విహంగం పైనుంచి వీక్షణం...
ఫొటోగ్రఫీ ఎంత ఉన్నతస్థాయికి చేరిందో చెప్పడానికి నిదర్శనమే ఈ చిత్రం. ఇండోనేసియాలోని బాలి నేషనల్ పార్క్‌పై ఓ గద్ద ఎగురుతుండగా తీసిన ఫొటో ఇది. డ్రోన్‌కు కెమెరా అమర్చి ఈ అందమైన దృశ్యాన్ని అద్భుతంగా బంధించారు. ‘డ్రోన్స్టాగ్రమ్’ పేరిట నిర్వహించిన ఫొటో పోటీలో జడ్జిలందరి మనసూ ఇది దోచుకుంది. ఇంకేముంది..? ఈ కాంటెస్ట్‌లో ఇదే ఉత్తమ చిత్రంగా ఎంపికైంది.