breaking news
EAMCET 2015
-
ఎంసెట్‌లో ‘అనంత’ జయకేతనం!
యూనివర్సిటీ : ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ ఎంట్రెన్స్ టెస్ట్-2015 ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం పెరిగింది. గత ఎంసెట్ ఉమ్మడిగా నిర్వహించడంతో మార్కులు అధికంగా వచ్చినప్పటికీ, ర్యాంకులు ఆశాజనకంగా లేవు. తాజా ఎంసెట్ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా నిర్వహించడంతో ఉత్తీర్ణతా శాతం పెరగడంతో పాటు ర్యాంకులు మెరుగయ్యాయి. అనంతపురం రీజనల్లో ఇంజనీరింగ్8275 మంది దరఖాస్తు చేసుకోగా, 7,890 మంది అభ్యర్థులు ఇంజనీరింగ్ రాత పరీక్షను రాశారు. 6,171 మంది అభ్యర్థులు ఎంసెట్ పరీక్ష అర్హత సాధించారు. ఇందులో అబ్బాయిలు 3,502 మంది, అమ్మాయిలు 2,669 మంది ఉన్నారు. 1,425 మంది పూర్తిగా ఎంసెట్‌లో అర్హత సాధించలేదు. 133 మంది ఎంసెట్‌లో అర్హత సాధించినా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యారు. ఇంజనీరింగ్‌లో అబ్బాయిలు 57 శాతం , అమ్మాయిలు 43 శాతం అర్హత సాధించారు. మెడిసిన్‌లో అమ్మాయిలదే హవా: మెడిసిన్, అగ్రికల్చర్‌కు 3058కి గాను, 2832 మంది రాత పరీక్షలకు హాజరయ్యారు. 2,544 మంది అర్హత సాధించారు. అబ్బాయిలు 895 మంది, అమ్మాయిలు 1,649 మంది ఉత్తీర్ణులయ్యారు. 118 మంది ఎంసెట్‌లో అర్హత సాధించలేదు. ఇంటర్మీడియట్ మార్కులతో 25 శాతం వెయిటేజీ, ఎంసెట్‌కు కలిపి ర్యాంకులు ప్రకటించారు. మెడిసిన్‌లో 65 శాతం మంది అమ్మాయిలు ర్యాంకులు కైవసం చేసుకోగా, అబ్బాయిలు కేవలం 35 శాతానికి పరిమితయ్యారు. 25 నుంచి ర్యాంకు కార్డులు: ఎంసెట్-2015 ర్యాంకు కార్డుల కోసం ఈ నెల 25 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 12 నుంచి కౌన్సెలింగ్‌ను నిర్వహించనున్నారు. గత ఏడాది ఏర్పడ్డ రాజకీయ అనిశ్చితి, నాన్‌లోకల్ వివాదం దృష్ట్యా కౌన్సెలింగ్ ప్రక్రియ ఆలస్యం కావడంతో అకడమిక్ ఇయర్ ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో పొరుగు రాష్ట్రాల వైపు విద్యార్థులు తరలి వెళ్లారు. తాజాగా జరిగిన ఎంసెట్ పరీక్షలో హాజరుశాతం అధికం కావడం, ఉత్తీర్ణతా శాతం గత ఏడాది కంటే 10 శాతం మెరగు కావడంతో ఇంజనీరింగ్ సీట్లు అనుకున్న స్థాయిలోభర్తీ అవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. జేఎన్టీయూ ,అనంతపురం పరిధిలో రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరులో 118 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. పులివెందుల జేఎన్టీయూ, కలికిరి, జేఎన్టీయూ అనంతపురం కళాశాలలు ప్రభుత్వ కళాశాలలతో పాటు మరో పది స్వయం ప్రతిపత్తి కళాశాలలు ఉన్నాయి. -
ప్రశాంతంగా ఎంసెట్
మహబూబ్‌నగర్, వనపర్తిలోని 13 కేంద్రాల్లో పరీక్ష ఒక్క నిమిషం నిబంధనతో పరుగులు పెట్టిన విద్యార్థులు వనపర్తిలో చెమటకు ఓఎంఆర్ షీట్లు తడుస్తున్నాయని ఇన్విజిలేటర్లతో వాగ్వాదం మహబూబ్‌నగర్ విద్యావిభాగం : వనపర్తి, మహబూబ్‌నగర్ పట్టణాల్లో గురువారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఎంసెట్-2015 ప్రశాతంగా జరిగింది. కేంద్రాల వద్ద 144సెక్షన్ విధించడంతో పాటు పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. మహబూబ్‌నగర్ డీఎస్పీ కృష్ణమూర్తి అన్ని కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తును పర్యవేక్షించారు. మొత్తం 13 కేంద్రాలలో ఇంజనీరింగ్, మెడిసిన్ విభాగంలో మొత్తం 14,235 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 13,074 మంది హాజరయ్యారు. 