breaking news
East-West
-
అల్ప పీడనం: మరో రెండు రోజుల పాటు వర్షాలు
సాక్షి, అమరావతి: తూర్పు-పశ్చిమ బంగాళఖాతం షేర్ జోన్ 20 °N అక్షాంశం వెంబడి సెంట్రల్ ఇండియా మీదుగా ఉపరితల ద్రోణి 4.5 కిమీ నుంచి 7.6 కిమీ ఎత్తు మధ్య కొనసాగుతున్న అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇది ఎత్తుకు వెళ్ళేకొద్దీ నైరుతి దిశ వైపుకు వంపు తిరిగి ఉండటం వల్ల ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో ఆగష్టు 19వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అంతేగాక తదుపరి 42 గంటల్లోగా ఈ ఉపరితల ద్రోణి మరింత బలపడి క్రమంగా పడమర వైపుకు కదిలే అవకాశం ఉందని వాతావారణ కేంద్రం అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీకి రాగల మూడు రోజుల పాటు వర్ష సూచన తూర్పు-పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తాంధ్ర, యానం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఇవాళ, రేపు(బుధవారం) ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు చాలా చోట్ల తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గురువారం కూడా ఈ మూడు ప్రాంతాల్లో చాల చోట్ల తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ అధికారులు హెచ్చరించారు. -
రైతుల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
కోరుకొండ, న్యూస్‌లైన్ :వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన్న నిలుస్తుందని ఆపార్టీ సీజీసీ సభ్యులు జక్కంపూడి విజయలక్ష్మి, జ్యోతుల నెహ్రూ అన్నారు. బుధవారం నర్సాపురం మాజీ ఎంపీటీసీ సభ్యుడు జ్యోతుల లక్ష్మినారాయణ సుజాత దంపతులు నూతనంగా కోరుకొండలో ఏర్పాటు చేసిన సుజి భోజనం హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జక్కం పూడి విజయలక్ష్మి, జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ వరదలు వచ్చిన వెను వెంటనే వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ శ్రీకాకుళం, కృష్ణ, తూర్పు పశ్చిమ తదితర జిల్లా పర్యిటించారన్నారు. రైతులను, ముంపు బాధిత ప్రజలను వైఎస్ విజయమ్మ పరామర్శించి వారికి ధైర్యం చెప్పారన్నారు. కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి పంట నష్ట పరిహారం, పంట రుణ మాఫీకి కృషి చేస్తామని ఆమె హామీ ఇచ్చారన్నారు.కాంగ్రెస్,టీడీపీలకు ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని వారు తెలిపారు. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి, రాజమండ్రి సిటీ,రూరల్ కన్వీనర్లు బొమ్మన రాజ్‌కుమార్, ఆకుల వీర్రాజు, సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి సుంకర చిన్ని, పార్టీ నాయకులు ములగాడ ఫణి, జక్కంపూడి రాజా, చింతపల్లి చంద్రం, తాడి హరిశ్చంద్రప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.