breaking news
the district administration
-
కొత్త జిల్లాల్లో పరిపాలనకు సిద్ధం కావాలి
ప్రభుత్వ భవనాలు లేని చోట అద్దె ఇళ్లు తీసుకోవాలి రికార్డుల పంపిణీ పూర్తి చే యాలి కలెక్టర్ వాకాటి కరుణ హన్మకొండ అర్బన్ : కొత్త జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన తరుణంలో అక్టోబర్ 11వ తేదీ నుంచి ఆయా జిల్లాలో పరిపాలన కార్యకలాపాలు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధం కావాలని కలెక్టర్ వాకాటి కరుణ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మం దిరంలో జిల్లాల విభజనకు సంబంధించిన అంశాలపై కలెక్టర్ శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహబూబాబా ద్లో వైటీసీలో, భూపాలపల్లిలో సింగరేణి సంస్థ భవనంలో కలెక్టరేట్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామమన్నారు. పాత భవనాలు ఉంటే వాటికి మరమ్మతులు చేయించుకోవాలని, లేని చోట్ల అద్దె భవనాలు తీసుకోవాలన్నారు. తమ శాఖలకు సంబంధించిన పూర్తి వివరాలతో ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించారు. ఫైళ్లు స్కానింగ్ చేయించాలి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇప్పటివరకు ఉన్న ఫైళ్లు భద్రంగా స్కానింగ్ చేయించాలని కలెక్టర్ సూచించారు. ఏ జిల్లా పరిధిలోని ఫైళ్లు ఆ జిల్లాకు పంపించాలన్నారు. ఈ పనులను వారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. కోర్టు వివాదాలు, ఇతర ముఖ్యమైన ఫైళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. ఫైళ్లకు సంబంధించిన పూర్తి వివరాలు రికార్డుల్లో నమోదుచేసుకోవాలన్నారు. ప్రస్తుతం ఉన్న సిబ్బందినే కొత్త జిల్లాలకు పంపిణీ చేసుకోవాలని పేర్కొన్నారు. ఉమ్మడి కార్యాలయాల్లో హన్మకొండ, వరంగల్ ప్రస్తుతం హన్మకొండ, వరంగల్ జిల్లాల పాలన కొద్ది రోజుల వరకు ఉమ్మడి కార్యాలయాల్లోనే కొనసాగుతుందని కలెక్టర్ అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో చేసినట్లు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఒకే కార్యాలయం మధ్యలో పార్టీషన్, గోడ కట్టడం వంటి వాటితో సర్దుబాటు చేసుకోవాలన్నారు. కొత్తగా ఏర్పడబోయే జిల్లాలకు వచ్చే అధికారులకు సమస్యలు స్వాగతం పలకకుండా ముందస్తుగా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. భూపాలపల్లిలో భవనాల కొరత సమీక్ష సమావేశంలో పాల్గొన్న 30 శాఖలకు పైగా అధికారులు తమకు భూపాలపల్లిలో కార్యాలయం లేదని.. వాటి కోసం ప్రత్యామ్నాయం చూపించాలని కలెక్టర్‌ను కోరారు. కాగా, కార్యాలయాల పూర్తి వివరాలు అందజేసేందుకు లేఖలు రాయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జేసీ ప్రశాంత్‌జీవన్ పాటిల్, ఏజేసీ తిరుపతిరావు, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఇదెక్కడి రేషనలైజేషన్ సారూ... !
