breaking news
Female students school
-
సార్ మీ ప్రవర్తన మార్చుకో..
కొండపాక(గజ్వేల్): విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, దూషిస్తున్న ఉపాధ్యాయుడితో బాధిత కుటుంబ సభ్యులు, స్థానిక యువకులు వాగ్వాదానికి దిగారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుకు సిద్ధమయ్యారు. ఈ సంఘటన కొండపాక మండలంలోని కుకునూరుపల్లి హైస్కూల్లో గురువారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గడీల సుధాకర్‌రెడ్డి అనే ఆంగ్ల ఉపాధ్యాయుడు మూడు నెలల క్రితం బదిలీపై కుకునూరుపల్లి హైస్కూల్‌కు వచ్చాడు. నాటి నుంచి 9వ తరగతి విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, దూషిస్తున్నాడని బాధిత చిన్నారులు ఆరోపిస్తున్నారు. పాఠ్యాంశాల్లో అర్థం కాని విషయాలను అడిగితే ఛీదరించుకుంటూ, అవహేళనగా మాట్లాడుతుంటారని చెబుతున్నారు. ఈ విషయాన్ని వారు తమ కుటుంబీకులతో చెప్పడంతో స్థానిక యువకులతో కలిసి విషయం తెలసుకునేందుకు గురువారం పాఠశాలకు వెళ్లారు. అక్కడ విద్యార్థుల కుటుంబీకులకు, యువకులకు, ఉపాధ్యాయుడు సుధాకర్‌రెడ్డి నడుమ మాటా మాటా పెరగడంతో విషయం దాడి చేసుకునే స్థాయికి వెళ్లింది. విషయం తెలుసుకున్న ఎంఈఓ శ్రీనివాస్‌రెడ్డి కుకునూరుపల్లి హైస్కూల్‌కు చేరుకొని విద్యార్థుల కుటుంబీకులను, యువకులను, ఉపాధ్యాయుడిని సముదాయించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులకు ఇలాంటి ఘటన పునరావృత్తం కాకుండా చర్యలు తీసకుంటామని హామీ ఇచ్చారు. హెచ్ఎం గజ్జెల కనుకరాజు వైఖరిపై సైతం యువకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుడు సుధాకర్ రెడ్డిని ఎంఈఓ శ్రీనివాస్‌రెడ్డి మందలించారు. విద్యార్థులతో సరైన రీతిలో మెదగాలని సూచించారు. ఈ విషయమై ప్రధానోపాద్యాయుడు కనుకరాజుకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. -
వ్యభిచార కేంద్రానికి విద్యార్థినులు
ఐదుగురి అరెస్ట్ టీ.నగర్: విరుదాచలం సమీపంలోగల దిట్టకుడికి చెందిన పాఠశాల విద్యార్థినులను వ్యభిచార కేంద్రానికి తరలించేందుకు ప్రయత్నించిన ఐదుగురిని పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. కడలూరు జిల్లా దిట్టకుడికి చెందిన బాలికలు ఇద్దరు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 7వ తరగతి, 9వ తరగతి చదువుతున్నారు. గత నెల 11వ తేదీ వీరిరువురు పాఠశాల నుంచి ఇంటికి చేరుకోలేదు. వీరి గురించి విద్యార్థినుల తల్లిదండ్రులు దిట్టకుడి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసు లు విద్యార్థినుల కోసం గాలిస్తూ వచ్చారు. విద్యార్థినులను సెల్ఫోన్లో సంప్రదించగా తిరుపూరులో బనియన్ కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలిపారు. దీంతో ఎస్ఐ రంగనాథన్, ప్రతాపన్ ఆధ్వర్యంలోని పోలీసులు తిరుపూరులో గాలించినప్పటికీ ఆచూకి తెలియలేదు. విద్యార్థినుల సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వారు విరుదాచలం, పుదుచ్చేరి, కోవియనూరు, వడలూరు ప్రాంతాలలో సంచరిస్తున్నట్లు తెలిసింది. చివరిగా వడలూరులో ఉన్నట్లు వారి వద్ద ఫోన్లో మాట్లాడింది వడలూరుకు చెందిన సతీష్‌కుమార్ అని తెలిసింది. వెంటనే సతీష్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. ఆ తరువాత విద్యార్థినులు ఇరువురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద కడలూరు ఏడీఎస్పీ అరులై ఆధ్వర్యంలో పోలీసులు విచారణ జరిపారు. విచారణలో ఇద్దరు విద్యార్థినులకు దిట్టకుడి ఫాదర్ అరుల్దాస్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆయన వీరిపై లైంగికదాడికి పాల్పడుతూ వచ్చాడు. దీంతో దిట్టకుడి పెరియార్‌నగర్‌కు చెందిన లక్ష్మి విద్యార్థినులను బెదిరించి దిట్టకుడికి చెందిన కొందరికి వీరిని అప్పగించిం ది. ఆ తరువాత వీరిని విరుదాచలంకు చెందిన కళ అనే మహిళకు 5 వేలకు లక్ష్మి విక్రయించింది. విద్యార్థినులను రెండు రోజుల పాటు ఉంచుకున్న కళ అదే ప్రాంతానికి చెందిన జెమీనా అనే మహిళకు 25వేలకు విక్రయించింది. జెమీనా వడలూరులో వ్యభిచార వృత్తి నిర్వహిస్తున్న సతీష్‌కుమార్‌కు 25వేలకు విక్రయించింది. దీంతో విద్యార్థినులను పుదుచ్చేరి, బిలియనూరు, విల్లుపు రం, వడలూరు ప్రాంతాల్లో ఉన్న లాడ్జీలలో విద్యార్థులను ఉంచి వారిని సతీష్‌కుమార్ వ్యభిచార వృత్తిలోకి దించాడు. దీంతో ఫాదర్ అరుల్దాస్ (60), సతీష్‌కుమార్(28), లక్ష్మీ అలి యాస్ ధనలక్ష్మి(30), విరుదాచలం కళ(48), జెమినా(28)లను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని దిట్టకుడి మెజిస్ట్రేట్ ఉత్తమరాజ్ ఇంటికి మంగళవారం రాత్రి 11 గంటలకు పోలీసు లు తీసుకెళ్లి హాజరు పరిచారు. వీరిని రిమాండ్‌లో ఉంచేందుకు ఆయన ఉత్తర్వులు ఇచ్చారు. విద్యార్థినులను మెజిస్ట్రేట్ ఉత్తర్వుల మేరకు కడలూరు జువైనల్ హోంలో ఉంచారు.