పుష్కర డ్యూటీకి తరలిన ఎక్సైజ్ సిబ్బంది
ఏలూరు అర్బన్: పుష్కరాలు జరిగే ప్రాంతాలు, గ్రామాల్లో మద్యం విక్రయాలు జరుపకుండా నిరోధించే క్రమంలో దాడులు నిర్వహించేందుకు జల్లా నుంచి ప్రత్యేక బృందాన్ని విజయవాడకు తరలించామని ఏలూరు యూనిట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వై. శ్రీనివాసచౌదరి తెలిపారు. కృష్ణా జిల్లాలో శుక్రవారం నుంచి కృష్ణా నది పుష్కరాలు ప్రారంభం కానున్న నేపధ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె. సురేష్ బాబు ఆధ్వర్యంలో 50మంది సభ్యులతో కూడిన దళాన్ని పంపామని వెల్లడించారు. పన్నెండు రోజుల పాటు జరిగే ఈ పుష్కరాల సమయంలో ఈ బృందం నగరం, నదీ పరీవాహక ప్రాంతాల్లో మద్యం విక్రయాలు నిరోధించేందుకు గస్తీ నిర్వహిస్తారని సూపరింటెండెంట్ చౌదరి వివరించారు.