breaking news
e - panchayat
-
ఇక.. గ్రామపాలన పారదర్శకం
నల్లగొండ : మారుమూల గ్రామాలలో పారదర్శక పాలన అందించేందుకు ప్రభుత్వం ఈ-పాలనను అందుబాటులోకి తెస్తోంది. దీనిలో భాగంగా గ్రామ పంచాయతీలను ప్రంపంచంతో అనుసంధానం చేయనుంది. తెలంగాణ రాష్ట్రంలో 2440 గ్రామ పంచాయతీలను ఈ-పంచాయతీలుగా ఏర్పాటుచేయడంలో భాగంగా జిల్లాలో 171 పంచాయతీలను ఎంపికచేశారు. అం దుకు సంబంధించిన ఏర్పాట్లు చకాచకా పూర్తవుతున్నాయి. పంచాయతీలకు కంప్యూటర్లు సరఫరా చేయడానికి, బీఎస్ఎన్ల్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్లన్నీ ఓ ప్రైవేటు ఏజెన్సీ ద్వారా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్‌లోనే ఈ-పంచాయతీల పాల నను మొదటి దఫాలో అందుబాటులోకి తేనున్నారు. జిల్లాలో ఎంపిక చేసిన 171 క్లస్టర్ పంచాయతీలలో నల్లగొండ డివిజన్లో 65, భువనగిరి డివిజన్లో 53, మిర్యాలగూడ డివిజన్లో 53 పంచాయతీలు ఉన్నాయి. 237 కంప్యూటర్ల పంపిణీ.. ఈ-పంచాయతీల కోసం జిల్లాకు 237 కంప్యూటర్లు మంజూరయ్యాయి. వీటినిు జిల్లాలోని అన్ని మండల పరిషత్ కార్యాలయాలకు ఒక్కొక్కటి చొప్పున 59, జిల్లా పరిషత్‌కు రెండు కంప్యూటర్లు, జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో రెండు కంప్యూటర్లు, మూడు డివిజన్ పంచాయతీల కార్యాలయాలకు మూడు కంప్యూటర్లు పంపిణీ చేశారు. ప్రస్తుతం ఈ-పంచాయతీలుగా ఎంపికైన 171 క్లస్టర్ గ్రామ పంచాయతీలకు ఒక్కొక్కటి చొప్పున పంపిణీ చేయనున్నారు. కంప్యూటర్ల పంపిణీ అనంతరం బీఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ కనెక్షన్‌ను ఇవ్వనున్నారు. గతంలో 18 పంచాయతీలలో ఈ-పాలన గతంలో కూడా గ్రామ పంచాయతీలలో ఈ-పాలన అందుబాటులోకి తెచ్చారు. జిల్లా వ్యాప్తంగా 24 పంచాయతీలను ఈ-పంచాయతీలుగా ఎంపిక చేశారు. కానీ ఈ-పంచాయతీలుగా ఉన్న హుజూర్నగర్, దేవరకొండ పట్టణాలు నగర పంచాయతీలు కావడంతోపాటు మరో నాలుగు పంచాయతీలలో అమలు చేయలేకపోయారు. దీంతో ప్రస్తుతం జిల్లాలో 18 గ్రామ పంచాయతీలలో ఈ-పాలన కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ-పంచాయతీలుగా ఎంపికైన 171 క్లస్టర్ పంచాయతీలతో కలిపి జిల్లాలో ఈ-పంచాయతీల సంఖ్య 189కి చేరనుంది. ఇక.. అన్నీ పారదర్శకమే - ఈ - పంచాయతీలలో అన్ని సేవలు కూడా పారదర్శకంగా అందించనున్నారు. - పంచాయతీలకు వచ్చే ఆదాయం వివరాలతో పాటు ఖర్చుల వివరాలు కూడా ఆన్లైన్లో ఉంచుతారు. - అంతే కాకుండా గ్రామంలోని అన్ని రకాల పింఛన్లు, ఉపాధి హామీ వేతనాల పంపిణీ కూడా ఆన్లైన్లో ఉంచనున్నారు. -
ఇక ఈ-పంచాయతీ
