DY Patil T20 tournament
-
గోల్డెన్ డక్!.. మరోసారి శ్రేయస్ అయ్యర్ ఫెయిల్
టీమిండియా తరఫున చివరగా న్యూజిలాండ్‌తో వన్డేతో బరిలోకి దిగాడు శ్రేయస్ అయ్యర్. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ మిడిలార్డర్ బ్యాటర్ పది బంతులు ఎదుర్కొని కేవలం మూడు పరుగులే చేసి నిష్క్రమించాడు.మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శ్రేయస్ (Shreyas Iyer) చేసిన పరుగులు వరుసగా.. 49, 8, 3. ఈ సిరీస్‌లో న్యూజిలాండ్ 2-1తో టీమిండియాను ఓడించి.. తొలిసారి భారత గడ్డపై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది.ఇదిలా ఉంటే.. కివీస్‌తో వన్డే సిరీస్ తర్వాత టీ20 ప్రపంచకప్-2026తో టీమిండియా బిజీగా మారగా.. శ్రేయస్ అయ్యర్ లోకల్ టీ20 టోర్నీలో భాగమయ్యాడు. నవీ ముంబై వేదికగా డీవై పాటిల్ టీ20 కప్‌లో ఈ ముంబైకర్ BPCL జట్టుకు ఆడుతున్నాడు. తొలి మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్ఇందులో భాగంగా మంగళవారం నాటి మ్యాచ్‌లో బ్యాంక్ ఆఫ్ బరోడాతో BPCL తలపడగా.. శ్రేయస్ అయ్యర్ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో BPCL ఎనిమిది పరుగుల తేడాతో ఓటమిపాలైంది.Shreyas Iyer ( Sarpanch Sahab ) Punjab Kings Captain Performances In Random DY Patil Tournament Against Club Level Bowlers - 1st Match 0(1) - 2nd Match 5(13) while chasing 200 Few Days Back , People Were Doing His Paid PR That He Deserves To Be In The T20 World Cup Squad 😂 pic.twitter.com/03yuOVEQXX— Stubbsy (@spideypant_) February 25, 2026మరోసారి ఫెయిల్ఇక రెండో మ్యాచ్‌లోనూ శ్రేయస్ అయ్యర్ విఫలమయ్యాడు. రిలయన్స్‌తో మ్యాచ్ సందర్భంగా ఈ ముంబైకర్ పదమూడు బంతులు ఎదుర్కొని కేవలం ఐదు పరుగులే చేసి నిష్క్రమించాడు. ఈ మ్యాచ్‌లో BPCL 65 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది.ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ వరుస వైఫల్యాలపై విమర్శలు వస్తున్నాయి. కాగా ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ తరఫున పరుగుల వరద పారించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. కెప్టెన్‌గానూ రాణించి జట్టును ఫైనల్‌కు చేర్చాడు. అయినప్పటికీ టీమిండియా సెలక్టర్లు అతడిని కరుణించలేదు.అగార్కర్ నిర్ణయం సరైందేనంటూ సెటైర్లుఆసియా టీ20 కప్-2025 ఆడిన జట్టుకు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ శ్రేయస్ పేరును పరిగణనలోకి తీసుకోలేదు. ఇక టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి ముందు కూడా శ్రేయస్ పేరు వినిపించగా.. అతడిని సెలక్టర్లు పట్టించుకోలేదు.ఇలాంటి తరుణంలో.. ఐపీఎల్-2026 టోర్నీకి ముందు లోకల్ టోర్నమెంట్లో శ్రేయస్ అయ్యర్ ఇలా విఫలం కావడం విమర్శలకు దారితీసింది. శ్రేయస్‌ను భారత టీ20 జట్టుకు ఎంపిక చేయకుండా అగార్కర్ మంచి నిర్ణయమే తీసుకున్నాడంటూ కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. అయితే, అతడి అభిమానులు మాత్రం త్వరలోనే మునుపటి శ్రేయస్ అయ్యర్‌ను చూడబోతున్నారంటూ మద్దతుగా నిలుస్తున్నారు.చదవండి: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. దంచికొట్టిన అర్జున్ టెండుల్కర్ -
