breaking news
DPG Review meeting
-
జీవోఎంకు ఎలాంటి నివేదిక ఇవ్వలేదు: డీజీపీ
-
జీవోఎంకు ఎలాంటి నివేదిక ఇవ్వలేదు: డీజీపీ
హైదరాబాద్ : రాష్ట్ర పోలీసుల తరపున జీవోఎంకు ఎలాంటి నివేదిక ఇవ్వలేదని డీజీపీ ప్రసాదరావు తెలిపారు. హైదరాబాద్లోని జూబ్లీహాల్లో శాంతి భద్రతలపై డీజీపీ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు, అడిషనల్ డీజీ. ఐజీతో పాటు పోలీసు ఉన్నత అధికారులు హాజరు అయ్యారు. శాంతిభద్రతలపై ఇందులో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. సమీక్ష సమావేశం అనంతరం డీజీపీ మాట్లాడుతూ జీవోఎంకు తాము ఎలాంటి నివేదిక ఇవ్వలేదని స్పష్టం చేశారు. మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కాగా రాష్ట్ర విభజన వార్తల నేపథ్యంలో ముందస్తు చర్యలపై కూడా ఈ సమీక్షా సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.