breaking news
financial survey
-
మళ్లీ పొలంబాట..!
సాక్షి, అమరావతి: దేశంలో వ్యవసాయ కుటుంబాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. కరువు, వరదలు వంటి వాతావరణ ప్రతికూలతలు వ్యవసాయ కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నప్పటికీ... గ్రామాల్లో అత్యధిక కుటుంబాలకు వ్యవసాయమే ప్రధాన జీవనోపాధిగా మారింది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పొలంబాట పట్టే కుటుంబాలు పెరుగుతూనే ఉన్నాయి. నాబార్డు 2016–17 సంవత్సరంలో నిర్వహించిన రూరల్ ఫైనాన్సియల్ సర్వే ప్రకారం దేశంలో వ్యవసాయ కుటుంబాలు 48 శాతం ఉండగా... 2021–22లో నిర్వహించిన సర్వే ప్రకారం వ్యవసాయ కుటుంబాలు 57 శాతానికి పెరిగాయి.దేశంలో వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలు 9 శాతం పెరిగినట్లు ఈ సర్వే స్పష్టంచేసింది. ఇటీవల నాబార్డు ఆ సర్వే వివరాలను వెల్లడించింది. ఏపీతో సహా 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 50 శాతానికి పైగా కుటుంబాలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నట్లు సర్వేలో తేలింది.2016–17లో నిర్వహించిన సర్వేలో ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ కుటుంబాలు 34 శాతం ఉండగా... 2021–22లో ఏకంగా 53 శాతానికి పెరిగాయి. మన రాష్ట్రంలో వ్యవసాయ కుటుంబాలు 19 శాతం పెరిగినట్లు స్పష్టమవుతోంది. కేరళ, గోవా రాష్ట్రాల్లో కేవలం 18 శాతం కుటుంబాలు మాత్రమే వ్యవసాయంపై ఆధారపడ్డాయి. ఈ రెండు రాష్ట్రాలతోపాటు పశ్చిమ బెంగాల్, మేఘాలయ, బిహార్, సిక్కిం, త్రిపుర, పంజాబ్, మిజోరాం, మణిపూర్లలోను వ్యవసాయేతర కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. -
అసమానతల నిర్మూలనకు ఆర్థిక సర్వే తోడ్పాటు
నిపుణుల కమిటీ సమావేశంలో నేషనల్ స్టాటిస్టిక్స్ కమిషన్ చైర్మన్ బర్మన్ సాక్షి, హైదరాబాద్: దేశంలో ఆర్థిక, సామాజిక అసమానతలను నిర్మూలించేందుకు సామాజిక ఆర్థిక సర్వే ఎంతగానో దోహదపడుతుందని జాతీయ గణాంక సంఘం (నేషనల్ స్టాటిస్టిక్స్ కమిషన్) చైర్మన్ రాధా బినోద్ బర్మన్ అన్నారు.75వ విడత సర్వే బాధ్యతలను నేషనల్ శాంపిల్సర్వే విభాగానికి కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ అప్పగించిందని చెప్పారు. 2017 జూలై నుంచి ప్రారంభం కానున్న సర్వే సన్నాహాల కోసం నిపుణుల కమిటీ గురువారం సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్స్టడీస్లో సమావేశం కాగా, సర్వేలోని అంశాలపై ఎస్ఎస్ఈ చైర్మన్ బర్మన్ మాట్లాడారు. 2030 నాటికి పేదరికం, నిరక్షరాస్యత, లింగవివక్ష.. తదితర సమస్యలను పూర్తిగా రూపుమాపాలని ఐక్యరాజ్య సమితి లక్ష్యాలను నిర్దేశించినందున, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టేందుకు ఈ సర్వే ఉపయోగపడనుందన్నారు. నిపుణుల కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ రాధాకృష్ణ మాట్లాడుతూ.. సర్వే వచ్చే ఏడాది జూలై నుంచి 2018 జూన్ వరకు జరుగుతుందన్నారు. త్వరలోనే పైలట్ సర్వేను నిర్వహిస్తామన్నారు.