1121మంది గైర్హాజరయ్యారు. ఇంజనీరింగ్ విభాగంల మొత్తం 6,568 మంది విద్యార్థులకు గాను 6,052 మంది హాజరయ్యారు. 516 మంది గైర్హాజరయ్యారు. మెడిసిన్ విభాగంలో 7,667 మంది విద్యార్థులకు 7,022 మంది హాజరయ్యారు. 605 మంది గైర్హాజరయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని 8కేంద్రాలలో ఇంజనీరింగ్ 4,870 మంది విద్యార్థులకు 4,477 మంది విద్యార్థులు హాజరయ్యారు. 393 మంది గైర్హాజరయ్యారు. మెడిసిన్ విభాగంలో 5,860 మంది విద్యార్థులకు గాను 5,313 మంది విద్యార్థులు హాజరయ్యారు. 507మంది గైర్హాజరు అయ్యారు. వనపర్తిలో 5 కేంద్రాలలో ఇంజనీరింగ్ పరీక్షకు 1,698 మందికి గాను 1,575 మంది హాజరయ్యారు. 123మంది గైర్హాజరు అయ్యారు. మెడికల్ విభాగంలో 1,807 మంది విద్యార్థులకు గాను 1709 మంది హాజరయ్యారు. 98మంది గైర్హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి, రీజినల్ కో ఆర్డినేటర్లు డాక్టర్ కె.సుధాకర్, పి.సునీల్‌కుమార్‌లు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. అదేవిధంగా ఫైయింగ్స్క్వాడ్ బృందాలు, ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లు పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించారు. విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే లోపలికి అనుమతించారు. వారివెంట తెచ్చుకున్న ప్యాడ్లు, చేతి గడియారాలు, సెల్ఫోన్లను లోపలికి అనుమతించలేదు. మొత్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు, అవకతవకలకు తావులేకుండా ఎంసెట్ ప్రశాంతంగా ముగిసింది. పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని ప్రకటించడంతో పలువురు విద్యార్థులు ఉరుకులు, పరుగులతో పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. వనపర్తి పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల, పాలిటెక్నిక్ కాలేజీల్లో ఫ్యాన్లు లేకపోవడంతో చెమటకు ఓఎంఆర్ షీట్లు తడిచిపోతున్నాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఇన్విజిలేటర్లు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం జరిగింది. -
ఎంసెట్‌పై విజిలెన్స్
సెంట్రల్ విజిలెన్స్, సెంట్రల్ పరిశీలకుల డేగ కన్ను హాజరుకానున్న 17,405 మంది విద్యార్థులు మెడిసిన్, వ్యవసాయ పరీక్షలపై ప్రత్యేక నిఘా ఆర్టీసీ సమ్మె విరమణతో తప్పనున్న రవాణా కష్టాలు నల్లగొండ/కోదాడ అర్బన్ : నిఘా నీడన ఎంసెట్-2015 నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ప్రవేశ పరీక్షలో ఎలాంటి మాల్‌ప్రాక్టీస్ సంఘటనలుచోటుచేసుకోకుండా ఉండేందుకు జేఎన్టీయూ, మిట్స్ నుంచి ప్రత్యేక బృందాలను రంగంలోకి దిగనున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్నం నుంచి జరిగే మెడిసిన్, వ్యవసాయ రాత పరీక్ష పై సెంట్రల్ బృందాలు డేగ కన్ను వేయనున్నాయి. బుధవారం జరిగే ఎంసెట్‌కు జిల్లాలో నల్లగొండ, కోదాడ రెండు రీజియన్లుగా మొత్తం 37 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో నల్లగొండలో ఉదయం 10 గంటలనుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఇంజినీరింగ్ పరీక్షకు 15 సెంటర్లు ఏర్పాటు చేయగా 7,200 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. అలాగే మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరిగే మెడిసిన్, వ్యవసాయ రాత పరీక్షకు 9 సెంటర్లు ఏర్పాటు చేయగా 4,790 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. కోదాడలో ఇంజినీరింగ్ విభాగానికి ఏర్పాటు చేసిన 7 పరీక్షా కేంద్రాల్లో 3,134 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. మధ్యాహ్నం జరిగే మెడిసిన్, వ్యవసాయ కోర్సులకు ఏర్పాటు చేసిన 6 పరీక్షా కేంద్రాల్లో 2,281 మంది విద్యార్థులు కలిపి జిల్లా మొత్తం 17,405 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్షా సమయానికి నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించేది లేదని రీజినల్ కోఆర్డినేటర్లు స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. నల్లగొండలోని పరీక్షా కేంద్రాలు... ఇంజినీరింగ్.. నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఎన్జీ కాలేజీ)1,2 ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాల, రామగిరి కాకతీయ డిగ్రీ కళాశాల హైదరాబాద్ రోడ్డు (వీటీకాలనీ) ది నల్లగొండ డిగ్రీ కాలేజీ ఆర్ట్స్ అండ్ సైన్స్, తులసీ నగర్, హనుమాన్ టెంపుల్ వెనకబాగం నీలగిరి డిగ్రీ పీజీ కళాశాల, రామగిరి } చైతన్య డిగ్రీ కళాశాల,అన్సారీ కాలనీ (బస్టాండ్ దగ్గర) నిట్స్ సెంటర్-1,సెంటర్-2 చర్లపల్లి,హైదరాబాద్ రోడ్డు డీవీఎం కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్, చర్లపల్లి కాకతీయ పీజీ కళాశాల, హైదరాబాద్ రోడ్డు, చర్లపల్లి. సెయింట్ ఆల్ఫానెన్స్ హైస్కూల్, దేవరకొండరోడ్డు లిటిల్ ఫ్లవర్ విజ్ఞాన్ మందిర్ హై స్కూల్, శాంతినగర్ } సాయి భారతి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ (ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ వెనకభాగం) సిద్ధార్ధ డిగ్రీ కాలేజీ, నటరాజ్ థియేటర్ దగ్గర మెడిసిన్.... నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఎన్జీ కాలేజీ)1,2 {పభుత్వ డిగ్రీ మహిళా కళాశాల, రామగిరి కాకతీయ డిగ్రీ కళాశాల హైదరాబాద్ రోడ్డు (వీటీకాలనీ) ది నల్లగొండ డిగ్రీ కాలేజీ ఆర్ట్స్ అండ్ సైన్స్, తులసీ నగర్, హనుమాన్ టెంపుల్ వెనకబాగం సిద్ధార్ధ డిగ్రీ కాలేజీ, నటరాజ్ థియేటర్ దగ్గర నలంద డిగ్రీ కళాశాల, గడియారం సెంటర్ దగ్గర } చైతన్య డిగ్రీ కళాశాల, బస్టాండ్ దగ్గర ప్రత్యేక బృందాలు... నల్లగొండ రీజియన్ సెంటర్ కో ఆర్డినేటర్‌గా ఎన్జీ కాలేజీ ప్రిన్సిపల్ రావుల నాగేందర్‌రెడ్డి, కోదాడ సెంటర్ కోఆర్డినేటర్‌గా కేఆర్ఆర్ డిగ్రీ కాలేజీ ఎఫ్ఏసీ ప్రిన్సిపల్ ఎ.శంకర్ వ్య వ హరించనున్నారు. నల్లగొండలోని 24 రీజియన్ సెంటర్లలో 24మంది పరిశీలకులను నియమించారు. వీరుగాకుండా రెండు సెంటర్లకు కలిపి ఒకరిని ఫ్లైయింగ్ స్క్వాడ్‌గా నియమించారు. మెడిసిన్, వ్యవసాయ రాతపరీక్షపై నిఘా ఉంచేం దుకు ప్రత్యేకంగా 8 మంది సభ్యులతో సెంట్రల్ విజిలెన్స్ సభ్యులుగా నియమించారు. జిల్లా ప్రత్యేక పరీశీలకులుగా డా.బి.