరిక్ష ప్రయాణం ఆ దిశగానే సాగుతోందని చెప్పారు. 1963లో ఒక చిన్న రాకెట్ ప్రయోగంతో మన అంతరిక్ష యాత్ర ఆరంభమైందని గుర్తుచేశారు. అనంతరం ఈ రంగంలో ఎంతగానో పురోగమించామని, చంద్రుడి దక్షిణ ధ్రువంపై స్పేస్‌క్రాఫ్ట్‌ను ల్యాండ్ చేసిన తొలి దేశంగా రికార్డు సృష్టించామని పేర్కొన్నారు. మన ప్రయాణం చరిత్రాత్మకమని అభివరి్ణంచారు. మన రాకెట్లు పేలోడ్స్ కంటే అధికంగా 140 కోట్ల మంది భారతీయుల కలలను మోసుకెళ్తుంటాయని వివరించారు. తొలి ప్రయత్నంలోనే మార్స్ వద్దకు చేరుకున్న దేశంగా ఇండియా చరిత్ర సృష్టించిందన్నారు. చంద్రయాన్ ప్రయోగాలతో చంద్రుడిపై నీటి జాడ కనిపెట్టామని, అత్యంత నాణ్యమైన చంద్రుడి ఫొటోలు చిత్రీకరించామని, అక్కడి దక్షిణ ధ్రువం గురించి మరింత సమాచారం తెలుసుకున్నామని వెల్లడించారు. రికార్డు సమయంలో క్రయోజెనిక్ ఇంజన్లు తయారు చేశామని, ఒకేసారి 100 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించామని గుర్తుచేశారు. 34 దేశాలకు చెందిన 400కుపైగా శాటిలైట్లను మన అంతరిక్ష నౌకల ద్వారా ప్రయోగించామని అన్నారు. ఈ ఏడాది అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను అనుసంధానించామని, ఇదొక గొప్ప ముందడుగు అని తెలియజేశారు. -
అది పులి కాదు.. మరి ఏంటి?
-
మంచు మనిషి ‘యెతి’ నిజంగా ఉన్నాడా?!
సాక్షి, న్యూఢిల్లీ : ‘హిమాలయ పర్వతాల్లో భారీ మంచు మనిషిగా భావించే ‘యెతి’కి చెందిన 32 అంగుళాల పొడువు, 15 అంగుళాల వెడల్పు పాద ముద్రలు కనుగొన్నాం’ అంటూ భారత సైన్యం మంగళవారం ట్వీట్ చేయడంతో మరోసారి ‘యెతి’ గురించి చర్చకు వచ్చింది. యెతి భీకర ఆకారంలో ఉండే ఆది మానవుడని, ఆసహ్యంగా ఉండే భారీకాయుడని, మంచి వాడని, చెడ్డవాడని అనేక ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. హిమాలయాలు విస్తరించిన నేపాల్, చైనా, భారత్, భూటాన్, మయన్మార్ ప్రాంతాలకు ఈ ఊహాగానాలు విస్తరించాయి. వీటి ఆధారంగా యెతి క్యారెక్టర్‌పై బాలివుడ్, హాలివుడ్ చిత్రాలే కాకుండా పలు కార్టూన్, యానిమేషన్ చిత్రాలు, పలు పుస్తకాలు వచ్చాయి. కొన్ని వీడియో గేముల్లో కూడా ఈ క్యారెక్టర్ కనిపిస్తుంది. 