breaking news
donar
-
ఆ తండ్రి ప్రాణం నిలుపుతుంటే..కుమార్తె ప్రాణం పోస్తోంది..
నాన్న.. అమ్మతో పోల్చితే నాన్నెందుకో కాస్త వెనుకబడ్డారు అంటుంటారు. కానీ తన పిల్లలు ముందుండాలని తపనతో నాన్న కాస్త వెనుకబడి ఉంటారు, వారి వెనకే ఉంటారు. పిల్లల ప్రతి విజయం వెనక, వారి ప్రతి లక్ష్యం వెనుక కనిపించని నా అన్న కృషే నాన్నది. నాన్న ఒక బాధ్యత, ఒక ముందు చూపు. అలాంటి నాన్నకి ఏం చేస్తే రుణం తీరుతుంది అనుకున్నారో ఏమో.. తన తండ్రి ఒక్కసారి ప్రాణం పోసి జన్మనిస్తే, తాను మాత్రం అనేక సార్లు రక్తదానం చేసి పలువురికి ప్రాణదాతగా నిలుస్తున్నారు డా.సంపత్ కుమార్. ఎన్ని గొప్ప పనులైనా చేయ్యి.. రక్తదానానికి మించింది లేదు అని తన తండ్రి చెప్పిన మాట నుంచి స్ఫూర్తి పొంది.. అనేక సార్లు రక్తదానం చేసి తండ్రి పై తన ప్రేమను చాటుకుంటున్నారు. నేటి ఫాదర్స్ డే నేపథ్యంలో తండ్రికి తనంటే ప్రాణం.. ప్రాణం పోయడం అంటే తనకి ఇష్టం అంటున్నారు సంపత్ కుమార్. తండ్రికి తగ్గ తనయుడు.. సుమారు 25 ఏళ్ల క్రితం రక్తదానం గురించి తన తండ్రి కోట మోహన్ రావు చెప్పిన మాట ఇప్పటికీ గుర్తుందన్నారు నగరానికి చెందిన సంపత్ కుమార్. నాన్న నింపిన స్ఫూర్తితో అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక మరణించిన వ్యక్తి చావుతో ఒక ఉద్యమంగా రక్తదానాన్ని చేస్తూ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. 10, 50, 100 కాదు.. ఏకంగా 322 సార్లు రక్తంతో పాటు ప్లేట్లెట్స్, ప్లాస్మా, డబ్ల్యూబీసి దానం చేసి ప్రాణదాతగా నిలుస్తున్నారు. నాన్న నాకు పోసిన ప్రాణం కొన్ని వందల మందికి ప్రాణాలు నిలిపే వారధిగా నిలవడమే తన లక్ష్యమని, ఇదే తన తండ్రికి తీర్చుకునే రుణమని చెబుతున్నారు. ప్రతి ఏడాది ఫాదర్స్ డే రోజు ఒక గొప్ప కొడుకుగా సంతృప్తిగా ఉండడానికి ఈ రక్తదానం కారణంగా నిలుస్తుందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. నేను ప్రాణం నిలుపుతా, తాను ప్రాణం పోస్తుంది.. నాన్న కోరికకు అనుగుణంగా అనేక సార్లు రక్తదానం చేసిన వ్యక్తిగా నిలవడం చాలా సంతోషంగా ఉంది. రక్తదానంతో ప్రాణదాతగా నిలిస్తే.. అసలు ప్రాణదాత డాక్టర్ అని నా నమ్మకం. అందుకే నేను డాక్టర్ కాలేకపోయినా నా కూతురిని డాక్టర్ని చేసి అటు ఒక తండ్రికి కొడుకు గానూ, ఇటు ఒక కూతురికి తండ్రిగానూ నా వంతు బాధ్యతను నిర్వహించాను. నా కోరికకు అనుగుణంగా నా కూతురు కోట శృతి మెడిసిన్ పూర్తి చేసి డాక్టర్‌గా ఎంతో మంది ప్రాణాలను కాపాడే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. – సంపత్ కుమార్, హైదరాబాద్. (చదవండి: -
భారత్, చైనా, జపాన్‌లతో దాతల సమావేశం...సాయం కోరుతున్న శ్రీలంక