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. దంచికొట్టిన అర్జున్ టెండుల్కర్
భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఐపీఎల్-2026 టోర్నమెంట్ ఆరంభానికి ముందే తన బ్యాట్ పవర్ ఏమిటో ఇంకోసారి చాటిచెప్పాడు. డీవై పాటిల్ టీ20 కప్ 2026 టోర్నీలో భాగంగా ఈ బిహారీ పిల్లాడు.. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు.డీవై పాటిల్ బ్లూ జట్టుకు ప్రాతినిథ్యంముంబై వేదికగా జరిగే ఈ టీ20 లీగ్‌లో డీవై పాటిల్ బ్లూ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. గురువారం నాటి మ్యాచ్‌లో ఇండియన్ నావీ జట్టుపై చితక్కొట్టాడు. కేవలం 14 బంతుల్లోనే అర్ద శతకం పూర్తి చేసుకున్న ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. మొత్తంగా 19 బంతుల్లో 63 పరుగులు సాధించాడు.వైభవ్ సూర్యవంశీ విధ్వంసంవైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉండటం విశేషం. వరుణ్ చౌదరి బౌలింగ్‌లో ఒకే ఓవర్లో వైభవ్ 20 పరుగులు పిండుకోవడం మరో హైలైట్. ఇక వైభవ్‌తో పాటు అర్జున్ టెండుల్కర్ సైతం అద్భుత అజేయ అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. కేవలం 29 బంతుల్లోనే 55 పరుగులు సాధించాడు.దంచికొట్టిన అర్జున్ టెండుల్కర్వైభవ్, అర్జున్ ధనాధన్ దంచికొట్టడంతో డీవై పాటిల్ బ్లూ జట్టు ఇండియన్ నేవీ జట్టును ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. కాగా డీవై పాటిల్ బ్లూ జట్టుకు శశాంక్ సింగ్ (Shashank Singh) కెప్టెన్‌గా ఉండగా.. ఐపీఎల్ స్టార్లు యశ్ ధుల్, సర్ఫరాజ్ ఖాన్, జితేశ్ శర్మ, మయాంక్ యాదవ్ కూడా జట్టులో భాగంగా ఉన్నారు.Arjun Tendulkar hitting sixes for fun in the DY Patil tournament.He can give finishing touches for LSG in IPL.After coming to LSG , he becomes a different beast 🥵 pic.twitter.com/hwHTiQwaQz— Rupesh Kumar (@drona_17) February 26, 2026కాగా వైభవ్ సూర్యవంశీ ఫార్మాట్లకు అతీతంగా విధ్వంసకర బ్యాటింగ్‌తో అలరిస్తున్న విషయం తెలిసిందే. భారత్ అండర్-19 జట్టు తరఫున చివరగా వరల్డ్‌కప్ బరిలో దిగిన ఈ పద్నాలుగేళ్ల పిల్లాడు.. ఇంగ్లండ్‌తో ఫైనల్లో భారీ శతకం (80 బంతుల్లో 175) బాది భారత్‌కు టైటిల్ అందించాడు. ప్రస్తుతం డీవై పాటిల్ టీ20 కప్ టోర్నీతో బిజీగా ఉన్న వైభవ్.. తదుపరి ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ తరఫున బరిలో దిగుతాడు. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 22న నవీ ముంబైలో మొదలైన డీవై పాటిల్ టీ20 కప్ 2026.. మార్చి 6న ఫైనల్‌తో ముగియనుంది. ఇందులో 16 జట్లు భాగంగా ఉన్నాయి.చదవండి: కెప్టెన్‌గా సూపర్ హిట్!.. భారీ షాకిచ్చిన బీసీసీఐ! -
IPL కంటే ముందే ఆ టీ20 లీగ్‌లో వైభవ్ సూర్యవంశీ!