తలలు పట్టుకుంటున్న అధికారులు తాత్కాలిక సర్దుబాటు చేస్తే చాలామంది కుప్పం వెళ్లాల్సిన పరిస్థితి కుప్పం వెళ్లేందుకు సుముఖత చూపుతారా? చిత్తూరు(టౌన్): ఉపాధ్యాయుల తా త్కాలిక సర్దుబాటు (రేషనలైజేషన్) అంశం విద్యాశాఖ, ఉపాధ్యాయ వర్గాలో కలకలం రేపుతోంది. ఉన్నతాధికారులు గైడ్‌లైన్స్ చెప్పకుండా విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ఆధారంగా సర్దుబాటు చేయమని చెప్పి చేతులు దులుపుకున్నారు. దీని పై క్షేత్ర స్థాయిలో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గైడ్‌లైన్స్ లేకుండా ఇంత పెద్ద కార్యక్రమం చేయడం అధికారులకు తలనొప్పిగా మారింది. రెండు రోజులు మాత్రమే గడువు ఇవ్వడంతో అధికారులు సర్దుబాటు చేసేందుకు పనులు ప్రారంభించారు. అయితే క్షేత్రస్థాయి నుంచి రావాల్సిన సమాచారం ఆలస్యంగా అందుతోంది. మొత్తంగా ఈ కార్యక్రమం విద్యాశాఖలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోననే సందేహం అందరిలోనూ వ్యక్తమవుతోంది. సర్దుబాటు అంటే.. ఉన్నతాధికారులు చెప్పిన దాని ప్రకారం విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండి ఉపాధ్యాయులు తక్కువగా ఉన్న పాఠశాలలకు విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండి ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్న పాఠశాలల నుంచి తాత్కాలికంగా సర్దుబాటు చేయాలి. ఉన్నతాధికారులు, విద్యాశాఖ అధికారులు చెప్పింది ఇదొక్కటే. కాగా రేషనలైజేషన్ అంటే సవాలక్ష గైడ్‌లైన్స్ ఉంటాయి. అవే వీ పరిగణనలోకి తీసుకోకుండా సర్దుబాటు చేయడమంటే ఆషామాషీ కాదు. జిల్లాలో 18,505 ఉపాధ్యాయ శాంక్షన్ పోస్టులుండగా, వీటిలో 16,167 మంది పని చేస్తున్నారు. 2,338 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక ఉపాధ్యాయులు లేని పాఠశాలలు-8, ఒకే ఉపాధ్యాయుడు ఉన్న పాఠశాలలు-703, ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలలు- 2703 ఉన్నాయి. విద్యాహక్కు చట్టం ప్రకారం 1-19 మంది విద్యార్థులు ఉంటే ఒక ఉపాధ్యాయుడు, 20-60 మధ్య విద్యార్థులుంటే ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలి. ఒకే ఉపాధ్యాయుడు ఉన్న కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య అధికంగానే ఉంది. ఇక్కడకు ఉపాధ్యాయులను సర్దుబాటు ద్వారా తీసుకురావాల్సి ఉంటుంది. ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్న కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగానే ఉంది. ఇక్కడి నుంచి కొంత మందిని సర్దుబాటు పేరుతో అవసరం ఉండే పాఠశాలలకు పంపాలి. పంపిస్తే వెళ్లిపోతారా? ఉపాధ్యాయుల సర్దుబాటు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లోనే జరగాల్సి ఉంటుంది. రేషనలైజేషన్ నిబంధనల ప్రకారం విద్యార్థుల, ఉపాధ్యాయుల నిష్పత్తి ఆధారంగా సర్‌ప్లస్‌గా తేలే వాళ్లలో జూనియర్ టీచర్లను పంపాలి. అయితే తాత్కాలిక