breaking news
DYFI Protests
-
DYFI అధ్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడి
-
ప్రగతి భవన్ ముట్టడికి ‘డీవైఎఫ్ఐ’ యత్నం.. ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: కానిస్టేబుల్, ఎస్సై నియామకాల్లో అవకతవకలు జరిగాయాంటూ ప్రగతి భవన్ ముట్టడికి విద్యార్థి సంఘాల నేతలు సోమవారం యత్నించారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసు నియామకాల్లో అవకతవకలు జరిగాయని డీవైఎఫ్ఐ ఆరోపించింది. నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేసింది. డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనలు చేపట్టారు. దీంతో నిరసనలకు దిగిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక స్టేషన్లకు తరలించారు. ఇదీ చదవండి: ఖమ్మం బీఆర్ఎస్కు ఒకేసారి భారీ షాకులు?.. తుమ్మలతో పాటు పొంగులేటి.. షాతో చర్చలు?? -
గంటా నివాసం ఎదుట డీవైఎఫ్ఐ ఆందోళన
విశాఖపట్నం: రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని డీవైఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలు మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం విశాఖపట్నంలో డీవైఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నగరంలోని రాష్ట్ర విద్యాశాఖ, మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు నివాసం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం మంత్రి గంటా శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాంతో పోలీసులు జ్యోకం చేసుకుని వారిని అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించారు. దాంతో డీవైఎఫ్ఐ నాయకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో స్థానికంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తాము అక్కడి నుంచి కదిలేది లేదంటూ డీవైఎఫ్ఐ నాయకులు భీష్మించుకుని కుర్చున్నారు. దాంతో పోలీసులు చేసేది లేక ... మంత్రి గంటా శ్రీనివాసరావు పీఏను పోలీసులు పిలిపించారు. దాంతో రహదారిపైనే డీవైఎఫ్ఐ, గంటా పీఏతో చర్చలు జరుపుతున్నారు.