breaking news
Ensuring to farmers
-
మార్కెట్ కమిటీతో రైతులకు భరోసా
మెదక్ (పాపన్నపేట): మార్కెట్ కమిటీ ఏర్పాటుతో రైతులకు భరోసా లభిస్తుందని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం మెదక్‌జిల్లా పాపన్నపేట మండలంలో మార్కెట్ కమిటీ కార్యాలయాలు, గోదాములు నిర్మించడానికి అవసరమైన స్థలాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మెదక్ జిల్లాలో వరి, చెరకు పంటలు అత్యధికంగా పండించే మండలాల్లో పాపన్నపేట ఒకటి అని ఆయన తెలిపారు. స్థానికంగా మార్కెట్ కమిటీ లేకపోవడంతో రైతులు తాము పండించిన పంటను నిల్వ ఉంచుకునే అవకాశం లేక పొలంలోనే ధాన్యాన్ని తూకం చేసే వారన్నారు. ఈ విషయాన్ని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవెందర్‌రెడ్డి, మంత్రి హరీశ్ రావు దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే మార్కెట్ కమిటీ మంజూరు చేస్తూ మంత్రి హరీశ్ ఉత్తర్వులు జారీ చేశారని ఆయన తెలిపారు. పాపన్నపేటలో మహిళా జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల ఏర్పాటుకు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవెందర్‌రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. అందుకు అనువైన స్ధలాన్ని ఇచ్చేందుకు దాతలు గాని, ప్రభుత్వ భూమి గాని సిద్ధంగా ఉండేలా చూడాలని స్ధానిక నాయకులకు సూచించారు. పాపన్నపేట ఏపీజీవీ బ్యాంకులో సరైన సేవలందక వినియోగదారులు, రైతులు, ఉపాధి కూలీలు, డ్వాక్రా గ్రూపు మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్ధులు తెలిపారు. ఈ విషయాన్ని డిప్యూటీ స్పీకర్ దృష్టికి తీసుకెళ్ళి బ్యాంకు స్థాయి పెంచేందుకు కృషి చేస్తామన్నారు. అలాగే ఎస్‌బిహెచ్ శాఖ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. -
‘వరుణ’ బాధిత రైతులకు సర్కారు సాయం
♦ త్వరలోనే ప్రకటిస్తామన్న సీఎం కేజ్రీవాల్ ♦ రైతులకు భరోసా ఇవ్వాలని సూచన ♦ వెంటనే తోడ్పాటు అందిచాలి: మాకెన్ న్యూఢిల్లీ: అకాల వర్షాలకు కుదేలైన రైతులకు ఢిల్లీ సర్కార్ ఊరటనిచ్చే ప్రకటన చేసింది. ‘అనుకోని వడగళ్ల వానలతో పంటలు కోల్పోయిన బాధిత రైతులకు ప్రభుత్వం అతి త్వరలోనే ఉపశమన ప్యాకేజీ ప్రకటిస్తుంది.’ అని ఢిల్లీ ముఖ్య మంత్రి అర్వింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఢిల్లీలోని గ్రామ నియోజకవర్గాలైన మాటియాలా, నజాఫ్‌ఘర్, ముంద్కా, నరేలా ఎమ్మెల్యేలతో శుక్రవారం భేటీ అయ్యారు. దేశ రాజధాని శివారుల్లో ఉండే తమ నియోజకవర్గాలే వర్షాల వల్ల సష్టపోయాయని సీఎంకు ఎమ్మెల్యేలు వివరించారు. ప్రభుత్వం బాధిత రైతుల వెంట ఉందనే భరోసా ఇవ్వండని కేజ్రీవాల్ వారికి సూచించారు. ప్రభుత్వం త్వరలోనే బాధిత రైతులు నష్ట పరిహారం చెల్లించి అన్ని విధాలా ఆదుకుంటుందనే ధైర్యం ఇవ్వాలని పురమాయించారు. అకాల వర్షాల వల్ల వేల ఎకరాల పంట భూములు నాశనమయ్యాయని సీఎంకు నజాఫ్‌ఘర్ ఎమ్మెల్యే కైలాష్ గెహ్లాట్ వివరించారు. బాధితులందరినీ ఆదుకుంటామని కేజ్రీవాల్ భరోసా ఇచ్చారు. ప్రభావిత గ్రామాలను సందర్శించిన మాకెన్ వర్షాల ప్రభావిత మూడు గ్రామాలను ఇటీవల ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ మాకెన్ సందర్శించారు. బాధిత రైతులకు వెంటనే ప్రత్యేక తోడ్పాటు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.