breaking news
district ministers
-
బాధ్యతలు స్వీకరించిన కొత్త అధ్యక్షులు
- నేడు టీడీపీ మినీ మహానాడు - హాజరు కానున్న యనమల, జిల్లా మంత్రులు సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అర్బన్, రూరల్ జిల్లా అధ్యక్షులు వాసుపల్లి గణేష్‌కుమార్, పప్పల చలపతిరావులు శనివారం బాధ్యతలు చేపట్టారు. వాసుపల్లి రెండోసారి అధ్యక్షునిగా ఎన్నిక కాగా, చివరి నిముషంలో తెరపైకి వచ్చి అనూహ్య పరిణామాల మధ్య రూరల్ అధ్యక్షునిగా ఎంపికయ్యారు. జిల్లా పార్టీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన వీరిరువురినీ ఇప్పటి వరకు రూరల్ అద్యక్షునిగా ఉన్న గవిరెడ్డి రామానాయుడుతో పాటు మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ అవంతి శ్రీనివాసరావు,ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కొత్త అధ్యక్షులను అభినందనలతో ముంచెత్తారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తమ వంతుకృషి చేస్తా మని ప్రకటించారు. గ్రూపులు,వర్గాలకతీతంగా పార్టీ అభివృద్ధికి సహకరించాలని వారు కోరారు. ఉదయం నుంచి మధ్యా హ్నం వరకు జిల్లా, అర్బన్ కమిటీలపై కసరత్తు చేశారు. అర్బన్ జిల్లా కమిటీలో కీలకమైన ప్రధాన కార్యదర్శి పదవి కోసం ఇరువర్గాల మధ్య తీవ్రపోటీ నెలకొంది. హర్షవర్ధన్ప్రసాద్కు ఇవ్వాలని నగర పరిధిలోని గంటా వర్గానికి చెందిన ఎమ్మెల్యేలుపట్టుబట్టగా, అయ్యన్న వర్గానికి చెందిన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తదితరులు మాత్రం చోడే పట్టాభిరామ్ లేదా బెరైడ్డి పోతనరెడ్డిలకు ఇవ్వాలని పట్టుబట్టారు. చివరకు వెలగపూడి పంతం నెగ్గించు కుని తన అనుచరుడైన పట్టాభిరామ్‌ను ఈ కీలకపదవికి ఎంపిక చేయించగలిగారు. అర్బన్‌లో ప్రచార కార్యదర్శిగా బొట్టా వెంకటరమణ, అధికార ప్రతినిధులుగా బెరైడ్డి పోతనరెడ్డి, ప్రసాదుల శ్రీనివాసులు, ఉపాధ్యక్షులుగా పల్లా శ్రీను, మూర్తి యాదవ్లుతో పాటు 35 మందితో అర్బన్ కమిటీని ఏర్పాటు చేసినట్టు చెబుతున్నారు. కాగా అలాగే రూరల్ ప్రధాన కార్యదర్శి మినహా మిగిలిన కార్యవర్గం విషయంలో కూడా నేతల ఏకాభిప్రాయం మేరకు ప్రతిపాదించిన పేర్లను అధిష్టానం ఆమోదం కోసం పంపించారు. అక్కడ ఆమోద ముద్ర పడగానే ఈ నెల 25వ తేదీన అధికారికంగా ప్రకటించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. అంకోసా ఆడిటోరియంలో జరుగనున్న మినీ మహానాడుకు జిల్లా ఇన్చార్జి మంత్రి యనమల రామకృష్ణుడు, జిల్లా మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాస రావులతో పాటు పార్టీ జిల్లా పరిశీలకులు, ఇతర ముఖ్యనేతలంతా హాజరు కానున్నారు. ఇందుకోసం ఏర్పాట్లపై మధ్యాహ్నం కొత్తఅధ్యక్షుల సమక్షంలో పార్టీ ముఖ్య నేతలంతా సమావేశమై చర్చిం చారు. -
జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: జిల్లా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, చైర్మన్ల సమన్వయంతో జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లికృష్ణారావు అన్నారు. ఆదివారం స్థానిక అన్నపూర్ణగార్డెన్స్‌లో పీఆర్టియు తెలంగాణ ఆధ్వర్యంలో మంత్రులు, ఎంపీ, జెడ్పీఛైర్మన్, ఎమ్మెల్యేలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిదన్నారు. అయితే కొన్ని ఉపాధ్యాయ సంఘాలు తెలంగాణ వ్యతిరేకులకు అండగా నిలవడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, అందులో భాగంగానే రెండు మంత్రిపదవులు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, పార్లమెంటరీ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారన్నారు. ఉద్యోగులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. ఉపాధ్యాయులు నిబద్దతతో పనిచేస్తూ, విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అమలు చేయనున్నందున ఇంగ్లీష్‌మీడియంలో బోధించేందుకు ఉపాధ్యాయులు సిద్దంగా ఉండాలన్నారు. మేనిఫెస్టోలో పేర్కొ న్న ప్రతి హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తామన్నా రు. జిల్లాలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు చర్య లు తీసుకుంటామన్నారు. పరి శ్రమల స్థాపనకు ముందుకు వస్తే అవసరమైన సహకారం అందిస్తామన్నారు. ఇందుకుగాను ఆన్లైన్లో పరిశ్రమల సమాచారం ఉంచామని, దరఖాస్తు చేసుకున్న వారికి 15రోజుల్లో అనుమతులు అందజేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు సాంకేతిక విద్యను అందిస్తామన్నారు. కోతలు లేని విద్యుత్ జిల్లాలో రైతులు ఎక్కువగా బోర్లపై ఆధారపడినందున కోతలు లేని విద్యుత్‌ను అందించేందుకు చర్యలు తీసుకుంటామని విద్యుత్‌శాఖామంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. మంత్రులమైనా ఉద్యమ కారులలాగే పనిచేసేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధే కేసీఆర్ ధ్యేయమని, జిల్లాలో వెయ్యిమెగావాట్ల సోలార్‌ప్లాంటును ఏర్పాటు చేస్తామనిచ మైనార్టీ స్టడీ సర్కిల్, పాస్‌పోర్టు ఆఫీసును ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ఉద్యమంలో ఉపాధ్యాయుల సహకారం మరువలేనిదన్నారు. అనంతరం జెడ్పీచైర్మన్, ప్రణాళికాసంఘం డిప్యూటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఉపాధ్యాయ సంఘం నేతలు మాట్లాడారు. అనంతరం వారిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు విఠల్‌రావు ఆర్య, బెక్కెం జనార్ధన్, సాయిరెడ్డి, చలపతిరావు, బాల్‌రెడ్డి, నిస్సీ డెబోరా, యుగంధర్‌రెడ్డి, దుంకుడ శ్రీనివాస్, చెన్నప్ప, వివిధ మండలాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.