ధర్మానాయక్ వ్యవహరిస్తారు. వీరితోపాటు కలె క్టర్, రె వెన్యూ, పోలీస్ అధికారులు సెంటర్లు విజిట్ చేస్తారు. రవాణా సౌకర్యాలు... కార్మికులు సమ్మె విరమించడంతో బుధవారం అర్ధరాత్రి అన్ని గ్రామాలకు బస్సులు పంపినట్లు ఆర్ఎం బి.రవీందర్ తెలిపారు. ఎంసెట్ పరీక్షా దృష్ట్యా ప్రత్యేక 115 బస్సులు నడపనున్నారు. ప్రధానంగా మిర్యాలగూడ-కోదాడ, మిర్యాలగూడ-నల్లగొండ, నల్లగొండ-భువనగిరి, నల్లగొండ-దేవరకొండ, నల్లగొండ-హాలియా, నల్లగొండ-హైదరాబాద్, సూర్యాపేట-నల్లగొండ మార్గాల్లో ఎక్కువ బస్సులు నడపనున్నారు. మిర్యాలగూడ-నల్లగొండ మార్గంలో 12, హుజూ ర్‌నగర్-కోదాడ మార్గంలో 16 బస్సులు అదనంగా నడపనున్నారు. ఉదయం 6 గంటలకు అన్ని గ్రామాల నుంచి బస్సులు బయల్దేరి వెళ్తాయి. మండల కేంద్రాల మీదుగా ఉదయం 9 గంటల వరకు కోదాడ, నల్లగొండకు బస్సులు చేరుకుంటాయి. ఇక్కడినుంచి పరీక్షా కేంద్రాలకు విద్యార్థులను తీసుకెళ్లేందుకు రవాణా శాఖ ప్రైవేటు బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. కోదాడలో 9, నల్లగొండలో 15 బస్సులు బస్టాండ్ నుంచి పరీక్షా కేంద్రాల వద్దకు విద్యార్థులను తరలిస్తాయి. ఎంసెట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాలి - ఉపముఖ్యమంత్రి కడియం ఎంసెట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి జిల్లా కలెక్టర్లకు సూచించారు. బుధవారం వరంగల్ జిల్లా నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, సంబంధిత అధికారులతో ఆయన వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఉండేం దుకు అన్ని రూట్లలో బస్సు సౌకర్యం కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ మాట్లాడుతూ...పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అన్ని వసతులు కల్పించాలన్నారు. జిల్లా కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ...విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ విక్రమ్‌జీత్ దుగ్గల్ మాట్లాడుతూ...ఎంసెట్ నిర్వహణకు సెక్టార్ వైజ్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సమావేశంలో రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, జిల్లా నుంచి జేసీ సత్యనారాయణ, ఇన్చార్జి ఏజేసీ నిరంజన్, డీఆర్వో రవినాయక్, ఆర్ఎం రవీందర్ పాల్గొన్నారు. తొలిసారిగా కోదాడలో.. కోదాడ కేంద్రంగా జరుగుతున్న ఎంసెట్‌కు కొన్ని సెంటర్లు పట్టణానికి 10 నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అందుకోసం ఆయా ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలతో మాట్లాడి పరీక్ష రోజు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. మిట్స్ ఇంజినీరింగ్ కళాశాల చిలుకూరు మండలంలో ఉంది. కోదాడ నుంచి హూజూర్‌నగర్ వెళ్లే దారిలో కోదాడకు 13 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి చేరుకునేందుకు విద్యార్థులు ముందుగానే కోదాడకు రావాలి. అనురాగ్ ఇంజినీరింగ్ కళాశాల కోదాడకు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. గేట్ కళాశాల-1, సాయిఎడ్యుకేషనల్ సొసైటీ(గెట్కళాశాల-2) ఈ రెండు సెంటర్లు కోదాడకు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న కట్టకొమ్ముగూడెంలో ఉన్నాయి. ఈ సెంటర్ల విద్యార్ధులు ముందుగా బస్టాండ్ వద్దకు చేరుకుంటే ఆయా కళాశాలలు ఏర్పాటు చేసే ఉచిత బస్సులలో సులువుగా సెంటర్లకు చేరుకోవచ్చు.