1991లో భారత్ బాలివుడ్‌కు చెందిన రామ్సే బ్రదర్స్ ‘అజూబా కుద్రత్ కా’ పేరిట యెతిపై ఓ చిత్రాన్ని నిర్మించారు. అందులో యెతి ఓ చిన్న బాలికతో స్నేహం చేస్తూ ఆమె తరఫున చెడు బాలలతో పోరాటం చేస్తుంది. అందులో ‘యెతి ఐ లవ్ యూ’ అనే పాట కూడా ఉంది. ఇక హాలీవుడ్లో యెతిపై 1957లో ‘ది అబామినబుల్ స్నోమేన్’, 1964లో ‘రుడాల్ఫ్ ద రెడ్–నోస్డ్ రీయిండీర్’ పేరిట యానిమేషన్ చిత్రాలు వచ్చాయి. ఆతర్వాత 2001లో ‘మాన్స్టర్స్, ఇన్కార్పొరేషన్,’ 2014లో ‘ది లెగో మూవీ’ యానిమేషన్ చిత్రాలు వచ్చాయి, 2013లో వచ్చిన ‘ది మమ్మీ టూంబ్ ఆఫ్ ది డ్రాగన్ ఎంపరర్’ చిత్రంలో భారీ మంచు మనిషి రూపంలో యెతి కనిపిస్తుంది. 2017లో బెంగాలిలో ‘యెతి అభిజాన్’ చిత్రం వచ్చింది. ‘గ్రాండ్ థెఫ్ట్ ఆటో ఫైవ్’ టైటిల్‌తో వచ్చిన వీడియో గేమ్‌లో కూడా యెతి పాత్ర ఉంటుంది. ‘టిన్టిన్ ఇన్ టిబెట్’ కామిక్ పుస్తకంలోను యెతి క్యారెక్టర్ ఫేమస్. అన్నింట్లోను యెతి ఆకారాన్ని ఆసహ్యంగానే చూపినప్పటికీ ఎక్కువగా మంచితనానికి మారుపేరుగా చూపించారు. ఇంతటి ప్రాచుర్యం పొందిన యెతి ఎప్పుడు పుట్టింది ? ఎక్కడ పుట్టింది ? ఎలా పుట్టింది ? అసలు అది ఏమిటీ? 1921లో తొలిసారి పాద ముద్రలు బ్రిటీష్ సాహసికుడు లెఫ్ట్‌నెంట్ కల్నల్ చార్లెస్ హొవర్డ్ బరీ 1921లో మౌంట్ ఎవరెస్ట్‌కు సరైన దారిని కనుగొనడంలో భాగంగా హిమాలయాల్లోకి వెళ్లారు. అప్పుడు ఆయనకు మంచుకొండలపై భారీ పాద ముద్రలు కనిపించాయి. అప్పుడు వాటి గురించి తన వెంట వచ్చిన స్థానికులను ప్రశ్నించగా వారు అవి ‘మెతోహ్ కాంగ్మీ’వని చెప్పారు. వారి స్థానిక భాషలో మెతోహ్ కాంగ్మీ అంటే ‘ఎలుగుబంటిని పోలిన మంచు మనిషి’ అని అర్థం. అయితే ఆయన దాన్ని ఇంగ్లీషులోకి ‘అబామినబుల్ స్నోమేన్’ అంటూ ఆయన పొరపాటున అనువదించారు. ఆంగ్లంలో అబామినబుల్ అంటే అసహ్యమైన అన్న అర్థం వస్తుంది. అందువల్ల ‘యెతి’ రూపం వికారంగా మారింది. కల్నల్ చార్లెస్ తాను రాసిన ‘మౌంట్ ఎవరెస్ట్ రికానాయ్సాన్స్, 1921’ పుస్తకంలో తొలిసారిగా యెతి అడుగుల గురించి ప్రస్తావించారు. 1951లో ప్రపంచవ్యాప్తంగా పరిచయం ఇంగ్లీష్ పర్వతారోహకుడు ఎరిక్ షింప్టన్ 1951లో నేపాల్–టిబెట్ సరిహద్దులోని మెన్లంగ్ శిఖరాలకు వెళ్లారు. అప్పుడు ఆయనకు కూడా యెతి పాద ముద్రలు కనిపించడంతో వాటిని ఫొటో తీశారు. ఆ ఫొటో కారణంగా ప్రపంచవ్యాప్తంగా యెతి ఒక చర్చనీయాంశం అయింది. అప్పటి నుంచి ఆ పాద ముద్రల తాలూకు మంచు మనిషిని కనుగొనేందుకు పలు పరిశోధనలు మొదలయ్యాయి. ముఖ్యంగా 1954–60 మధ్యన బ్రిటీష్ నుంచి వెలువడుతున్న ‘ది డెయిలీ మెయిల్’ బృందం, అమెరికా చమురు అన్వేషకుడు టామ్ స్లిక్ బృందం, ప్రముఖ పర్వతారోహకుడు ఎడ్మండ్ హిల్లరీ పలు పరిశోధనలు జరిపారు. ఎవరు ‘యెతి’ని