breaking news
Employees worry
-
ఉద్యోగాల ఊచకోత: ఫౌండర్స్ ఆ పనిచేయొచ్చుగా? అష్నీర్ గ్రోవర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: భారత్‌పే సహ వ్యవస్థాపకుడు, మాజీ ఎండీ అష్నీర్ గ్రోవర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాల్లో కోత ఎందుకు? సుదీర్ఘ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని స్వయంగా ఫౌండర్స్ జీతాలు తగ్గించుకోవచ్చుగా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదాయాలు క్షీణత, ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఉద్యోగులకు ఉద్వాసన పలికే బదులు ఫౌండర్లు తమ వేతనాల్లో కోత విధించుకోవచ్చు కదా ఆయన సూచించడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఉద్యోగులను తొలగించాల్సిన అవసరం లేకుండా, వ్యవస్థాపకుడిగా దీర్ఘకాలికంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఐటీ, సహా పలు రంగాలల్లో ఉద్యోగాల కోతపై స్పందించిన గ్రోవర్ ఈ కీలక వ్యఖ్యలు చేశారు. ప్రతీరోజు ఉద్యోగాలు కోల్పోతున్న వార్తలు వినడం విచారకరం. అదృష్టవశాత్తూ తాను అలాంటి చర్యలు తీసుకోకపోవడంపై సంతోషంగా ఉంది. నియామకాల విషయాల్లో జాగ్రత్తగా, శ్రద్ధగా ఉంటాం. అలాగే జాబ్స్ కట్లో ఫౌండర్స్‌గా దీర్ఘకాలికంగా ఆలోచించాల్సి ఉందంటూ తాజా లింక్డ్ఇన్ పోస్ట్‌లో గ్రోవర్ పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగాల తీసివేతకు ప్రత్యామ్నాయంగా తాను కొంతకాలం క్రితం 25-40 శాతం జీతం తగ్గించుకున్నా అని గుర్తు చేశారు. మిగిలిన, వ్యవస్థాపకులు ఈ మార్గంలో ఎందుకు ఆలోచించడం లేదో తనకు అర్థం కావడం లేదు. శక్తి, మూలధనం, సాంకేతికత, ప్రతిదానికీ ఉన్న ప్రాధాన్యత ఉద్యోగులకు ఎందుకు ఉండదు అంటూ ఆయన ప్రశ్నించారు. -
ఆర్థిక సంక్షోభంలో ఉద్యమాలగడ్డ
► జీతాలు, పెన్షన్లు ఇవ్వలేని దుస్థితి ► వర్సిటీ స్వయం వనరుల నిధులు జీతాలకు మళ్లింపు ► డిమాండ్ల సాధనకు ఉద్యోగుల ఆందోళన సాక్షి, సిటీబ్యూరో: ఎందరో మేథావులను ప్రపంచానికి అందించిన ప్రఖ్యాత ఉస్మానియా యూనివర్సిటీ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల చెల్లింపుల కోసమూ జేబులు తడుముకోవాల్సిన దీనస్థితికి దిగజారిపోయింది. దీంతో విద్యార్థుల పరిశోధనలకు వినియోగించాల్సిన నిధులను వేతనాలకు మళ్లించాల్సి వస్తోంది. ప్రభుత్వం ఏటా బ్లాక్ గ్రాంట్ రూపంలో కేటాయిస్తున్న నిధులు ఏమూలకు చాలడం లేదు. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లకు ఏడాదికి రూ. 370 కోట్ల వరకు అవసరం కాగా, గత రెండేళ్లుగా ప్రభుత్వం రూ. 238 కోట్ల చొప్పున కేటాయించింది. దీనికితోడు గత ఏడాది నిధులు పూర్తిస్థాయిలో విడుదల కాకపోవడం గమనార్హం. ఓయూ చరిత్రలోనే ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం ఇదే తొలిసారని పలువురు పేర్కొంటున్నారు. ప్రతి నెలా ఎదురు చూపులే.. గతేడాది ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించిన ప్రభుత్వం దానిని పరిగణలోకి తీసుకోకుండా ఎప్పటిలానే రూ. 238 కోట్లు విడుదల చేసింది. దీంతో ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు సకాలంలో అందడం లేదు. తగ్గిన వనరులు.. ఓయూ పరిధి మూడు జిల్లాలకే పరిమితం కావడం, కళాశాలల సంఖ్య తగ్గడంతో ఆదాయం రూ. 80 కోట్లకు పడిపోయింది. ఈ నిధులను విద్యాభివృద్ధికి, పరిశోధనలకు వినియోగించాల్సి ఉండగా, ప్రభుత్వం నుంచి అదనపు నిధులు అందకపోవడంతో వాటిని వేతనాలకు మళ్లిస్తున్నారు. బ్లాక్ గ్రాంట్స్ పెంచాలి.. ప్రస్తుతం వర్సిటీలో పర్మినెంట్, కాంట్రాక్ట్ ఉద్యోగులు 1,800, టైం స్కేల్ ఉద్యోగులు 283 మంది ఉన్నారు. బ్లాంక్ గ్రాంట్‌కు ఈ ఏడాది అదనంగా రూ. 100 చెల్లించాలని, టైం స్కేల్ ఉద్యోగులను క్రమబద్దీకరించి పదో పీఆర్సీ అమలు చేయాలని పట్టుబడుతున్నారు.