breaking news
eedara hari babu
-
టీడీపీకి షాక్.. కొత్త పార్టీ యోచనలో మాజీ ఎమ్మెల్యే..!
సాక్షి, ఒంగోలు : ప్రకాశం జిల్లాలో టీడీపీకి గట్టి షాక్ తగలనుంది. గతకొంత కాలంగా టీడపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న జిల్లా పరిషత్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు ఎన్నికల వేళ పార్టీ మారతారనే వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే, విద్యారంగంలో సంస్కరణలు తెచ్చే పార్టీకే తన మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు రెండు రోజుల్లో ప్రజాభిప్రాయం తీసుకుంటానని తెలిపారు. ఎన్నికల అనంతరం కొత్త పార్టీ పెడతానని ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేస్తానని, ప్రజా ఉద్యంమంలోకి వెళ్తానని తెలిపారు. టీడీపీలో తనకు చాలా అవమానాలు జరిగాయని వాపోయారు. పొన్నలూరు నుంచి టీడీపీ జడ్పీటీసీగా గెలుపొందిన హరిబాబు.. స్వతంత్ర అభ్యర్థిగా చైర్మన్ పోటీలోకి దిగి ఒక ఓటు తేడాతో టీడీపీ అభ్యర్థి మన్నె రవీంద్రపై గెలుపొందారు. (టార్గెట్ ఈదర!) -
హైకోర్టులో హరిబాబు అప్పీల్ కొట్టివేత
సాక్షి, హైదరాబాద్ : ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్మన్‌గా తన విధులు నిర్వర్తించే విషయంలో అధికారులకు ఆదేశాలు జారీ చేసేందుకు సింగిల్ జడ్జి నిరాకరించారంటూ ఈదర హరిబాబు దాఖలు చేసిన అప్పీల్‌ను హైకోర్టు ధర్మాసనం మంగళవారం కొట్టేసింది. ఈ మొత్తం వ్యవహారం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున తాము ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమంటూ ధర్మాసనం స్పష్టం చేసింది. -
వైస్చైర్మన్నే చైర్మన్‌గా కొనసాగించాలని హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: ప్రకాశం జడ్పీ చైర్మన్ వివాదంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల జారీ చేసింది. తుది తీర్పు వచ్చే వరకు వైస్ చైర్మన్‌ను చైర్మన్‌గా కొనసాగించాలని హైకోర్టు ప్రకాశం జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈదర హరిబాబు దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌పై మూడు నెలల్లోగా విచారణ ముగించాలని జిల్లా కోర్టును ఆదేశించింది. విఫ్ దిక్కారించారంటూ తనపై చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఈదర హరిబాబు గతంలో హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారించిన సింగిల్ బెంచ్ కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసింది. దీంతో ఈదర హరిబాబు జడ్పీ చైర్మన్‌గా భాద్యతలు స్వీకరించారు. దీన్ని సవాలు చేస్తూ టిడిపి విప్ నర్సింహం హైకోర్టులో డివిజన్ బెంచ్ ముందు రిట్ అప్పీల్ చేశారు. రిట్ అప్పీల్‌ను పరిశీలించిన హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. వైస్ చైర్మన్‌నే జడ్పీ చైర్మన్‌గా కొనసాగించాలని ఆదేశించింది. ** -
విలువలా..హవ్వా..!
