breaking news
disturbing law and order
-
మంత్రిని ప్రశ్నించినందుకు యూట్యూబర్ అరెస్టు!
రాష్ట్రమంత్రి గ్రామంలో పర్యటించడంతో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి ప్రాజెక్టులు గురించి నిలదీశాడు ఓ యూట్యూబర్. అంతే మరుసటిరోజే నేరస్తుడి మాదిరిగి చేతులకు తాడుకట్టి మరీ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. పైగా అతను శాంతి భద్రతలకు విఘాతం కలిగించాడంటూ కేసులు సైతం నమోదు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..'మొరాదాబాద్ ఉజ్జల' అనే యూట్యూబ్ ఛానెల్‌ని నిర్వహిస్తున్న సంజయ్ రాణా అనే వ్యక్తి తమ గ్రామానికి వచ్చిన రాష్ట్రమంత్రిని అభివృద్ధి పనులు గురించి ప్రశ్నించాడు. వాస్తవానికి సంభాల్ జిల్లాలలో బుద్‌నగర్ ఖండూవా గ్రామంలోని చెక్‌డ్యామ్ శంకుస్థాపన కోసం స్థానిక ఎమ్మెల్యే తోపాటు సెకండరీ ఎడ్యుకేషన్ రాష్ట్ర మంత్రి గులాబ్ దేవిని గ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా సంజయ్ వారిని ప్రశ్నించడమే గాక, అందుకు సంబంధించిన వీడియోని కూడా నెట్టింట పోస్ట్ చేశాడు. దీంతో మరుసటి రోజే అతనిపై స్థానిక బీజేపీ యువజన విభాగం నాయకుడు శుభం రాఘవ్ చందౌసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యూట్యూబ్ ఛానెల్ గుర్తింపు కార్డు, మైక్రోఫోన్ కలిగి ఉన్న నకిలీ జర్నలిస్ట్ అని, ప్రభుత్వ పనికి అంతరాయం కలిగించేలా దుర్భాషలాడుతూ బెదిరింపులకు దిగాడని ఆరోపణలు చేశాడు. అయితే ఆ వీడియోలో యూట్యూబర్ ఆ మంత్రిని మీరు రోడ్డు, గుడి బాగు చేస్తానని చెప్పారు. దీని గురించి ఏం చెబుతారు. గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ఆలయంలో ప్రమాణం చేశారు. ఎన్నికల్లో గెలిపించమని సాయం కోరారని అడిగారంటూ మంత్రిని నిలదీశాడు. यूपी के संभल में पत्रकार संजय राणा ने मंत्री गुलाब देवी से तीखे सवाल पूछे, जवाब में पहले FIR फिर गिरफ्तारी हो गई. जिस किसी को श्री राहुल गांधी के लोकतंत्र के कमज़ोर होने वाले वक्तव्य पर आपत्ति है - पढ़िए यह खबरpic.twitter.com/jsnkH6zWle — Supriya Shrinate (@SupriyaShrinate) March 13, 2023 దీంతో ఆ మంత్రి ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని వీడియో చివరలో చెబుతున్నట్లు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మేరకు ఈ సంఘటనను లక్ష్యంగా చేసుకుని సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టారు. విదేశీ గడ్డపై కాంగ్రస్ నాయకుడు రాహుల్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ విషయాన్నే యాదవ్ ప్రస్తావిస్తూ.. బీజేపీ దీనికి ఏం చెబుతుందని నిలదీశారు. బీజేపీ ప్రభుత్వం హయాంలో ప్రజాస్వామ్యం స్వేచ్ఛ ఇలానే ఉంటుంది అనడానికి ఇదే ఉదహరణ అంటూ సదరు యూట్యూబర్‌ని అరెస్టు చేసిన వీడియోలను సైతం ట్వీట్ చేశారు అఖిలేష్ యాదవ్. కాగా ఆ యూట్యూబర్‌కి సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ బెయిల్ ఇవ్వడంతో అతన్ని విడుదల చేసినట్లు పోలీసులు వెల్లడించారు. विदेशी धरती पर भारत में लोकतंत्र की स्थिति पर बयान देने पर बवाल मचाने वाली भाजपा उप्र के संभल में इस पत्रकार की हालत भी देख ले, जिसे विकास कार्यों पर भाजपाई मंत्री से पूछे गए सवाल के कारण हिरासत में ले लिया गया है। ये है भाजपा सरकार में लोकतंत्र व अभिव्यक्ति की आज़ादी की तस्वीर। pic.twitter.com/smhanrvILb — Akhilesh Yadav (@yadavakhilesh) March 14, 2023 (చదవండి: వేలాది మంది రైతులు ముంబై వైపుగా పాదయాత్ర..) -
తొమ్మిదేళ్ల బాలుడిపై 107/116 సెక్షన్ల కింద కేసు!
ఆగ్రా: ఉత్తరప్రదేశ్‌లో అత్యచారాలు, మతఘర్షణలను కట్టడి చేయలేక విమర్శలు ఎదుర్కొంటుండగా.. పోలీసులు మాత్రం చిన్నపాటి ఘర్షణకే మూడో తరగతి బాలుడిపై 107/116 సెక్షన్ల కింద శాంతిభద్రతల ఉల్లంఘన కేసు నమోదు చేశారు. తొమ్మిదేళ్ల బాలుడితో పాటు తండ్రిని అరెస్ట్ చేశారు. తండ్రీకొడుకులు కోర్టు వెళ్లి బెయిల్ తీసుకున్నారు. ఫిరోజాబాద్ జిల్లా తుండ్లా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కుర్రా అనే గ్రామంలో బాలుడికి చెందిన పశువులు ఇతరుల పొలంలోకి వెళ్లి పంటను ధ్వంసం చేశాయి. ఈ విషయంపై ఆ బాలుడు మరో అబ్బాయి గొడవపడ్డారు. ఇరు కుటుంబాలు వాదులాడుకున్నాయి. అంతే పోలీసులు వచ్చి తండ్రీకొడుకులను స్టేషన్‌కు తీసుకెళ్లారు. పోలీసులు కనీసం తమ వాదన కూడా వినలేదని బాధితుల బంధువు ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. మైనర్ బాలుడిపై తీవ్రమైన శాంతిభద్రతల ఉల్లంఘన కేసు నమోదు చేయడం వివాదాస్పదమైంది. తుండ్లా పోలీస్ ఇన్స్పెక్టర్ ఈ కేసుపై స్పందిస్తూ.. బాలుడిని బంధించలేదని, విచారణ కోసం తండ్రితో కలసి స్టేషన్లో కాసేపు కూర్చోబెట్టామని వివరణ ఇచ్చారు. అయినా మైనర్‌పై కఠిన సెక్షన్లు నమోదు చేయడం తప్పని అంగీకరించారు. ఈ సంఘటనపై విచారణ చేస్తున్నామని, దర్యాప్తు చేయకుండా బాలుడిపై కేసు నమోదు చేసిన ఎస్ఐపై చర్యలు తీసుకుంటామని సీఐ చెప్పారు.