breaking news
duddu prabhakar
-
రాజధాని నిర్మాణంలోనూ వాళ్లే సమిధలు
నవ్యాంధ్ర రాజధానిలో ఇళ్లు, సమాధులతో సహా సర్వం కోల్పోయే అట్టడుగు కులాల ప్రజలు, అడ్డాకూలీలుగా బతకాల్సివస్తుంది. చంద్రబాబు రాజధాని ప్రాంత మహిళల్నీ అడ్డాకూలీలుగా నిలబెట్టబోతున్నారు. ప్రజలందరి సలహాలు, సూచనల మేరకు అందరి భాగస్వామ్యంతో రాజధాని నిర్మాణం చేస్తామని చెప్పిన చంద్రబాబు కనీసం రాజధాని ప్రాంత అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవ డం లేదు. స్థానికుల అభిప్రా యాలకు భిన్నంగా పచ్చని పంటల పొలాల్లో రాజధాని కట్టడానికి పట్టుదలతో ఉన్నారు. పైగా, విమర్శకులను..13 జిల్లాలకు కేంద్రంగా ఉన్న గుంటూరు-విజయవాడ మధ్య రాజధాని నిర్మా ణాన్ని వ్యతిరేకించే వాళ్లుగా ప్రచారం చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలోని కౌలు రైతులను, రైతు కూలీలను మొత్తం 12 వేల కుటుంబాలుగా ప్రభుత్వం తేల్చింది. భూసేకరణ ద్వారానో, భూ సమీకరణ ద్వారా నో, నయానో, భయానో రైతుల నుండి ప్రభుత్వం భూమి లాగేసుకొని ప్యాకేజీ ఇస్తుందనుకుందాం. మరి మెజారిటీ కౌలు రైతులైన అగ్రకులాల్లోని పేదలు, దళి తులు, బీసీలు, ముస్లింల పరిస్థితేంటి? వ్యవసాయాధా రిత వృత్తి కులాలు జీవించేదెలా? మరీ ముఖ్యంగా రైతు కూలీలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లింలు, మహిళల పరిస్థితి దయనీయంగా మారనుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాజధాని ప్రాంత పరిధి లోని గ్రామాలలో మొత్తం 22,404 మంది రైతులు న్నారు. వారిలో రెండెకరాలు ఉన్న రైతులు 16 వేల మంది ఉన్నారు. సగానికిపైగా భూమిని కౌలు రైతులు సాగు చేస్తున్నారు. వారిలో సుమారు 10 వేల మంది రైతులు లంబాడీలు, బీసీలు, ముస్లింలు ఉన్నారు. వారి బతుక్కి ప్రభుత్వం ఇచ్చే భరోసా ఏమీ లేదు. వ్యవసా యాధారిత వృత్తికులాలైన వడ్రంగి, కంసాలి కులస్థులు, కల్లుగీసే వారి బతుకులు రాజధాని నిర్మాణంలో ఛిద్రం కాబోతున్నాయి. అంతేకాదు. పంటలు కోసిన తర్వాత ఖాళీ భూముల్లో గొర్రెల మందల్ని తోలి, పెంటగట్టి తాము బతుకుతూ, సేంద్రియ ఎరువులను అందిస్తూ రైతులకు ఆసరాగా ఉన్న గొల్ల కులస్తులూ ఆందోళనలో ఉన్నారు. నాట్లు వేసే ముందు పొలాల్లో బాతుల్ని వదిలి బతుకు బండి లాక్కొస్తున్న ఎరుకల కులస్తులు, పంట లను కంటికి రెప్పలా కాపాడుతూ రేయింబవళ్లు కాపలా కాస్తున్న యానాదుల బతుకులు తెల్లారేదెలా? వీరే కాదు. పంట భూముల్లోని పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు, పూలను రైతుల వద్ద నుండి కొని గంపల్లో, తోపుడు బండ్లపై అమ్ముకొని పొట్టపోసుకునే కుటుం బాలు, పొలాల నుండి సరుకులను మార్కెట్‌కు తర లించే ఆటోవర్కర్ల జీవితం అగమ్యగోచరం కానుంది. మహిళా సాధికారత, గురించి