పంచాయతీల్లో పారదర్శక పౌరసేవలు అందనున్నాయి. గ్రామ సచివాలయాలు ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోనున్నాయి. ప్రపంచంలోని ఏ మూలనుంచైనా జిల్లాలోని గ్రామాల సమగ్ర సమాచారాన్ని తెలుసుకునే అవకాశం అతిత్వరలో రానుంది. పది రోజుల్లో జిల్లాలో మొదటి విడత కింద ఎంపిక చేసిన గ్రామ పంచాయతీల్లో ఈ-పంచాయతీ అమలుకానుంది. ఒంగోలు టూటౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఇక పారదర్శక పౌరసేవలు అందనున్నాయి. ఈ-పంచాయతీ వ్యవస్థకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లాలో 1028 పంచాయతీలు ఉన్నాయి. రెండు, మూడు పంచాయతీలను కలిపి ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేశారు. అలా మొత్తం పంచాయతీలను 568 క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. వీటిలో బిల్లింగ్, విద్యుత్ సౌకర్యం ఉన్న పంచాయతీలను గుర్తించారు. మొదటి విడతగా 279 క్లస్టర్లలో ఈ-పంచాయతీ వ్యవస్థ అమలు చేసేందుకు కార్వే డేటా మేనేజ్మెంట్ అనే కంపెనీ అన్ని సిద్ధం చేసింది. ప్రతి క్లస్టర్‌కు ఒక కంప్యూటర్ మంజూరు చేశారు. రెండు క్లస్టర్లకు కలిపి ఒక కంప్యూటర్ ఆపరేటర్‌ను నియమించారు. ప్రతి మండల అభివృద్ధి కార్యాలయంలో ఒక కంప్యూటర్ను ఏర్పాటు చేశారు. జిల్లాలోని మూడు డివిజన్లకు మూడు కంప్యూటర్లను డీఎల్పీఓల పరిధిలో ఏర్పాటయ్యాయి. జిల్లా పరిషత్తు సీఈఓ పరిధిలో మరో రెండు కంప్యూటర్లు, జిల్లా పంచాయతీ అధికారికి రెండు కంప్యూటర్లు ఏర్పాటు చేశారు. 143 మంది కంప్యూటర్ ఆపరేటర్లకు ఈ-పంచాయతీపై ఏప్రిల్ 12, 13, 14 తేదీల్లో ఒంగోలు సమీపంలోని ఎస్ఎస్ఎన్ ఇంజినీరింగ్ కళాశాలలో శిక్షణ ఇచ్చినట్లు కార్వే డేటా కంపెనీ జిల్లా కో-ఆర్డినేటర్ పి.బ్రహ్మంరాజు తెలిపారు. కంప్యూటర్ ఆపరేటర్ ఒక క్లస్టర్ పరిధిలో మూడు రోజులు, ఇంకొక క్లస్టర్ పరిధిలో మరో మూడు రోజులు పనిచేస్తారని వివరించారు. క్షేత్ర స్థాయిలో కంప్యూటర్లకు ఆన్లైన్ సమస్యలు వస్తే పరిష్కరించడానికి జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌గా టి.జ్యోతి, ఏడీపీఎంగా ఎస్కే ఫరూక్‌ను కార్వే కంపెనీ నియమించింది. ఈ-పంచాయతీ ద్వారా ఏమి చేస్తారంటే.. ఈ-పంచాయతీ ద్వారా గ్రామ స్థాయిలో ప్రజలకు అన్ని సేవలు అందనున్నాయి. జనన ధ్రువీకరణ పత్రాలు ఇస్తారు. గ్రామ జనాభా వివరాలు తెలుస్తాయి. పురుషులు, స్త్రీలు ఎంతమందో వివరంగా పొందుపరుస్తారు. పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులు, వాటి ఖర్చు వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేస్తారు. గ్రామ సభల వివరాలు, పన్నుల వివరాలు అన్ని పొందుపరుస్తారు. గ్రామానికి సంబంధించిన వివరాలు అన్నీ ఆన్లైన్లో ప్రత్యక్షమవుతాయి. ఎక్కడినుంచైనా ఆన్లైన్ ద్వారా ఆయా పంచాయతీల సమాచారం తెలుసుకోవచ్చు. మొదటి విడత అనంతరం రెండో విడత ప్రక్రియను అమలు చేస్తారని జిల్లా పంచాయతీ అధికారి కె.శ్రీదేవి తెలిపారు. మొత్తం వ్యవహారాన్ని కార్వే కంపెనీ చూస్తోందని పేర్కొన్నారు. ఈ-పంచాయతీ ఏర్పాటు పూర్తయిన తరువాత వీటిపై మా పర్యవేక్షణ ఉంటుందని ఆమె వివరించారు. పదిరోజుల్లో పూర్తి స్థాయిలో ఎంపిక చేసిన పంచాయతీల్లో ఈ-పంచాయతీ అమలుకానుంది.