breaking news
Expendables
-
సెల్కాన్ చేతికి టచ్ మొబైల్స్ - మహిళలకు అవకాశాలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్స్ తయారీలో ఉన్న సెల్కాన్ గ్రూప్ తాజాగా మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చైన్ టచ్ మొబైల్స్‌ను కొనుగోలు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో టచ్ మొబైల్స్‌కు 42 స్టోర్లు ఉన్నాయి. టచ్ బ్రాండ్ కింద దక్షిణాదితోపాటు మహారాష్ట్రలో 200 ఫ్రాంచైజీ స్టోర్లను స్థాపిస్తామని సెల్కాన్ సీఎండీ వై.గురు గురువారం మీడియాకు తెలిపారు. ‘కంపెనీ యాజమాన్యంలో మరో 50 ఔట్లెట్లు రానున్నాయి. వీటిలో కొన్ని కేంద్రాలను పూర్తిగా మహిళలే నిర్వహిస్తారు. ఆన్లైన్ పోటీతో చిన్న రిటైలర్ల మనుగడ కష్టం. గ్రూప్ కంపెనీల ద్వారా తయారీ సంస్థల నుంచి నేరుగా మొబైల్స్, గ్యాడ్జెట్స్ కొనుగోలు చేసి ఫ్రాంచైజీలకు సరఫరా చేస్తాం. తద్వారా ఆన్లైన్ కంటే తక్కువ ధరకే వీటిని విక్రయించవచ్చు’ అని వివరించారు. ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు.. మొబైల్స్ సర్వీస్, విక్రయాలలో సమగ్ర శిక్షణను అందించడానికి హైదరాబాద్‌లో ట్రైనింగ్ సెంటర్ స్థాపించాలని కంపెనీ యోచిస్తోంది. ఇందులో భాగంగా ఏటా 1,000 మంది వరకు అభ్యర్థులకు శిక్షణ ఇవ్వాలన్న ఆలోచన ఉందని సెల్కాన్ ఈడీ మురళి రేతినేని తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. సెల్కాన్ గ్రూప్ 2022–23లో రూ.2,600 కోట్ల టర్నోవర్ ఆర్జించింది. ఇంటెరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్, ట్యాబ్లెట్ పీసీలు, ఇతర ఉపకరణాల సరఫరా కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు పలు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆర్డర్లు వెల్లువెత్తుతున్నందున ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టర్నోవర్ రూ.5,000 కోట్లు ఆశిస్తోంది. -
ఎక్స్‌పెండబుల్స్ సీక్వెల్లో సల్మాన్?
హై వోల్టేజ్ హాలీవుడ్ యాక్షన్ ఫ్రాంచైస్ ‘ఎక్స్‌పెండబుల్స్’లో మన కండలవీరుడు సల్మాన్ ఖాన్ కూడా నటిస్తే..?! ఆయన అభిమానులకే కాక, యావత్ భారతీయ సినీ ప్రేక్షకులకు కూడా కన్నుల పండగే. సల్లూభాయ్ అభిమానులు కూడా తమ హీరో ఓ హాలీవుడ్ సినిమాలో నటిస్తే చూడాలని ఎంతో కాలం నుంచి ఉవ్విళ్లూరుతున్నారు. వారి కోరిక నెరవేరే అవకాశం ఉందని తెలుస్తోంది. హాలీవుడ్ స్టార్ సిల్వెస్టర్ స్టాలోన్‌కు సల్మాన్‌ఖాన్ వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో నటిద్దామని ట్విటర్ వేదికగా అనుకున్నారు కూడా. ‘కంబక్త్ ఇష్’ అనే చిత్రంలో తొలిసారిగా స్టాలోన్ బాలీవుడ్ తెరపై తళుక్కున మెరిశారు. సల్మాన్ ఖాన్ తాజా చిత్రం ‘సుల్తాన్’లో స్టాలోన్ కనిపించనున్నారని వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే, సిల్వెస్టర్ స్టాలోన్ ‘ఎక్స్‌పెండబుల్స్’ సీక్వెల్లో సల్మాన్ నటిస్తారని సమాచారం.