మాట్లాడే చంద్ర బాబు రాజధాని ప్రాంత మహిళల్ని అడ్డాకూలీలుగా నిల బెట్టబోతున్నారు. తోటలకు పురుగుమందులు కొట్టడం, అరక దున్నడం మినహాయిస్తే మిగిలిన పనులన్నీ మహి ళలే చేస్తారు. విత్తనాలు నాటడం, పాదులు తీయడం, కలుపుతీయడం, పందిళ్లు కట్టడం, కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు, పూలు కోయడం, వాటిని ప్యాక్ చేయ డం లాంటి పనులన్నీ మహిళలే చేస్తారు. వరినాట్లు, కలు పులు, కోతలు, మెట్ట ప్రాంతాల్లో మిరపకాయలు కోయ డం, గ్రేడ్ చేయడం, పత్తి ఏరడం లాంటి పనులలో పూర్తిగా మహిళలు, బాలికలే పాల్గొంటారు. తెనాలి, దుగ్గిరాల, పల్నాడు ప్రాంతాల నుండి ప్రతి రోజూ 2, 3 వేల మంది మహిళలు సుమారు 30, 35 కి.మీ దూరం నుండి ఆటోలలో వచ్చి పనులు చేసి వెళుతూ ఉంటారు. మగవారు తాగుడుకి బానిసలై ఉన్న అనేక కుటుం బాలలో స్త్రీలే కుటుంబ భారాన్ని నెత్తికెత్తుకొని నెట్టు కొస్తున్నారు. నేటికీ పంట పొలాల్లో, కల్లాల దగ్గర ‘పరిగె’ ఏరుకొని పైటకొంగుల్లో ఇంటికి తీసుకొచ్చి బిడ్డ లకు కడుపునింపే మాల, మాదిగ, యానాది కులాలకు చెందిన ముసలి తల్లులు ఆ ప్రాంతంలో ఉన్నారు. వీళ్లందర్ని కలుపుకుంటే సగటున ఎకరాకు 5 మంది చొప్పున రాజధాని ప్రాంత భూముల్లో మొత్తం 2,50,000 మంది రైతు కూలీలుగా వ్యవసాయాధారిత వృత్తుల్లో జీవిస్తున్నారు. వీరిలో 90 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ ముస్లింలలోని మహిళలు. కానీ ప్రభుత్వం కౌలు రైతులు, రైతు కూలీలను కలిపి 12 వేల కుటుంబాలుగా లెక్కగట్టింది. వారికి నెలకు 2500 ఇస్తానంటుంది. అంటే రోజుకి రూ.800. నిత్యావసర వస్తువులు, విద్య, వైద్యం పేద ప్రజలకు అందని పండుగా ఉన్న నేటి ఆర్థిక స్థితిలో రూ.80 ఒక్కపూటైనా బిడ్డలకు బువ్వపెట్టుకోవడానికి సరిపోవు. ఇప్పటిదాకా ఎక్కువగా పురుషులే అడ్డాకూలీ లుగా బతుకుతున్నారు. ఇక నుండి నవ్యాంధ్రలో మహి ళలు అడ్డాలు కూడా చూడబోతున్నాము. ఎన్నికల హామీలు నెరవేర్చకపోయినా ఫర్వాలేదు. కానీ మట్టికి, మనిషికి ఉన్న బంధాన్ని, భూమికి, బువ్వ కు ఉన్న సంబంధాన్ని తుంచకూడదు. ప్రజలను భిక్ష గాళ్లను చేసి పంట భూముల్లో రియల్ఎస్టేట్ వ్యాపారం చేయడం ప్రజాద్రోహం. రాజధాని నిర్మాణ సమస్య అధి కార, ప్రతిపక్ష పార్టీల సమస్య కాదు. ఆ ప్రాంత రైతు లకూ, ప్రభుత్వానికీ మధ్య సమస్య మాత్రమే కాదు. ల్యాండ్ పూలింగ్ (భూ సమీకరణ) ల్యాండ్ అక్విజేషన్ (భూసేకరణ) మరియు ప్యాకేజీల సమస్య అంతకంటే కాదు. కౌలు రైతులు, రైతు కూలీలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లింలు, మహిళల బతుకు సమస్య. బతుకుదెరువు సమస్య. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలం దరి సమస్య. అందుకే పచ్చని పంట పొలాల్లో రాజధాని నిర్మాణాన్ని వ్యతిరేకిద్దాం. అన్ని ప్రాంతాల సమాన అవ కాశాల కోసం, సమాన అభివృద్ధి కోసం ఉద్యమిద్ధాం. రాజధాని నిర్మాణం, అభివృద్ధిని రాయలసీమ, ఉత్తరాం ధ్ర, పల్నాడు ప్రాంతాలలో వికేంద్రీకరించాలని పోరా డుదాం. (వ్యాసకర్త రాష్ట్ర అధ్యక్షులు, కులనిర్మూలనా పోరాటసమితి) మొబైల్ : 9959567818 -
