breaking news
divaider
-
డివైడర్‌ను ఢీకొట్టి బస్సు బోల్తా
మైన్‌పురి: ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మంది మృతి చెందగా, 25 మంది గాయాలపాలయ్యారు. మైన్‌పురి జిల్లా కల్లూ కీ మంధియా గ్రామం వద్ద బుధవారం ఉదయం 5.30 గంటల సమయంలో ఓ ప్రైవేట్ బస్సు డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. దీంతో ఒక మహిళ సహా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి గురైన బస్సు రాజస్తాన్‌లోని జైపూర్ నుంచి యూపీలోని ఫరూఖాబాద్ వైపు వస్తోందనీ, ఘటన సమయంలో బస్సులో 70మంది వరకు ప్రయాణికు లున్నారని మైన్‌పురి ఎస్పీ అజయ్ శంకర్ రాయ్ తెలిపారు. మృతుల్లో బస్సుపైన నిద్రిస్తున్న వారే ఎక్కువమంది ఉన్నారని చెప్పారు. వీరంతా రాజస్తాన్‌లో కూలీ పనులకు వెళ్లి స్వగ్రామాలకు తిరిగి వస్తున్నా రన్నారు. ఈ ప్రమాద మృతులకు ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. -
డివైడర్‌పైకి దూసుకెళ్లిన కంటైనర్
తటిలో తప్పిన ప్రమాదం చిల్లకూరు : డివైడర్‌పైకి కంటైనర్ లారీ దూసుకెళ్లిన సంఘటన శుక్రవారం మండలంలోని జాతీయరహదారిపై చోటుచేసుకుంది. వివరాలు.. కష్ణపట్నం నుంచి చెన్నైకు బయలుదేరిన కంటైనర్ నక్కలకాలువ కండ్రిగ సమీపంలోకి వచ్చేసరికి డ్రైవర్ కునుకు తీయడంతో అదుపుతప్పి డివైడర్ ఎక్కి అవతలివైపునకు వచ్చి నిలిపిపోయింది. దీనిని గుర్తించి ఎదురుగా వచ్చే వాహనచోదకులు అప్రమత్తమవడంతో ప్రమాదం తటిలో తప్పింది. విషయం తెలుసుకున్న స్వర్ణ టోల్‌ప్లాజా సిబ్బంది అక్కడకు చేరకుని కంటైనర్ లారీని పక్కకు తీశారు. దీనిపై పోలీసులకు సమాచారంలేదు.