breaking news
ditch pally 7th betalian
-
డిచ్పల్లి బెటాలియన్ సమీపంలో రోడ్డు ప్రమాదం
-
సైకిల్‌పై సవారీ
నిజామాబాద్: తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్‌కు చెందిన డిచ్పల్లిలోని ఏడో బెటాలియన్‌ను టీపీఎస్పీ అడిషనల్ డీజీపీ రాజీవ్ త్రివేది ఆదివారం సందర్శించారు. ఇందులో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా.. హైదరాబాద్ నుంచి ఉదయం నాలుగు గంటలకే సైకిల్ మీద బయలుదేరిన అడిషనల్ డీజీపీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు డిచ్పల్లి చేరుకున్నారు. వాతావరణానికి హానిచేయని వాహనాలను వాడటం వల్ల కాలుష్యం నిరోధించడానికి కృషి చేయాలని మాటలతో కాకుండా ఇలా తన చేతలతో చేసి చూపించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ సైకిల్ వాడకం ఆరోగ్యానికి ఎంతో మంచిదన్నారు. ఈ సైకిల్ యాత్రలో రాజీవ్ త్రివేదీతో పాటు ఆయన ఇద్దరు కుమారులు కూడా పాల్గొన్నారు. ముందుగా నిజామాబాద్ ఎస్పీని కలిసి ఆ తర్వాత డిచ్పల్లిలోని ఏడో బెటాలియన్‌ను సందర్శించి సిబ్బందిని ఆశ్చర్యచకితుల్ని చేశారు.