breaking news
Farzana
-
బిగ్ బాస్‌లోకి ఆ స్టార్ హీరో, హీరోయిన్.. ఆఖరి క్షణంలో అదిరిపోయే ట్విస్ట్
బిగ్‌బాస్ 7 సీజన్ షో ప్రారంభానికి కొద్దిరోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. సెప్టెంబర్ 3న గ్రాండ్‌గా ఈ షోను ప్రారంభించేందకు మేకర్స్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. కంటెస్టెంట్ల ఎంపిక సరిగా లేకపోవడం వల్ల గత సీజన్లు కొన్ని అంతగా మెప్పించలేదనే చెప్పవచ్చు. కానీ ఈసారి ఆ తప్పులు జరగకుండా బిగ్‌బాస్ టీమ్ పలు జాగ్రత్తలే తీసుకుందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు చాలమంది కంటెస్టెంట్లను ప్రేక్షకులకు బాగా తెలిసినవారినే ఎంపిక చేశారని తెలుస్తోంది. అందులో భాగంగా ఎవరూ ఊహించని ఇద్దరి పేర్లు తాజాగా తెరపైకి వచ్చాయి. ఇదీ చదవండి: (అనుష్కతో హగ్ ఎలా ఉంటుందంటే.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన నవీన్) హీరో అబ్బాస్, హీరోయిన్ ఫర్జానా ఇద్దరూ కూడా బిగ్‌బాస్ ఇంట్లోకి వెళ్తున్నట్లు సమాచారం. ప్రేమదేశం సినిమాతో తెలుగువారికి పరిచయం అయిన అబ్బాస్‌కు ఇక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ కొన్ని సినిమాల తర్వాత తన నటనకు గుడ్‌బై చెప్పి ఫ్యామిలీతో న్యూజిలాండ్‌కు వెళ్లిపోయాడు. తాజాగా కుటుంబంతో సహా ఆయన ఇండియాకు తిరిగొచ్చాడు. మళ్లీ సినిమా అవకాశాలు వస్తే నటిస్తానని పలు ఇంటర్వ్యల్లో కూడా ఓపెన్‌గా చెప్పాడు. అందులో భాగంగానే ఆయన బిగ్‌బాస్‌కు వెళ్లాలని ఫిక్స్ అయ్యాడట. ఇప్పటికే పలు తెలుగు యూట్యూబ్ ఛానల్స్‌కు ఆయన ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రేక్షకులకు మళ్లీ దగ్గరవుతున్నాడు. ఆయనతో పాటు హీరోయిన్ ఫర్జానా ఎంట్రీ కూడా దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. 'భాగ్యలక్ష్మి బంపర్ డ్రా' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయింది ఈ ముంబయ్ బ్యూటీ. సీమ శాస్త్రి, బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్,1977, కుబేరులు వంటి చిత్రాల్లో నటించింది. 2009 తర్వాత నుంచి ఆమె టాలీవుడ్‌కు దూరంగా ఉంది. తాజాగా ఆమె బిగ్‌బాస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వాలనే ప్లాన్‌లో ఉందట. (ఇదీ చదవండి: బిగ్ బాస్‌లోకి భర్త.. వద్దని వార్నింగ్ ఇచ్చిన టాప్ డైరెక్టర్ కూతురు) ఫర్జానాలో ఉన్న మరో టాలెంట్ డ్యాన్స్. బాలీవుడ్లో పలు ప్రైవేట్ ఆల్బమ్స్‌కు కొరియోగ్రాఫర్‌గా కూడా పనిచేసింది. హీరో హోండా, సన్ సుయ్, గోద్రెజ్ హెయిర్ కేర్, బిగ్ బజార్ వంటి ప్రముఖ సంస్థలకు ఆమె ప్రచారకర్తగా కూడా పనిచేసింది. ఇప్పుడు వీరిద్దరూ అనూహ్యంగా బిగ్‌బాస్ లిస్ట్‌లోకి వచ్చేశారని తెలుస్తోంది. -
మిర్యాలగూడ కోర్టుకు నయీం కేసు నిందితులు
గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో నిందితులను మంగళవారం మిర్యాలగూడ కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. హజరైన వారిలో నయీం అత్త సుల్తానా, బావమరిది సాధిక్, అతడి భార్య ఫర్జానా ఉన్నారు. వీరికి న్యాయమూర్తి ఈ నెల 6 వరకు రిమాండ్ విధించారు. -
ఎన్ఐఏ అధికారి భార్య కూడా..
న్యూఢిల్లీ : జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారి మొహమ్మద్ తంజిల్ అహ్మద్ భార్య ఫర్జానా అహ్మద్ (44) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌లో ఈ నెల 4వ తేదీన తంజిల్ అహ్మద్‌పై ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో తంజిల్ అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన సతీమణి తీవ్రంగా గాయపడ్డారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆమె ఈరోజు ఉదయం 11 గంటలకు మరణించారు. తంజీల్ దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ప్రధాన నిందితుడు మాత్రం పరారీలోనే ఉన్నాడు. కాగా వ్యక్తిగత కారణాలతోనే ఎన్ఐఏ అధికారిపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.