దళిత జాతుల వైతాళికుడికి నివాళి
నేడు దళిత జాతుల వైతాళికుడు, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి రోజు. 1956, డిసెంబర్ 6 నుండి దేశ వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ప్రజలు తమ ప్రియ తమ నేత అంబేద్కర్‌ను గుర్తుచేసుకుంటూ ఘనంగా నివా ళులర్పిస్తున్నారు. ముస్లింల ప్రార్థనామందిరం బాబ్రీ మసీ దును సరిగ్గా ఈ రోజునే (1992 డిసెంబర్ 6) కూల్చివేశారు. ఇది జరిగి నేటికి 22 ఏళ్లు. అంబేద్కర్ వర్ధంతి నాడే ఈ ఘటన జరగ డంతో ఈ దినం రెండు రకాలుగా మన జ్ఞాపకాలను తడుము తోంది. ఒక జ్ఞాపకం హిందూ సమాజంపై ధ్వజమెత్తిన అంబే ద్కర్‌ను స్మరించుకోవడం. హిందూ మతం సాంఘిక సమానత్వా నికి వ్యతిరేకమని పీడిత కులాల ప్రజలకు వివరించడమే కాకుం డా ఆజన్మాంతం ఆయన హిందూమతానికి, కులవ్యవస్థకు వ్యతిరే కంగా పోరాడారు. ఇక రెండో జ్ఞాపకం. ఒక స్వయం సేవకుడు ప్రస్తుతం దేశప్రధాని అయిన నేపథ్యానికి సంబంధించినది. 68వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ‘జెండా సాక్షిగా చెబు తున్నా జాతిని నిర్మిస్తా’మన్నారు. అనేక భాషలు, ఆచార వ్యవహా రాలు, పలు కులాలు, పరస్పర విరుద్ధ దృక్పథాలు, మతాలు ఉన్న దేశంలో కొందరు పుట్టుక ద్వారా బానిసత్వం అనుభ విస్తూ, మతం పేరుతో పీడనకు గురవుతున్నంత కాలం జాతి నిర్మాణం కాదు. కులం పునాదుల మీద ఒక జాతిని, నీతిని నిర్మించలేమంటాడు అంబేద్కర్. లౌకిక, ప్రజాస్వా మిక ఉద్యమశక్తులు, వామపక్షాలు భావజాల రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్లే హిందుత్వశక్తులు విస్తరించి, కేం ద్రాధికారం చేజిక్కించుకున్నాయి. మత ఘర్షణలు జరిగినప్పుడే నిరసన చర్యలకు పూనుకునే ప్రగతిశీలవాదులు, దళితులు, అంబే ద్కర్ వారసులు తర్వాత నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంటున్నారు. ఈ నిర్లక్ష్యంవల్లే మతం నేడు అధికారమైంది. కావున భావజాల రంగంలో కూడా ప్రగతిశీల శక్తులు క్రియాశీలకపాత్ర పోషించాల్సి ఉంది. దీర్ఘకాలిక ప్రణాళికతో ఉద్యమ నిర్మాణం తక్షణ అవసరం. అదే అంబేద్కర్‌కు మనం అర్పించే నివాళి. అంబేద్కర్ వర్ధంతిని హిందూమతోన్మాద వ్యతిరేకదినంగా జరుపుకుందామని ఈ దేశం లోని లౌకిక, వామపక్ష ఉద్యమశక్తులకు, దళిత ప్రజా సంఘాలకు కులనిర్మూలనా పోరాట సమితి పిలుపునిస్తోంది. (నేడు డా॥బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతి) దుడ్డు ప్రభాకర్ కులనిర్మూలనా పోరాట సమితి