టీడీపీ రాస్తారోకో
గంగాధర: ఎంసెట్ లీకేజీలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ శనివారం గంగాధర చౌరస్తాలో తెలుగుదేశం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ప్రవేశ పరీక్షలు నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందని టీడీపీ నాయకులు విమర్శించారు. సంబంధిత మంత్రులు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎంసెట్ 2 ను రద్దు చేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని, లీకేజీ సూత్రదారులపై చర్యలు తీసుకోవాలని, లీకేజీ ద్వారా ర్యాంకుల సా«ధించిన వారిని అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాస్తారోకోలో టీడీపీ మండలస్థాయి, గ్రామస్థాయి నాయకులు పాల్గొన్నారు.