breaking news
filmnagar culture centre
-
ఫిల్మ్‌నగర్ కల్చరల్ క్లబ్లో న్యూ ఇయర్ సంబరాలు (ఫోటోలు)
-
కరోనా విరాళం
పద్మావతి గల్లా – 10 లక్షలు (‘సీసీసీ మన కోసం’కు) పద్మావతి గల్లా ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్.ఎన్.సీ.సీ) – 25 లక్షలు ( తెలంగాణ ప్రభుత్వానికి ) సాయికుమార్ కుటుంబం – 7 లక్షల 12 రూపాయిలు (‘సీసీసీ’కు సాయి కుమార్, ఆయన తనయుడు ఆది సాయికుమార్ 5 లక్షల నాలుగు రూపాయిలు అందించారు. డబ్బింగ్ యూనియన్ అసోసియేషన్‌కి సాయి కుమార్ లక్షా ఎనిమిది రూపాయిలు, సాయి కుమార్ తమ్ముడు రవి శంకర్ లక్ష రూపాయిలు ప్రకటించారు) ఆది, సాయికుమార్ సాగర్ – 5 లక్షలు (తెలంగాణ ప్రభుత్వానికి ) కేటీఆర్‌కి చెక్ అందిస్తున్న సాగర్ -
చాంప్స్ భమిడిపాటి, ఆర్టీ జట్లు
బంజారాహిల్స్, న్యూస్‌లైన్: ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్ఎన్సీసీ)లో జరిగిన ఆలిండియా ఓపెన్ బ్రిడ్జ్ టోర్నమెంట్ పోటీలు ఆదివారం ముగిశాయి. నవయుగ ఇంజినీరింగ్ ట్రోఫీని భమిడిపాటి టీమ్, కె.ఎస్.ప్రకాష్‌రావు ట్రోఫీని ముంబైకి చెందిన ఆర్టీ టీమ్, డాక్టర్ సి.ఎస్.రావు ట్రోఫీని జేఎం షా టీమ్ గెలుపొందాయి. ఐఎంపీ పెయిర్స్ పి.సుధాకర్‌రావు, పి.వెంకటేశ్వర్లు వ్యక్తిగత ట్రోఫీలు అందుకున్నారు. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో ఆదివారం జరిగిన ముగింపు వేడుకలకు ప్రముఖ సీనియర్ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 56 జట్లు పాల్గొన్నాయి. ఎఫ్ఎన్సీసీ క్రమం తప్పకుండా నాలుగేళ్ల నుంచి ఈ టోర్నీని విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమని రాఘవేంద్రరావు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎన్సీసీ అధ్యక్షుడు కె.ఎస్.రామారావు, కార్యదర్శి సి.హెచ్.శ్రీనివాసరాజు, మాజీ అధ్యక్షుడు డాక్టర్ కె.ఎల్.నారాయణ, ఆంధ్రప్రదేశ్ బ్రిడ్జ్ అసోసియేషన్ కార్యదర్శి కె.సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శి వి.రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.