సాక్షి, ఒంగోలు: ‘జిల్లా పరిషత్ ఎన్నికల్లో విలువలెక్కడున్నాయి..? అంతా అవకాశాలే కదా..! నేను టీడీపీకి నమ్మకద్రోహం చేయడమేంటి..? ఆ మాట అనే హక్కు జిల్లా టీడీపీ నేతల్లో ఎవరికీ లేదు.. దివంగత ఎన్టీరామారావు ఆశయం నా రక్తంలోనే ఉంది..’ అని జిల్లాపరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు స్పష్టం చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశిస్తే.. తాను జెడ్పీచైర్మన్ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమన్నారు. ఆయన సోమవారం తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ..జిల్లా టీడీపీ నేతలు తనపై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. పార్టీ నుంచి తనను ఎందుకు సస్పెండ్ చేశారనేది తెలియదన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు హామీని నిలబెట్టేందుకే తాను జెడ్పీపీఠం అధిరోహించానన్నారు. కిందటి ఒంగోలు అసెంబ్లీ ఉప ఎన్నికలప్పుడు జిల్లాపార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌తో పాటు తనను కూర్చోబెట్టి చంద్రబాబు మాట్లాడిన సమయంలో.. అధినేత హామీనిచ్చారని గుర్తు చేశారు. తనకు పదవి రాకుండా చేసేందుకు ‘స్థానిక’ పార్టీనాయకత్వం అనేక కుట్రలకు పాల్పడిందని.. త్వరలోనే చంద్రబాబును కలిసి కొందరి పెత్తనంను వివరిస్తానని చెప్పారు. పార్టీకతీతంగా బీఫారం లేకుండా స్వతంత్రంగా పోటీచేశానని.. తనకు టీడీపీ విప్ వర్తించదన్నారు.విప్ జారీపై ఇన్నాళ్లలో పార్టీ నేతలెవరూ తనతో సంప్రదించలేదన్నారు. నైతిక విలువలా... హవ్వా...! ‘జెడ్పీ ఎన్నికల్లో నైతిక విలువల ప్రస్తావన ఎందుకు..? అంతా లాక్కోవడమే కదా.. జిల్లాలోని 56 జెడ్పీటీసీల్లో టీడీపీ గెలుచుకుంది 25 స్థానాలు. మరి, జెడ్పీచైర్మన్ పదవిని ఏవిధంగా కైవసం చేసుకుంటుంది. అవతల వారిని లాక్కొనే కదా..! వైఎస్సార్ సీపీ శిబిరం నుంచి ముగ్గురు టీడీపీకి వస్తే.. అందులో ఇద్దర్ని నేనే తెచ్చా.. టీడీపీకి అప్పుడు తెలియదా..? ఈ నైతికత.. మీరు (టీడీపీ) ముగ్గుర్ని మంచి చేసుకున్నారనుకుంటే, నేను 27 మందిని మంచిచేసుకున్నాను. మీస్థాయి గొప్పదా.. నేను గొప్పా..? దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు రాజకీయవ్యూహం నడపడంలో తప్పేమీలేదు. జెడ్పీచైర్మన్‌గా చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు నిలబెట్టాలనుకున్నారు. అందుకే, పొన్నలూరు జెడ్పీటీసీగా నన్ను నిలబెట్టారు. స్థానిక నాయకత్వానికి నాపై ఎందుకంత కసి, పగ.. నేను కరణం బలరాంకు వ్యతిరేకంగా అద్దంకిలో పోటీకొస్తానా..? ఒంగోలులో జనార్దన్, దర్శిలో శిద్ధా రాఘవరావు, పర్చూరు ఏలూరి సాంబశివరావుకు పోటీవచ్చే నాయకుడ్ని కాదు కదా..? మరెందుకు, నేను జెడ్పీచైర్మన్ అవుతానంటే వీరంతా కలిసి అడ్డం పడుతున్నారు. నాకు పోటీగా మన్నం రవీంద్రను తెచ్చారు. ఆది నుంచి జిల్లా నేతలు నన్ను అలక్ష్యం చేస్తూనే ఉన్నారు. అందుకే వారిపై నమ్మకం కలగలేదు. ఇప్పుడు నేను టీడీపీలో ముఖ్యసభ్యుడ్ని కాదనే అర్హత ఎవరికీ లేదు. ఈ జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం, పూలాభిషేకం చేయాలంటే నా ఒక్కడికే హక్కుంది. ఇంకెవ్వరికీ, ఆ అధికారం.. హక్కు లేదు. నా మంచితనం, పరిచయాలు ఉపయోగించుకుని స్వతంత్రంగా పోటీచేస్తానని.. నాకు మద్దతివ్వాలని వైఎస్సార్సీపీని కోరాను. అదే విలువలతో వైస్‌చైర్మన్ పదవికీ స్వతంత్ర అభ్యర్థికైతేనే నేను ఓటేస్తానని చెప్పాను. ఓటేశాను. జిల్లాలో 55 మంది జెడ్పీటీసీలకు నేను చైర్మన్‌ను. అందర్నీ కలుపుకునిపోతాను. అభివృద్ధిలో రాష్ట్రంలోనే నంబర్ ఒన్ జిల్లాగా మారుస్తానని’ జెడ్పీ చైర్మన్ హరిబాబు స్పష్టం చేశారు.