breaking news
d.jagadish
-
‘పట్టిసీమ’పై శ్రద్ధ ‘హంద్రీ నీవా’పై ఏదీ?
చంద్రబాబును ప్రశ్నించిన సీపీఐ జిల్లా కార్యదర్శి డి. జగదీష్ హంద్రీ-నీవా కార్యాలయం ముట్టడి అనంతపురం క్రైం : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృష్ణా డెల్టాకు సాగునీరు అందించే పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్‌పై ఉన్న శ్రద్ధ కరువు ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించే హంద్రీ-నీవా ప్రాజెక్టుపై లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీష్ ఆరోపించారు. హంద్రీ-నీవా పథకాన్ని పూర్తి చేయకపోవడాన్ని నిరసిస్తూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం హంద్రీ-నీవా కార్యాలయాన్ని ముట్టడించారు. ఉద్యోగులను కార్యాలయం నుంచి బయటకు పంపి మూడు గంటల పాటు ఆందోళన చేశారు. జగదీష్ మాట్లాడుతూ పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు మళ్లిస్తే ఆదా అయ్యే కృష్ణా జలాలను రాయలసీమకు కేటాయిస్తూ జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు. హంద్రీ-నీవా ప్రాజెక్టు పూర్తి అయితే రాయలసీమ నాలుగు జిల్లాలో 6 లక్షల ఎకరాలకు, అనంతపురం జిల్లాలో 3.45 లక్షల ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు అందుతుందన్నారు. దీనికి ముఖ్యమంత్రి ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడంలేదన్నారు. విస్తారంగా వర్షాలు కురిస్తే పుష్కలంగా నీరు లభ్యమయ్యే ప్రాంతానికి ఉపయోగపడే పట్టిసీమపై అత్యధిక శ్రద్ధ కనబరుస్తున్నారన్నారు. ఈ ఏడాది ఆగష్టు 15 నాటికి కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు అందిస్తామని చంద్రబాబు ప్రకటించడం ఆ పథకానికి ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తోందన్నారు. కొత్త ఎస్ఎస్ఆర్ రేట్లు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్లు హంద్రీ-నీవా పనులు చేయలేమని చెతులెత్తేశారన్నారు. పుష్కలంగా నీరు లభించే ప్రాంతాలు ముఖ్యమా.? తాగునీటి కోసం అలమటిస్తున్న కరువు జిల్లాలు ముఖ్యమా..? అని ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన ప్రశ్నించారు. వెనుకబడి ప్రాంతాల్లోని ప్రాజెక్టులను పూర్తి చేయడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జాఫర్, రైతు సంగం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శివన్న, కాటమయ్య, ఉపాధ్యక్షులు వెంకటేశులు, వన్నారెడ్డి, నాయకులు మహదశ్, సంగప్ప, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి కేశవరెడ్డి, మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పద్మావతి, అనంతపురం రూరల్ మండల సీపీఐ కార్యదర్శి రఘురామయ్య, సీపీఐ నాయకులు, కార్యకర్తలు, వందలాది మంది రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళలు పాల్గొన్నారు. -
ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వం
సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ రాయదుర్గంటౌన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీష్ విమర్శించారు. స్థానిక అజీజీయా షాదీమహల్‌లో ఆ పార్టీ నియోజకవర్గ సమావేశం బుధవారం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన జగదీష్ మాట్లాడారు. ఎన్నికల ముందు చంద్రబాబు అనేక వాగ్దానాలు ఇచ్చి, ఇప్పుడు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. నేటి వరకు అనంతపురాన్ని కరువు జిల్లాగా ప్రకటించలేదన్నారు. రుణాల మాఫీ, కొత్త అప్పులు మంజూరు నిలిచిపోరుునట్లు తెలిపారు. పశువులకు మేత కొరత ఏర్పడిందని చెప్పారు. సుమారు 1200 గ్రామాల్లో తాగునీరు, పనులు లేక ప్రజలు వలసలు వెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రంతో కయ్యానికి సిద్ధం కావాల్సిన అవసరం వచ్చిందన్నారు. న్యాయబద్ధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రారుుతీలు, ప్రత్యేక హోదాపై చంద్రబాబు నోరు మెదపడంలేదని ఆరోపించారు. ప్రధాని మోదీకి అర్జీలు ఇస్తే సమస్యలు పరిష్కారం కావని, పోరాడి సాధించుకోవాలని సూచించారు. ప్రజా సంక్షేమాన్ని వదిలేసి కేవలం పత్రికా ప్రకటనలు, పర్యటనలకే ప్రభుత్వం పరిమితమైందని విమర్శించారు. ప్రజలను విస్మరించి కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వం ఊడిగం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజా సమస్యలపై కార్యకర్తలు, నేతలు పోరాటాలు చేయూలని పిలుపునిచ్చారు. ఉక్కు కర్మాగారం కోసం ఉద్యమం రాయదుర్గం నియోజకవర్గంలోని డీ.హీరేహాళ్ మండలంలో ఉక్కు కర్మాగారం నిర్మాణం కోసం కలిసి వచ్చే రాజకీయ పక్షాలతో కలిసి ఉద్యమించనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ తెలిపారు. యూపీఏ ప్రభుత్వం రాయదుర్గంలో కుద్రేముఖ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ఎన్నికల తర్వాత కర్మాగారం ఊసే ఎత్తడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. సీపీఐ తాలూకా ఇన్చార్జి నాగార్జున, నేతలు వెంకటేశులు, నరసింహులు, ఫకృద్దీన్, హనుమంతు, సిద్దమ్మ, నీలకంఠమ్మ పాల్గొన్నారు.