మార్కెట్లో ఐసీఐసీఐ జోరు
ముంబై: రష్యా దిగ్గజం రాస్‌నెప్ట్ తో 1,300 కోట్ల డాలర్లు (సుమారు రూ.87,000 కోట్లు) ఎస్సార్ ఆయిల్ పెట్టుబడుల ఒప్పందం నేపథ్యంలో ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ కౌంటర్ లో జోష్ పెరిగింది. ఎస్సార్ గ్రూపు కుదుర్చుకున్న అతిపెద్ద ఒప్పందం తర్వాత .. కంపెనీకి లెండింగ్ బ్యాంక్ గా ఉన్న ఐసీఐసీఐ బ్యాంకు షేర్లకు సోమవారంనాటి మార్కెట్ లోమంచి డిమాండ్ పుట్టింది. మదుపర్ల కొనుగోళ్లతో షేర్ పరుగులు పెడుతోంది. దాదాపు 7 .5 శాతంపైగా ఎగిసింది. ప్రస్తుతం 5.63 శాతం లాభంతో నిఫ్టీ కంటే వేగంగ దూసుకుపోతూ ఇన్వెస్టర్లును ఆకర్షిస్తోంది.
ఈ డీల్ పై ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచ్చర్ మాట్లాడుతూ ఈ ఒప్పందం భారతీయ కార్పొరేట్ల బ్యాలెన్స్ షీట్ల పటిష్టతకు, డెలివరేజింగ్ ప్రక్రియలో ఒక ముఖ్యమైన అడుగు అని వ్యాఖ్యానించారు..ఎస్సార్ గ్రూప్ రూయాలకు కూడా బ్యాలన్స్ షీట్‌ను పటిష్ట పరచుకోవడంతో తమవంతు సహకారాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రూయా సోదరులు ఈ నిధులను రుణభారం తగ్గించుకోవడం తదితరాలకు వినియోగించనున్నట్లు తెలియజేశారు. ఎస్సార సహా ఇతర వివిధ కంపెనీల బ్యాలెన్స్ షీట్లు పటిష్టతకోసం సహాయం చేస్తున్నట్టు ఈ లక్ష్యం వైపుగా తమ పని కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.
కాగా రష్యా యొక్క రోస్నెఫ్ట్ తృత్వంలోని కన్సార్టియంకు రుయా సోదరులకు చెందిన ఎస్సార్ ఆయిల్ విక్రయ డీల్ ను అతిపెద్దదిగా ఎనలిస్టులు అభివర్ణిస్తున్నారు. అతిపెద్ద రిఫైనరీ ప్రాజెక్టు ఈక్విటీలో రష్యాకు చెందిన రోస్నెఫ్ట్ 49 శాతం, యునైటెడ్ క్యాపిటల్ పార్టనర్స్ కంపెనీ 24.5 శాతం వాటా , యూరప్‌కు చెందిన కమోడిటీస్ ట్రేడింగ్ కంపెనీ ట్రఫిగుర మరో 24.5 శాతం వాటా తీసుకుంటున్నాయి. దీంతో రష్యా కంపెనీ నేరుగా భారత పెట్రో ఉత్పత్తుల మార్కెట్లో ప్రవేశించబోతోంది. ఎస్సార్ ఆయిల్ కంపెనీకి చెందిన 450 కోట్ల డాలర్ల (సుమారు రూ.30,150 కోట్లు) అప్పులు కూడా రష్యా కంపెనీలకు బదిలీ అవుతాయి. మరోవైపు ఎస్సార్ గ్రూప్ కు భారీ రుణదాతలుగా ఉన్న బ్యాంకులకు ఈ డీల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని విశ్లేషకుల అంచనా