breaking news
district ysrcp president
-
బాబు నీతులు చెబుతారే గానీ పాటించరు
పెనుకొండ : ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న సీఎం చంద్రబాబు నీతులు చెబుతారేగానీ పాటించరనే విషయం ప్రజలకు బాగా అర్థమయ్యిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ అన్నారు. సోమవారం పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన తలసాని టీఆర్ఎస్లో చేరినప్పుడు ఇది రాజ్యాంగ వ్యతిరేకమని, తలసాని వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చంద్రబాబు గవర్నర్, రాష్ట్రపతి భవన్ చుట్టూ తిరిగారన్నారు. దమ్ముంటే తలసాని శ్రీనివాసయాదవ్ విసిరిన సవాల్‌ను చంద్రబాబు స్వీకరించాలన్నారు. వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవడమేకాక మంత్రి పదవులు కూడా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. చంద్రబాబుకు చీము, నెత్తురూ ఉంటే వైఎస్సార్సీపీ తరఫున గెలిచి మంత్రి పదవులు పొందిన ఎమ్మెల్యేలను వెంటనే రాజీనామా చేయించి గెలిపించుకోవాలన్నారు. టీడీపీ పాలనలో మైనార్టీలు, ఎస్టీలకు మంత్రి పదవులు దక్కకుండా పోయాయని, బడుగుల పార్టీ అని చెప్పుకునే బాబు దానిని బడాబాబుల పార్టీగా మార్చేశారని విమర్శించారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్‌ను దూషించిన, అవినీతిపరులైన ఎమ్మెల్యేలకు తన ప్రభుత్వంలో పెద్దపీట వేస్తున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెప్పి తీరుతారన్నారు. ఈ కార్యక్రమంలో లీగల్‌సెల్ రాష్ట్ర కార్యదర్శి భాస్కరరెడ్డి, మండల కన్వీనర్ శ్రీకాంతరెడ్డి, ఎంపీటీసీలు రామ్మోహన్‌రెడ్డి, మురళి, అనితాశ్రీనివాసరెడ్డి, సర్పంచ్‌లు సుధాకరరెడ్డి, రాజగోపాలరెడ్డి, మార్కెట్‌యార్డ్ మాజీ చైర్మన్ నాగలూరు బాబు, కొండలరాయుడు, ప్రసాద్, బోయనరసింహ, సోమశేఖరరెడ్డి, రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు. -
విచారణ అంటే భయమెందుకు బాబూ?
గోరంట్ల : నేనే నిప్పులా బతికాను..నీతి, నిజాయితీ అనే ఉపోద్ఘాతాలు చెప్పే సీఎం చంద్రబాబు ఏ కేసులోనైనా విచారణ అంటే భయం ఎందుకో అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాలుగుండ్ల శంకరనారాయణ ప్రశ్నించారు. మండలంలోని కమ్మవారిపల్లి గ్రామంలో ఆయన శుక్రవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో రెండు రోజుల క్రితం గంభీరంగా తన నిజాయితీపై ఉపోద్ఘాతాలు ఇచ్చిన సీఎం హడావుడిగా హైకోర్టులో స్టే తీసుకురావడంపై ఆయన నీతి, నిజాయితీలను శంకించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. న్యాయస్థానం ఆశ్రయించడంతో ఆయన ఈ కేసులో ఎంత ఆందోళనలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చునన్నారు. పలు కేసుల్లో ఏదో ఒక సాంకేతిక కారణాలను చూపి స్టేలను తెచ్చుకున్నారని ఆయన గుర్త చేశారు. ఏతప్పు చేయకపోతే ఎందుకు స్టే తెచ్చుకుంటారని ఆయన ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన ఆడియో టేపులు ఉన్నా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ ఫకృద్దీన్‌సాబ్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు గంపల వెంకటరమణారెడ్డి, మలసముద్రం మాజీ సర్పంచు వెంకటరమణారెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు వెంకటరెడ్డి, నాయకులు ధనుంజయరెడ్డి , శివశంకర్‌రెడ్డి, వీరనారాయణరెడ్డి, అంగడినారాయణరెడ్డి, ఇలియాస్, డాక్టర్బాషా తదితరులు పాల్గొన్నారు.