ఐసీసీ అండర్-19 వరల్డ్‌కప్-2026 ఫైనల్లో సత్తా చాటి మరోసారి ప్రశంసలు అందుకుంటున్నాడు వైభవ్ సూర్యవంశీ. ఇంగ్లండ్‌తో టైటిల్ పోరులో ఈ పద్నాలుగేళ్ల బాలుడు కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు సాధించాడు. తద్వారా భారత్ ఆరోసారి ప్రపంచకప్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.ఈ నేపథ్యంలో ఈ భారత యువ క్రికెట్ తరంగాన్ని ఏకంగా దిగ్గజ గ్యారీ సోబర్స్‌తో పోల్చాడు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మార్క్ బుచర్. ఇక ఈ మెగా టోర్నీ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)తో వైభవ్ సూర్యవంశీ బిజీ కానున్నాడు. అయితే, అంతకంటే ముందే మరో దేశీ టీ20 లీగ్‌లో అతడు భాగం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.IPL కంటే ముందే ఆ టీ20 లీగ్లోక్రిక్బజ్ కథనం ప్రకారం.. దేశీ కార్పొరేట్ టీ20 ఈవెంట్ డీవై పాటిల్ టీ20 టోర్నమెంట్లో వైభవ్ పాల్గొననున్నట్లు అతడి సన్నిహితులు తెలిపారు. ఇందుకు సంబంధించి నిర్వాహకులతో చర్చలు తుదిదశకు చేరినట్లు సమాచారం. కాగా ఈ కాంపిటిషన్ ఫిబ్రవరి 23న మొదలుకానుంది.హార్దిక్ పాండ్యా సైతందేశీ ఆటగాళ్లతో పాటు అంతర్జాతీయ క్రికెటర్లు కూడా డీవై పాటిల్ టీ20 టోర్నమెంట్లో ఆడతారు. ఐపీఎల్ కంటే ముందే పొట్టి క్రికెట్ వైబ్ ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా క్యాష్ రిచ్ లీగ్ కంటే ముందు ఈ టోర్నీలో ఆడటం యువ ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు తోడ్పడుతుంది. నవీ ముంబై వేదికగా జరిగే గతేడాది ఈ టోర్నీలో హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా వంటి స్టార్ ప్లేయర్లు ఆడారు. శివం దూబే, నేహాల్ వధేరా, దీపక్ చహర్ తదితరులు కూడా భాగమయ్యారు.పైసా వసూల్ ప్రదర్శనకాగా దేశీ క్రికెట్లో సత్తా చాటి ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాజస్తాన్ రాయల్స్ దృష్టిని ఆకర్షించాడు వైభవ్ సూర్యవంశీ. ఈ చిచ్చరపిడుగు కోసం రాయల్స్ ఏకంగా 1.10 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అందుకు తగినట్లుగానే ఈ బిహారీ పిల్లాడు పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చాడు. సంజూ శాంసన్ గైర్హాజరీలో యశస్వి జైస్వాల్‌కు జోడీగా ఓపెనర్‌గా వచ్చి.. తానేంటో నిరూపించుకున్నాడు.గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కేవలం 38 బంతుల్లోనే 101 పరుగులు చేయడంతో వైభవ్ పేరు ఒక్కసారిగా మారుమ్రోగిపోయింది. ఆ తర్వాత భారత్ అండర్-19 జట్టు తరఫున ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలలో అదరగొట్టి యూత్ వన్డే, యూత్ టెస్టుల్లో ధనాధన్ శతకాలతో ఆకట్టుకున్నాడు వైభవ్. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2026 సన్నాహకాల్లో భాగంగా ఫిబ్రవరి 21 వరకు ట్రెయినింగ్ సెషన్లో వైభవ్ పాల్గొనున్నాడు. చదవండి: ENG vs WI: నేపాల్ మీదైనా గెలిచాం.. సంతోషం: హ్యారీ బ్రూక్


