breaking news
district additional judge
-
ఇక పోస్టాఫీసుల్లో న్యాయసేవల సమాచారం..
సాక్షి,విశాఖపట్నం : జాతీయ న్యాయ సేవాధికార సంస్థ సూచనల మేరకు పోస్టాఫీసుల్లో న్యాయసేవలకు సంబంధించి ప్రజలకు సమాచారాన్ని అందించేలా బోర్డులు ఏర్పాటు చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ అవదానం హరిహరనాథ శర్మ అన్నారు. శుక్రవారం జిల్లాలోని పోస్టల్ సూపరింటెండెంట్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయ సహాయం కోసం దరఖాస్తులను ఉచితంగా ప్రజలకు అందుబాటులో ఉంచడంతో పాటు పోస్ట్మ్యాన్లకు న్యాయ సహాయం కోసం అవగాహన కల్పించడానికి శిక్షణ కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం సీనియర్ పోస్టల్ సూపరింటెండెంట్ ఎన్.సోమశేఖరరావు, అనకాపల్లి డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కేకేవీ బులికృష్ణ పాల్గొన్నారు. చదవండి: Andhra Pradesh: ఉపాధితో అభివృద్ధి -
జడ్జి 'తలాక్' అన్నారని.. సీజేఐకి ఫిర్యాదు
తనను రెండోపెళ్లి చేసుకున్న జడ్జిగారు 'తలాక్.. తలాక్.. తలాక్' అన్నాడని కోపం వచ్చి ఆయన భార్య.. దీని గురించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేసింది. అలీగఢ్ అదనపు జిల్లా జడ్జి మహ్మద్ జహీరుద్దీన్ సిద్దిఖీ (59)కి ఎందుకోగానీ తన భార్య అఫ్షాఖాన్ మీద కోపం వచ్చింది. అంతే తలాక్.. అంటూ విడాకులు ఇచ్చేశానన్నాడు. అందరికీ న్యాయం చెప్పాల్సిన స్థానంలో ఉన్న తన భర్త.. సొంత భార్యకే అన్యాయం చేశాడంటూ ఆమె సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసింది. జడ్జి, ఆయన కుటుంబ సభ్యులు తనను చిత్రహింసలు పెట్టారని, వాళ్లను జైల్లో పెట్టి సమాజానికి మంచి సందేశం పంపాలని కోరింది. తమ మధ్య రాజీక కుదరలేదని, అందుకే షరియా చట్టం ప్రకారం ఆమెకు విడాకులు ఇచ్చానని జడ్జి సిద్దిఖీ చెప్పారు. 2015 ఏప్రిల్ 16న అలీగఢ్‌లోని ఓ హోటల్లో అష్ఫా, సిద్దిఖీల పెళ్లి జరిగింది. దానికి ఆయన మొదటి భార్య కొడుకులతో సహా బంధువులందరూ హాజరయ్యారు. అయితే ఆ తర్వాతి నుంచి తనను విపరీతంగా బెదిరించారని ఆమె చెప్పింది. తాను సామాన్యుడిని కానని, పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే తనతో పాటు తన సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు కూడా తర్వాతి పరిణామాలను ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలని బెదిరించారని తెలిపింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్‌తో పాటు, అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మతీన్ అహ్మద్‌కు, లక్నోబెంచికి, అలీగఢ్ జిల్లా జడ్జికి కూడా ఆమె ఫిర్యాదు చేసింది.