breaking news
Dummy CM
-
ఆతిశి డమ్మీ సీఎంగా ఉంటారు!
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎంగా ఆప్ నేత అతిశిని ఎంపిక చేయడంపై రాజ్యసభ ఎంపీ స్వాతీ మలివాల్ స్పందించారు. ముఖ్యమంత్రిగా ఆమె డమ్మీగా మిగిలిపోతారనే విషయం అందరికీ తెలిసిందే అంటూ ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు. అతిశి కుటుంబం ఉగ్రవాది అఫ్జల్ గురును ఉరి శిక్ష నుంచి కాపాడేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. ‘అఫ్జల్ గురు అమాయకుడు. అతడు రాజకీయ కుట్రకు బలయ్యాడు. అతడిని ఉరి తీయకండి, క్షమాభిక్ష పెట్టండంటూ ఈమె తల్లిదండ్రులు రాష్ట్రపతికి పలుమార్లు వినతులు పంపారు’అని మలివాల్ ఆరోపించారు. ‘దేశ భద్రతపై ఆందోళన కలిగించే పరిణామమిది. ఇది ఎంతో విచారకరమైన రోజు. ఢిల్లీని ఆ దేవుడే కాపాడాలి’అని ఆమె పేర్కొన్నారు. అతిశి తల్లిదండ్రులు విజయ్ సింగ్, త్రిప్తా వాహి సంతకాలతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపిన క్షమాభిక్ష పిటిషన్ కాపీని కూడా మలివాల్ షేర్ చేశారు. వీటిపై ఆప్ ఎమ్మెల్యే దిలీప్ పాండే స్పందిస్తూ..‘ఆప్ టిక్కెట్‌పై రాజ్యసభకు వెళ్లిన స్వాతి మలివాల్..ఇప్పుడు బీజేపీ గొంతు వినిపిస్తున్నారు. ఏమాత్రం సిగ్గున్నా వెంటనే ఆమెకు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలి’అని డిమాండ్ చేశారు. రాజ్యసభలోనే కొనసాగాలనుకుంటే బీజేపీ టిక్కెట్‌పై ఆమె మళ్లీ ఎన్నికవ్వొచ్చని పాండే పేర్కొన్నారు. పార్లమెంట్‌పై 2001లో జరిగిన దాడి కేసులో దోషి అయిన అఫ్జల్ గురును 2013లో ఉరితీయడం తెలిసిందే. తన తల్లిదండ్రులు అఫ్జల్ గురుకు అనుకూలంగా రాష్ట్రపతికి పంపిన క్షమాభిక్ష పిటిషన్‌పై 2019లో ఓ ఇంటర్వ్యూలో అతిశి..‘ఆ అంశంతో నాకెలాంటి సంబంధమూ లేదు. అది నా తల్లిదండ్రులు వారి ఆశయాలకు అనుగుణంగా స్పందించారు. అది వారిష్టం. ఈ విషయంలో వారికి నేను ఎలాంటి మద్దతివ్వలేదు కూడా’అని స్పష్టం చేయడం గమనార్హం. -
ముఖ్యమంత్రి కిరణ్‌పై ఎమ్మెల్యే శ్రీకాంత్ ప్రశ్నల వర్షం
హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు. విభజనకు మీరు ఒక కారణం కాదని చెప్పగలరా? అధిష్టానం పెద్దలతో ప్యాకేజీ గురించి చర్చించిన మాట వాస్తవమా? కాదా? పదవిని వదిలిపెట్టుకోవడం ఇష్టంలేక మీరు మౌనంగా ఉన్నారా?లేదా? పదవిలో కొనసాగడం కోసం సీమాంధ్ర ప్రజలకు అన్యాయం చేసిన మాట వాస్తవమా? కాదా? సమ్మె చేస్తున్న ఉద్యోగులు, ఆర్టీసి కార్మికుల జీవితాల గురించి ఆలోచన చేస్తున్నారా? అని ముఖ్యమంత్రిపై ప్రశ్నలు సంధించారు. ఈ ప్రశ్నలన్నింటికీ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పెద్దల లాబీతో సోనియా గాంధీ నియమించిన ముఖ్యమంత్రి అధికార దాహంతో రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చారని మండిపడ్డారు. ఈ డమ్మీ ముఖ్యమంత్రి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయలేదన్నారు. పదవీ కాంక్షతో డ్రామాలు అడుతున్నారని విమర్శించారు. రాష్ట్రానికి ఈ గతి పట్టడానికి ముఖ్యమంత్రి కూడా ఒక కారణం అని పేర్కొన్నారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశాల పేరుతో కాలం గడుపుతున్నారన్నారు. కేసుల నుంచి తప్పించుకోవడానికి టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌తో కుమ్మక్కైయ్యారన్నారు. విభజన విషయంలో తన వాదన స్పష్టం చేయకుండా చంద్రబాబు బస్సు యాత్ర చేయడం ఏమిటని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. -
ముఖ్యమంత్రి కిరణ్‌పై ఎమ్మెల్యే శ్రీకాంత్ ప్రశ్నల వర్షం