breaking news
Emmiganoor
-
మోసం: కారు గెలుచుకున్నారంటూ లూటీ
సాక్షి, ఎమ్మిగనూరు రూరల్: లక్కీడిప్ పేరుతో సైబర్ నేరగాళ్ల మోసానికి పట్టణానికి చెందిన ఓ యువకుడు బలయ్యాడు. ఒకే రోజు రూ.47,580లు ఫోన్ పే ద్వారా డబ్బు పంపి మోసపోయాడు. బాధితుడు తెలిపిన వివరాలు.. పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన ఎం శ్రీనివాసులు షాపుల్లో చిన్న చిన్న పనులు చేసి జీవనం సాగించేవాడు. గత నెలలో షాప్ క్లూస్‌లో ఆన్లైన్ షాపింగ్ ద్వారా టీషర్ట్ కొనుగోలు చేశాడు. ఈ నెల 2న టీషర్ట్ తీసుకున్నందుకు మహింద్రా కంపెనీ కారు లక్కీ డ్రాలో గెలుపొందారంటూ మేసేజ్ వచ్చింది. పూర్తి వివరాల కోసం 7890946443 నంబరుకు ఫోన్ చేయాలని ఉంది. వెంటనే ఫోన్ చేయగా ఫోన్‌తో పాటు కారు గెలుపొందారని, కారు వద్దనుకుంటే రూ.14,43,000 బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తామని అవతలి వ్యక్తి నమ్మబలికాడు. అందుకు ట్యాక్స్ కింద రూ.14,430, ఆర్బీఐ చార్జీల కింద రూ.23,150, సేవింగ్ అకౌంట్ నుంచి కరెంట్ అకౌంట్‌కు మార్పు చేయడానికి రూ.10 వేలు పంపాలని చెప్పటంతో అలాగే పంపాడు. అదే రోజు సాయంత్రం 5.36 గంటలకు మరోసారి ఫోన్ చేసి ఎన్ఈఎఫ్టీ చార్జీ కింద రూ.24,600 పంపాలని చెప్పడంతో అనుమానం వచ్చింది. ఇప్పటికే రూ. 47,580లు పంపానని ఇంకా డబ్బు కావాలనడంలో మతలబు ఏమిటని ప్రశ్నించాడు. అయినా తాము అడిగిన డబ్బు పంపితేనే మొత్తం డబ్బు జమ చేస్తామని చెప్పడంతో మోసపోయినట్లు గ్రహించి లబోదిబోమంటున్నాడు. (చదవండి: లోన్ యాప్.. కటకటాల్లోకి చైనీయులు) -
టికెట్ల తొక్కిసలాటలో ఓ వ్యక్తి మృతి!
ఎమ్మిగనూరు: కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో విషాదం నెలకొంది. స్థానిక శివ థియేటర్ లో టికెట్ల కోసం తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఊపిరాడక ఒక వ్యక్తి మృతి చెందాడు. భారీ సంఖ్యలో అభిమానులు వస్తారని తెలిసినా.. థియేటర్ యాజమాన్యం తగిన ఏర్పాట్లు చేయడంలో నిర్లక్ష్యం వహించారని మృతుడి బంధువులు ఆరోపించారు. ప్రేక్షకులకు సరియైన ఏర్పాటు చేయడంలో విఫలం కావడం వల్లనే ఓ వ్యక్తి మరణానికి కారణమైందని పలువురు విమర్శిస్తున్నారు. థియేటర్ యాజమాన్య వైఖరి నిరసిస్తూ మృతదేహంలో బంధువు ఆందోళన చేపట్టారు.