breaking news
divai Patil Stadium
-
ముంబైపై నార్త్ఈస్ట్ గెలుపు
ముంబై: తమ గత మ్యాచ్‌లో ఏకంగా ఐదు గోల్స్‌తో రెచ్చిపోయిన ముంబై సిటీ ఎఫ్‌సీ శుక్రవారం నార్త్ఈస్ట్ యునెటైడ్ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం చేతులెత్తేసింది.డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ పోరులో 0-2తో ఓడింది. 57వ నిమిషంలో కోకే నుంచి అందుకున్న పాస్‌ను గోల్ పోస్టుకు అతి సమీపం నుంచి టోంగా బంతిని నెట్లోకి పంపి 1-0 ఆధిక్యాన్ని అందించాడు. 72వ నిమిషంలో జుంగ్‌బర్గ్ గాయపడి మైదానం వీడాడు. అప్పటికేల సంఖ్య సరిపోయింది. దీనికి తోడు 75వ నిమిషంలో పావెల్ మోవ్స్ రెండో ఎల్లో కార్డ్‌కు గురై మైదానం వీడడంతో ముంబై జట్టు 9 మందితోనే ఆడాల్సి వచ్చింది. ఇక 90+2వ నిమిషంలో ఫెలిపే గోల్‌తో నార్త్ఈస్ట్ 2-0తో నెగ్గింది. ఐఎస్ఎల్లో నేడు ఢిల్లీ డైనమోస్ ఎఫ్‌సీ ఁ చెన్నైయిన్ ఎఫ్‌సీ వేదిక: ఢిల్లీ సమయం: రాత్రి 7 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం: స్టార్ స్పోర్ట్స్ 2,3 -
ముంబై మెరిసింది
ముంబై: సొంతగడ్డపై ముంబై సిటీ ఎఫ్‌సీ జట్టు చెలరేగింది. ఐఎస్ఎల్ ఆరంభ మ్యాచ్‌లో కోల్‌కతా చేతిలో పరాజయం ఎదురైనప్పటికీ తమ రెండో మ్యాచ్‌లోనే లోపాలను సరిదిద్దుకుంది. దీనికి తోడు మిడ్ ఫీల్డర్ ఆండ్రీ మోరిట్జ్ అద్భుత విన్యాసాలతో హ్యాట్రిక్ గోల్స్ సాధించగా శనివారం డీవై పాటిల్ స్టేడియంలో ఎఫ్‌సీ పుణే సిటీతో జరిగిన మ్యాచ్‌లో ముంబై 5-0తో ఘన విజయం సాధించింది. సుభాష్ సింగ్, జోహాన్ లెట్జెల్టర్ చెరో గోల్ సాధించారు. లీగ్‌లో ఇప్పటిదాకా ఏ జట్టూ ఇన్ని గోల్స్ చేయలేదు. ఆదివారం జరిగే మ్యాచ్‌ల్లో అట్లెటికో డి కోల్‌కతా తో ఢిల్లీ డైనమోస్; నార్త్ఈస్ట్ యునెటైడ్తో గోవా ఎఫ్‌సీ తలపడతాయి.