EAS Sarma
-
అచ్యుతాపురం ఘటన.. చంద్రబాబుకు విశ్రాంత ఐఏఎస్ బహిరంగ లేఖ
సాక్షి, విశాఖపట్నం: గత ప్రభుత్వ కాలంలోనే కాకుండా.. అంతకుముందు పాలించిన మీ హయాంలోనూ పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగాయని సీఎం చంద్రబాబుకు విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఎఎస్ శర్మ గుర్తుచేశారు. అచ్యుతాపురం సెజ్‌లోని ఎసైన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం దృష్ట్యా భవిష్యత్తులో ఈ తప్పిదాలు జరగకుండా ముఖ్యమంత్రికి పలు సూచనలు చేస్తూ శర్మ శనివారం బహిరంగ లేఖ రాశారు.ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటుచేసి లాభాలు గడిస్తూ అక్కడి కార్మికులు, స్థానికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న యాజమాన్యాల మీద ఏ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవట్లేదని ఆయన పేర్కొన్నారు. కొందరు రాజకీయ నాయకులకు, పరిశ్రమల యజమానుల మధ్య ఉన్న సంబంధాలే దీనికి కారణమని ఆరోపించారు.గత ప్రభుత్వ తప్పిదాలవల్లే ప్రమాదాలు జరిగాయన్న చంద్రబాబు వ్యాఖ్యలపై శర్మ స్పందిస్తూ.. 2014లో తమరు అధికారంలో ఉన్న సమయంలోనూ ప్రమాదాలు జరిగిన విషయం గుర్తుచేసుకోవాలని సూచించారు. 2013 నుంచి 2019 మధ్య కాలంలో కేవలం పరవాడ ఫార్మా సెజ్‌లోనే 24 ప్రమాదాలు సంభవించగా 21 మంది ప్రాణాలు కోల్పోయారనీ, 69 మంది గాయాలపాలయ్యారన్నారు. ప్రభుత్వం ఏదైనా ప్రమాదాలు సహజంగా మారిపోయాయని విమర్శించారు.మీరు వచ్చి వెళ్లగానే మరో ప్రమాదం.. ఎసైన్షియా ప్రమాద బాధితుల్ని పరామర్శించి వెళ్లిన రోజు రాత్రే మరో ప్రమాదం జరిగిన విషయం కూడా చంద్రబాబు గుర్తుచేసుకోవాలని ఈఏఎస్ శర్మ ఆ లేఖలో పేర్కొన్నారు. ఇంతమంది మృత్యువాత పడుతున్నా పరిశ్రమల యజమానులు ఎందుకు ఒక్కరోజైనా జైలుకు వెళ్లడంలేదని ప్రశ్నించారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందించడం అభినందనీయమే అయినా.. ఇలాంటి దురదృష్టకరమైన ఘటనలు పునరావృతం కాకుండా నిబంధలను కఠినతరం చేయాలని ఆయన కోరారు.పరిశ్రమల్లో ప్రమాదాలను, కాలుష్యాన్ని పూర్తిగా అరికట్టాలంటే, ప్రభుత్వ విధానాల్లోనూ, వైఖరిలోనూ లోతైన మార్పులు రావాలన్నారు. ఎసైన్షియా యాజమాన్యాన్ని ప్రభుత్వం క్షమించకూడదనీ.. చట్ట ప్రకారం కఠినంగా శిక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనల అమలులో ఉదాశీనంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ అధికారులపైనా చర్యలు తీసుకోవాలంటూ శర్మ డిమాండ్ చేశారు. -
‘ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకోలేదు’
సాక్షి, విశాఖపట్నం: అధికార వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి సాధ్యమని రిటైర్డ్ ఐఎఎస్ ఇఎఎస్ శర్మ తెలిపారు. రాష్ట్రంలో మూడు రాజధానుల ప్రకటనను స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు. ఆయన గురువారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం అభినందనీయమన్నారు. గత టీడీపీ ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పిన మా సలహాలు పట్టించుకోలేదన్నారు. రాజధాని పేరుతో అభివృద్ధి ఒకేచోట జరగకూడదని చెప్పారు. పాలన ప్రజల వరుకు వెళ్తేనే న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరిగి అభివృద్ధి ఫలాలు అందరికి అందాలని ఆకాంక్షించారు. మూడు రాజధానుల ద్వారా వికేంద్రీకరణ జరగాలన్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రకటనతో అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందనే భావన అన్ని ప్రాంతాల ప్రజలకు కలుగుతుందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆరు నెలల పాలనలో మద్యపాన నిషేధం, ‘దిశ’ చట్టం వంటి నిర్ణయాల పట్ల హర్షం వ్యక్తం చేశారు. (చదవండి: ఆంధ్రప్రదేశ్‌కు 3 రాజధానులు!) -
ఏపీ ఐటీ సలహాదారుడికి ఆధార్ ఛైర్మన్ పదవా!
-
నాలుగేళ్ల ప్రజాధనం అంతా అమరావతికి తరలించారు
-
సింగపూర్ కంపెనీలకు పరిహారంగా ప్రజల సొమ్మా?
-
'చీఫ్ సెక్రటరీ ఎలా ఒప్పుకున్నారో అర్థం కావడం లేదు'
విశాఖపట్నం : స్విస్ ఛాలెంజ్ విధానం చాలా అభ్యంతరకరమైనదని కేంద్ర ఇంధన శాఖ మాజీ కార్యదర్శి, విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ అన్నారు. బుధవారం విశాఖపట్నంలో ఈఏఎస్ శర్మ మాట్లాడుతూ... రాజధాని కోసం రైతుల నుంచి భూములు తీసుకుని.. విదేశీ ప్రైవేట్ కంపెనీల కన్సార్షియంకు ఇస్తున్నారని ఆరోపించారు. భూములకు సంబంధించి ఎవరెవరితో ఒప్పందాలు చేసుకున్నారో బయటపెట్టాలని టీడీపీ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ వెబ్సైట్లలోనూ ఎక్కడా ఒప్పందాల్లోని వివరాలు లేవని ఈఏఎస్ శర్మ గుర్తు చేశారు. ప్రభుత్వానికి కనీసం 51 శాతం ఉంటేనే... స్విజ్ చాలెంజ్ విధానాన్ని ఉపయోగించాలని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రభుత్వానికి 51 శాతం లేకుంటే... ఏపీ మౌలిక సదుపాయాల కల్పన చట్టాన్ని ఉల్లంఘించినట్లు అవుతుందన్నారు. ఓ వేళ కోర్టు కొట్టేసినా... పరిహారం కింద నగదు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఎక్కడా ప్రజాహిత చర్యలు కాని... విధానాలు కాని లేవన్నారు. సింగపూర్ కంపెనీలకు ఎలాగోలా లాభాం చేకూర్చే విధానాలే కనిపిస్తున్నాయని ఈఏఎస్ శర్మ తెలిపారు. స్విస్ ఛాలెంజ్‌కు చీఫ్ సెక్రటరీ ఎలా ఒప్పుకున్నారో అర్థం కావడం లేదన్నారు. ముఖ్యమంత్రే నేరుగా సంప్రదింపులు జరపడం సరికాదని ఈఏఎస్ శర్మ అభిప్రాయపడ్డారు.