కనుగొనలేకపోయారు. యెతి పాద ముద్రల్లో కాలి బొటన వేలు, మనిషి కాలు బొటన వేలును పోలి ఉన్నట్లు ఉండడం వల్ల జంతువును పోలిన మనిషని, మనిషిని పోలిన జంతువని, ఆది మానవుడని వార్తలు ప్రచారమయ్యాయి. యెతి పాద ముద్రల్లో కాస్తా తేడాలను పరిశోధకులు గుర్తించారు. అవి ఒకరివి లేదా ఒక దానివి కావని, పలు జాతులకు చెందిన ఎలుగుబంట్లవని వారు భావించారు. హిమాలయ పర్వతాల్లో సంచరించే ‘ఉర్సస్ తిబేటనస్గా పిలిచే ఆసియాటిక్ నలుపు ఎలుగు బంటు, ఉర్సస్ మారిటమ్స్ అనే తెలుపు రంగు ఎలుగుబంటు, ఉర్సస్ ఆర్క్టస్ ప్రూనోసస్ అనే కాస్త నలుపు, ఉర్సస్ ఆర్కటస్ అని పిలిచే గోధుమ రంగు ఎలుగుబంట్ల పాద ముద్రలని శాస్త్రేవేత్తలు తేల్చారు. ఆ ఎలుగు బంట్లు చెట్లు ఎక్కుతాయని, అందుకు అనువుగా వాటి బొటన వేళ్లు మానవుడి బొటన వేలును పోలి ఉన్నాయని వారు చెప్పారు. అవి రాత్రపూటనే ఎక్కువగా సంచరిస్తాయికనుక, ఆ సమయంలో మానవులు లేదా పర్వతారోహకులు సంచరించరు కనుక ఎలుగు బంట్లకు బదులుగా వాటి పాదముద్రలే కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు. అయినప్పటికీ కనిపించని ‘మంచు మనిషి (యెతి)’ ఉన్నాడని ఇప్పటికీ నమ్మే వారు కోకొల్లలు. ‘అబామినబుల్ సైన్స్: ఆర్జిన్స్ ఆఫ్ ది యెతి, యెతి : ది ఎకాలోజికల్ మిస్టరీ, ది హిమాలయన్ ఆంత్రపాలోజి: ది ఇండియన్, టిబెటిన్ ఇంటర్ఫేస్ పుస్తకాల్లో యెతి గురించి, ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ది రాయల్ సొసైటీ ఆఫ్ బయోలాజికల్ సైన్సెస్’లో యెతి పరిశోధనల గురించి తెలుసుకోవచ్చు. -
మల్యాలపల్లిలో పులుల సంచారం
-
‘చెక్క’ని పాదముద్రలు..!
ఇవి దేవతా పాదముద్రలు కాదు.. వీటిని ఎవరూ చెక్కనూలేదు! మరి ఎలా వచ్చాయంటారా? చైనాకు చెందిన ఓ బౌద్ధ సన్యాసి మహత్మ్యం వల్ల ఇవి ఇలా చెక్కలో ఏర్పడ్డాయి. ఆయనకు ఏమీ మహిమలూ, మంత్రాలు తెలియవు. తెలిసిందల్లా నిత్యం దైవనామ స్మరణ చేయడమే. దాంతోనే ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. చైనాలోని ఖింగ్హాయ్ ప్రావిన్సులోని టాంగెరన్కు చెందిన హూచీ అనే 70 ఏళ్ల బౌద్ధ సన్యాసి ప్రతిరోజూ సూర్యోదయానికి ముందే ఆలయానికి వచ్చి మోకరిల్లి ప్రార్థన చేస్తుంటారు. ఇలా రోజుకు కనీసం వెయ్యిసార్లు మోకరిల్లుతుంటారు. ఇలా దాదాపుగా 20 ఏళ్ల నుంచి చేస్తున్నారు. ప్రతిరోజూ ఒకేస్థానంలో ఆయన తన పాదాలను ఉంచి మోకరిల్లడం వల్ల అక్కడ ఆయన పాదముద్రలు ఏకంగా 1.2 అంగుళాల లోతులో ఇలా ఏర్పడ్డాయి.