సర్దుబాటుకు ఈ నిబంధనలు వర్తిస్తాయా ? లేదా? అనే విషయంపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది. సర్దుబాటు పేరుతో పట్టణ ప్రాంతాలకు వెళ్లేందుకు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఉపాధ్యాయులు సుముఖత చూపకపోవచ్చు. ఇంకా గత సంవత్సరం బదిలీల కౌన్సెలింగ్‌లో బదిలీ అయి రిలీవ్ కాని టీచర్లు సుమారు జిల్లాలో 400 మంది ఉన్నారు. ఒకవేళ వీళ్లే సర్‌ప్లస్‌గా తేలితే అధికారులు చెప్పిన చోటుకు వెళ్లకపోవచ్చనే వాదన వినిపిస్తోంది. సరైన గైడ్‌లైన్స్ లేకపోతే సర్దుబాటు కార్యక్రమం విజయవంతంగా జరగదని ఉపాధ్యాయ సంఘాల నేతలు అంటున్నారు. కుప్పంలోనే అధికంగా ఖాళీలు జిల్లాలో అత్యధికంగా కుప్పం నియోజకవర్గంలోనే ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి. మొత్తం 572 ఖాళీలు ఉండగా, గుడుపల్లెలో-99, కుప్పంలో-167, రామకుప్పంలో-175, శాంతిపురంలో-131 ఉన్నాయి. సర్దుబాటు జరిగే ఉపాధ్యాయులు ఎక్కువ మంది ఇక్కడికే రావాల్సి ఉంది. అయితే కుప్పం నియోజకవర్గంలో పని చేసేందుకు ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఇష్టపడరని తెలుస్తోంది. అప్పుడే ప్రయత్నాలు మొదలు సర్దుబాటు కాకుండా ఉండేందుకు ఉపాధ్యాయులు అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అధికార పార్టీ నేతలు, కీలకంగా ఉండే ఉపాధ్యాయ సంఘ నేతల ద్వారా ఎంఈవోలపై, విద్యాశాఖ సిబ్బందిపై సర్దుబాటు అయ్యేందుకు అవకాశం ఉన్న ఉపాధ్యాయులు ఒత్తిళ్లు తెప్పిస్తున్నట్టు తెలిసింది. ఇదే అదనుగా భావించి కొందరు ఎంఈవోలు విద్యార్థుల సంఖ్య మార్చి చెప్పి పోస్టు సర్దుబాటు కాకుండా చూస్తామని, తాము కోరుకున్న చోటుకు వెళ్లాలని భావించే టీచర్లను పంపుతామని హామీలు ఇస్తున్నారు. ఈ వ్యవహారంలో భారీగా డబ్బులు ముట్టే అవకాశం ఉంది. మొత్తంగా ఈ కార్యక్రమం కొంత మందికి తలనొప్పులు తీసుకురాగా, మరికొంత మందికి కాసులు కురిపించేదిగా మారింది. తాత్కాలిక సర్దుబాటు సరికాదు ఉపాధ్యాయులను తాత్కాలికంగా సర్దుబాటు చేయడం సరికాదు. అదీ ఎటువంటి గైడ్‌లైన్స్ ఇవ్వకుండా చెప్పడంతో క్షేత్రస్థాయిలో చాలా సమస్యలు వస్తాయి. కొంతమంది టీచర్లు వెళ్తామంటారు, కొందరు వెళ్లమంటారు. ఈ సమయంలో ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, కొన్ని రోజుల తర్వాత అయినా రేషనలైజేషన్, సాధారణ బదిలీలు చేపడితే బాగుంటుంది. -వి.రెడ్డిశేఖర్‌రెడ్డి, వైఎస్సార్ టీఎఫ్ రాష్ట్ర స్ట్రీరింగ్ కమిటీ సభ్యులు డీఎస్సీ నిర్వహిస్తే సమస్య తీరుతుంది ఉపాధ్యాయుల కొరత తీరాలంటే డీఎస్సీ నిర్వహించాలి. ఇలా తాత్కాలికంగా సర్దుబాటు చేయడం వల్ల సమస్య పూర్తిగా పరిష్కారం కాదు. గత సంవత్సరం మెగా డీఎస్సీ నిర్వహిస్తారని నిరుద్యోగులు ఆశపడ్డారు. అయితే అలా ఏం జరగలేదు. త్వరలో అయినా డీఎస్సీ జరిపి టీచర్ పోస్టుల ఖాళీలు భర్తీ చేస్తే బాగుంటుంది. -చెంగల్రాయమందడి, ఏపీటీఎఫ్ (1938) జిల్లా అధ్యక్షులు