అదిరేటి డ్రస్సు మేమేస్తే...
పెంపుడు జంతువులను అదరగొట్టే డ్రెస్సులతో ఫ్యాషన్‌గా తయారుచేయడం అమెరికా, బ్రిటన్లలో ఓ ట్రెండ్‌గా మారిపోయింది. వాటిని ఫ్యాన్సీ డ్రెస్సులతో అందంగా ముస్తాబు చేయడానికి యజమానులు పోటీపడుతున్నారు. శుక్రవారం లండన్‌లో జరిగిన పెంపుడు జంతువుల ఫ్యాన్సీ డ్రెస్ పోటీలో పలు శునకాలు, మార్జాలాలు ఇలా వినూత్నమైన డ్రెస్సుల్లో అందర్నీ అలరించాయి.