breaking news
England Premier League
-
డీగో జోటా కుటుంబానికి చెల్సీ క్లబ్ సాయం
లండన్: ఇంగ్లండ్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) విఖ్యాత ఫుట్‌బాల్ క్లబ్ చెల్సీ పెద్ద మనసు చాటుకుంది. గత నెలలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పోర్చుగల్ యువ మిడ్‌ఫీల్డర్, లివర్‌పూల్ క్లబ్ ఫార్వర్డ్ డీగో జోటా కుటుంబానికి ఆర్థిక చేయూత ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఏడాది జరిగిన క్లబ్ వరల్డ్‌కప్ ఫైనల్లో చెల్సీ జట్టు 3–0తో యూఈఎఫ్ఏ చాంపియన్ పారిస్ సెయింట్ జర్మయిన్ (పీఎస్జీ)పై ఘనవిజయం సాధించింది. దీంతో క్లబ్‌కు ప్రైజ్‌మనీతో పాటు బోనస్ కలిపి మొత్తం 11.4 మిలియన్ డాలర్లు (సుమారు రూ.100 కోట్లు) లభించాయి. ఈ మొత్తాన్ని ఆటగాళ్లంతా సమాన భాగాలు చేశారు. ఇందులో నుంచి 5 లక్షల డాలర్లు (రూ.4.38 కోట్లు) మృతి చెందిన లివర్‌పూల్ క్లబ్ ప్లేయర్ డీగో జోటా కుటుంబసభ్యులకు ఇచ్చేందుకు చెల్సీ సిద్ధమైంది. ఈ మేరకు చెల్సీ క్లబ్ గురువారం అధికారికంగా ప్రకటించింది. పోర్చుగల్‌కు చెందిన జోటా పావోస్ డి ఫెరీరాతో ఫుట్‌బాల్ కెరీర్‌ను ప్రారంభించాడు. తర్వాత 2016లో అట్లిటికో మాడ్రిడ్‌తో జట్టు కట్టాక కెరీర్లో ఊపందుకున్నాడు. ప్రీమియర్ లీగ్‌లో వాల్వొర్హాంప్టన్ వాండరర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత 2020 నుంచి లివర్‌పూల్ జట్టుకు ఆడుతున్నాడు. 2024–2025 ఇంగ్లండ్ ప్రీమియర్ లీగ్ సీజన్లో లివర్‌పూల్ చాంపియన్‌గా నిలిచింది. -
మెరుగ్గా ఆడాల్సిందే...
గతేడాది పేలవ ఫామ్‌తో ఇబ్బంది ఎదుర్కొన్న చెల్సీ మిడ్ ఫీల్డర్ ఈడెన్ హజార్డ్ ప్రస్తుత ఇంగ్లండ్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) ఫుట్‌బాల్ సీజన్లో దుమ్మురేపుతున్నాడు. పారుుంట్ల పట్టికలో టాప్‌లో ఉన్న చెల్సీకి తను ప్రస్తుతం కీలక ఆటగాడిగా మారాడు. తన కెరీర్లోనే అత్యుత్తమంగా ఆడుతున్న ఈ బెల్జియన్ ఇప్పటికే ఏడు గోల్స్ నమోదు చేశాడు. నేడు (శనివారం) మాంచెస్టర్ సిటీతో జరిగే పోరులో బరిలోకి దిగబోతున్న హజార్డ్ చెప్పిన విషయాలు అతడి మాటల్లోనే... ఈ సీజన్‌ను చెల్సీ మెరుగ్గా ఆరంభించింది. టైటిల్ రేసులో ఉండేందుకు ఈ మ్యాచ్ కీలకంగా భావిస్తున్నారా? కచ్చితంగా. ఎందుకంటే టైటిల్ పోరులో మాంచెస్టర్ సిటీ, లివర్‌పూల్ మాకు గట్టి పోటీదారులు. రెండు పటిష్ట జట్లే కాకుండా చాలా బాగా ఆడుతున్నారుు. చివరి వరకు ఉండాలనుకుంటే ఆ రెండు జట్లకన్నా మెరుగ్గా ఆడాల్సిందే. మాంచెస్టర్ సిటీని ఓడించి ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు పంపాలనుకుంటున్నారా? అవును. ఎతిహాద్‌లో మ్యాచ్ గెలవడం చాలా కష్టం. ఆ జట్టులో నైపుణ్యం కలిగిన ఆటగాళ్లున్నారు. అగెరో, డి బ్రూనే ప్రమాదకరమే. ఇదో మంచి మ్యాచ్ కావడంతో పాటు మాకు విజయం లభిస్తే మరింత లాభం. ఇలాంటి పెద్ద మ్యాచ్‌లు ఓడితే ఎలా ఫీలవుతారు? మాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో.. ఎందుకంటే ఇప్పటికే మేము అర్సెనల్, లివర్‌పూల్‌పై ఓడాం. అలాంటి ఓటమి మరోటి కావాలనుకోవడం లేదు. ఇప్పుడైతే మేం ఆత్మవిశ్వాసంతో ఉన్నాం.