Lanka Plans Donor Conference: శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే శ్రీలంకలో ఏర్పడిన కొత్త ప్రభుత్వానికి తమ దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేయటం ఒక పెద్ద సవాలుగా మారింది. ప్రస్తుతం అక్కడ ప్రజలు తీవ్ర ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. అదీగాక విదేశీ మారక నిల్వలు కొరత కారణంగా ఇంధనం, మందులతో సహా నిత్యావసరాలను దిగుమతి చేసుకోలేని దారుణ స్థితిలో ఉంది. ఏవిధంగానైన ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు శ్రీలంక కొత్త ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే విదేశీ సహాయం కోరుతూ చైనా, భారత్, జపాన్‌లతో దాతాల సమావేశాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమ్ సింఘే పేర్కొన్నారు. తమకు చారిత్రాత్మక మిత్రదేశాలుగా ఉన్న ఈ దేశాల సాయంతోనే ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాం అని అన్నారు. అమెరికా నుంచి కూడా సాయం తీసుకుంటామని చెప్పారు. ఈ మేరకు న్యూఢిల్లీ నుంచి అదనపు మద్దతుపై చర్చల కోసం భారత్ నుంచి అత్యున్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం వస్తుందని, అలాగే యూఎస్ ట్రెజరీ నుంచి ఒక బృందం వచ్చేవారం శ్రీలంక రానుందని వెల్లడించారు. అదీగాక భారత్ శ్రీలంకకి సుమారు రూ. 2 లక్షల కోట్లు సాయం అందించిన సంగతి తెలిసిందే. కొన్ని దిగుమతుల కోసం దాదాపు 1.5 బిలయన్ డాలర్ల ( దాదాపు రూ.11 కోట్లు) యువాన్ డినామినేట్ స్వాప్ నిబంబధనలపై చర్చలు జరపాలని చేసిన శ్రీలంక చేసిన విజ్ఞప్తిని చైనా పరీశీలిస్తుందని తెలిపారు. అంతేగాక శ్రీలంక వాణిజ్య రాజధాని కొలంబో చేరుకున్న ఐఎంఎఫ్ బృందంతో చర్చలు పురోగతి సాధించాయని, ఈ నెలాఖరులోగా ఒప్పందం కుదిరే అవకాశం ఉందని విక్రమ్ సింఘే చెప్పారు. (చదవండి: క్షణాల్లో అంటుకున్న మంటలు, వీడియో వైరల్) -
అభివృద్ధి ప్రదాత శ్రీహరిరావు కన్నుమూత
కె.గంగవరం (రామచంద్రపురం) : నియోజకవర్గంలో వివిధ ఆలయాల నిర్మాణానికి కృషి చేసి, పలు ఆలయాల నిర్వహణకు నగదు డిపాజిట్ చేసిన దాత చిలుకూరి శ్రీహరిరావు (80) కన్నుమూశారు. కోటిపల్లికి చెందిన శ్రీహరిరావు సోమవారం అనారోగ్యానికి గురికావడతో రాజమహేంద్రవరంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. ఆయనకు సంతానం లేరు. వితరణశీలిగా గుర్తింపు పొందిన శ్రీహరావు పలు ఆలయాలకు ఫిక్సిడ్ డిపాజిట్లు చేసి దాని ద్వారా వచ్చే వడ్డీతో పూజా కార్యక్రమాలు నిర్వహించాలని సంబంధిత ఈఓలకు సూచించారు. మరణానంతరం తన శరీరాన్ని వైద్య విద్యార్థులకు ప్రయోగాల కోసం దానం చేయాలని ముందుగానే తెలియజేశారు. దీంతో ఆయన పార్థివ దేహాన్ని కాకినాడ రంగరాయ వైద్య కళాశాలకు అప్పగించారు. ఆయన మృతికి ఆలయ తనిఖీదారు వి.వెంకటేశ్వరరావు, ఈఓలు కె.రామచంద్రరావు, పి.వి.చలపతిరావు, కె.సుబ్రహ్మణం, దేవాదాయ సిబ్బంది సంతాపం తెలిపారు.