breaking news
domalapalli
-
మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులకు అస్వస్థత
నల్లగొండ రూరల్ : మండలంలోని దోమలపల్లి జెడ్పీ హైస్కూల్లో మధ్యాహ్న భోజనం తిన్న పలువురు విద్యార్థులు శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు, హైస్కూల్ హెడ్మాస్టర్ ప్రమీల తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్న భోజనం తిన్న తరువాత 4గంటలకు 13 మంది విద్యార్థులు వాంతులు కావడంతో మునుగోడులోని ఓ వైద్యుడి దగ్గర తీసుకెళ్లి చికిత్స అందించారు. అయితే ఇందులో కొండారం గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థి కావ్యశ్రీ, 7వ తరగతి విద్యార్థి హరికృష్ణలకు కడుపునొప్పి లేస్తుందని చెప్పడంతో నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చి చికిత్స అందిస్తున్నారు. ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. అసలేం జరిగింది ? మధ్యాహ్న భోజనం తిన్న తరువాత విద్యార్థులు కాసేపు ఆడుకున్నారు. ఎండ తీవ్రత, ఉక్కపోతగా ఉండటంతోపాటు ఫుడ్‌పాయిజన్‌కు గురైనట్లు గ్రామస్తులు తెలిపారు. 4గంటలకు ఒకరు తరువాత ఒకరు 13 మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉపాధ్యాయులంతా ఆందోళన గురై వెంటనే ఆస్పత్రికి తరలించారు. -
రుణమాఫీ ఒకేసారి చేయాలి
దోమలపల్లి (నల్లగొండ రూరల్) ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండ మండలంలోని దోమలపల్లిలో సంఘ బంధం భవనాన్ని ప్రారంభించారు. అనంతరం దోమలపల్లి – అప్పాజీపేట గ్రామాల మధ్య రోడ్డు పనులను శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రుణం లభించక రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారని ఫలితంగా వారిపై ఆర్థిక భారం పడుతుందన్నారు. ప్రభుత్వం ఒకేసారి రుణమాఫీని చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే ఏడాదిలోగా బి.వెల్లెంల ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేసి సాగు నీరు అందించడమే తన లక్ష్యమన్నారు. ఈ ప్రాంత రైతుల బీడు భూములకు సాగు నీరు అందించి వారి కుటుంబాల్లో ఆనందాన్ని నింపుతానన్నారు. అన్ని గ్రామాల లింకు రోడ్డులను క్రమంగా బీటీ రోడ్డులుగా మారుస్తామన్నారు. గ్రామ జ్యోతికి ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం వల్ల అభివృద్ధి జరగడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు వంగూరి లక్ష్మయ్య, గుమ్మల మోహన్‌రెడ్డి, గాదె లక్ష్మి, వెంకట్‌రెడ్డి, యాదయ్య, రవీందర్, సతీష్, ఉమాదేవి, ఎంపీడీఓ సత్తెమ్మ, సీసీ యాదమ్మ, ఏఈ రాములు తదితరులు పాల్గొన్నారు.