breaking news
discontinuing
-
రిజిస్టర్డ్ పోస్ట్ ఇక కనుమరుగు
న్యూఢిల్లీ: కోట్లాది మందికి చిరపరిచితమైన పోస్టల్‌శాఖ వారి ‘రిజిస్టర్డ్ పోస్ట్’ ఇక కనుమరుగు కానుంది. దేశవ్యాప్తంగా గత 50 సంవత్సరా లుగా కీలకమైన సర్టిఫికేట్లు, ఉద్యోగ నియామక పత్రాలు, లీగల్ నోటీసులు, ప్రభుత్వ ఉత్తర్వులను రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా ప్రజలకు చేరవేసిన పోస్టల్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ‘రిజిస్టర్డ్ పోస్ట్’ సేవలను కొనసాగించబోమని ‘ది ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్’ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా ఇన్నాళ్లూ అందించిన సేవలనే స్పీడ్‌పోస్ట్ లేదంటే ఇతర సేవల్లో భాగంగా అందించనున్నట్లు తెలుస్తోంది. కేవలం ఆ పేరు మాత్రమే ఇకపై వినియోగించబోరని పోస్టల్‌శాఖ వర్గాలు తెలిపాయి. తక్కువ ఖర్చులో, అత్యంత విశ్వసనీ యమైన, అత్యంత అనువైన తపాలా సేవగా గత యాభై ఏళ్లుగా రిజిస్టర్డ్ పోస్ట్ జనం మదిలో నిలిచిపోయింది. అప్పట్లో ప్రభుత్వ ఉద్యోగ అపాయింట్మెంట్ లెటర్ వచ్చిందంటే అది దాదాపు రిజిస్టర్డ్ పోస్ట్‌లో రావాల్సిందే. ఉత్తరప్రత్యుత్తరాల కాలంలో రిజిస్టర్డ్ పోస్ట్‌కు ఎనలేని విలువ ఉండేది. 2011–12 కాలంలో దేశవ్యాప్తంగా 24.44 కోట్ల రిజిస్టర్డ్ పోస్ట్‌లను తపాలా శాఖ పంపించగా 2019–20 కాలానికి వచ్చేసరికి కేవలం 18.46 కోట్ల రిజిస్టర్డ్ పోస్ట్‌లే పంపించగల్గింది. అంటే ఏకంగా 25 శాతం రిజిస్టర్డ్ పోస్ట్‌లు తగ్గిపోయాయి. వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లోనూ కీలకమైన పీడీఎఫ్, ఇతర ఫైళ్లు, పత్రాలను పౌరులు నేరుగా సెకన్ల వ్యవధిలో పంపే సంస్కృతి పెరగడంతో రిజిస్టర్డ్ పోస్ట్‌కు ఆదరణ తగ్గిపోయిందని తెలుస్తోంది. -
ఆ స్మార్ట్ఫోన్లు ఇకపై కనిపించవు...!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ తన ప్రత్యర్థి ఆపిల్‌కు పోటీగా పిక్సెల్ స్మార్ట్ఫోన్లను కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. తాజాగా పిక్సెల్ 5ఏ 5జీ స్మార్ట్ఫోన్లను గూగుల్ మార్కెట్లలోకి రిలీజ్ చేసింది. కాగా గూగుల్ ఇకపై మార్కెట్లలోకి పిక్సెల్ 4ఏ 5జీ, పిక్సెల్ 5 స్మార్ట్ఫోన్ల ఉత్పత్తి నిలిపివేయనున్నట్లు సమాచారం. గూగుల్ పిక్సెల్ 6 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తోనందుకు గాను పిక్సెల్ 4ఏ 5జీ, పిక్సెల్5 స్మార్ట్ఫోన్లను నిలిపివేయనుందని తెలుస్తోంది. చదవండి: Gautam Adani : గౌతమ్ అదానీకి భారీ షాక్..! పిక్సెల్ 4ఏ 5జీ, పిక్సెల్ 5 స్మార్ట్‌ఫోన్స్ గూగుల్ ఆన్లైన్ స్టోర్‌లో సోల్డ్ ఔట్ అనే మెసేజ్‌ను యూజర్లకు చూపిస్తోందని ప్రముఖ టెక్ ఎక్స్పర్ట్ న్యూస్ వెబ్సైట్ ది వెర్జ్ పేర్కొంది. పిక్సెల్ 4, పిక్సెల్ 4ఎక్స్ఎల్ను ప్రవేశపెట్టిన సంవత్సరంలోపే ఈ స్మార్ట్ఫోన్లను గూగుల్ నిలిపివేయనుంది. ప్రస్తుతం రిలీజ్ చేసిన గూగుల్ పిక్సెల్ 5ఏ 5జీ ను కేవలం అమెరికా, జపాన్ మార్కెట్లలోకే రిలీజ్ చేసింది. భారత మార్కెట్లలోకి ఎప్పుడూ వస్తూందనే విషయం గూగుల్ ఇప్పటివరకు వెల్లడించలేదు.గూగుల్ తన రాబోయే ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌లైన పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రో స్మార్ట్ఫోన్లకు ఛార్జర్ లేకుండా మార్కెట్లలోకి రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. (చదవండి: Elon Musk-Jeff Bezos: ఎలన్ మస్క్‌కు పెద్ద దెబ్బే కొట్టిన జెఫ్‌బెజోస్...!) -
ఇక ఆ ఫోన్లకు వాట్సాప్ పనిచేయదట..!
ఫేస్ బుక్ కు చెందిన పాపులర్ మెసేజింగ్ సర్వీసు వాట్సాప్, ఇక సింబియాన్ ఫోన్లకు పనిచేయదట. డిసెంబర్ 31 నుంచి ఈ సర్వీసును సింబియాన్ ఫోన్లకు ఆపివేయబోతున్నట్టు వాట్సాప్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సింబియాన్ ఫోన్ యూజర్లకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్లు వాట్సాప్ నుంచి అందాయి. "దురదృష్టవశాత్తు, 31/12/2016 నుంచి మీ ఫోన్లకు వాట్సాప్ పనిచేయదు. ఎందుకంటే మీ ఫోన్లకు ఈ యాప్ సపోర్టు చేయకపోతుండటంతో సర్వీసులను ఆపివేస్తున్నాం" అని వాట్సాప్ నుంచి యూజర్లు నోటిఫికేషన్లు పొందారు. వాట్సాప్ ఈ విషయాన్ని తన అధికారిక బ్లాగ్ పోస్టులో కూడా పొందుపర్చింది. అన్ని బ్లాక్ బెర్రీ ఓఎస్ వెర్షన్లకి(బ్లాక్ బెర్రీ10కి కూడా), నోకియాస్ సింబియాన్ ఎస్40, సింబియాన్ ఎస్60 వెర్షన్, 2.1 ఎక్లైర్, 2.2 ఫ్రోయో, విండోస్ ఫోన్ 7.1 టోటింగ్ డివైజ్ లకు ఈ ఏడాది చివరి నుంచి వాట్సాప్ సర్వీసులు ఆపివేస్తున్నారు. 2009లో వాట్సాప్ ను ఆవిష్కరించిన సమయంలో, బ్లాక్ బెర్రీ, సింబియాన్ ఆపరేటింగ్ సిస్టమ్ లే వాట్సాప్ వృద్ధికి సహకరించాయి. ఆ సమయంలో కేవలం 25 శాతమే ఆండ్రాయిడ్, ఐఓఎస్ వెర్షన్ డివైజ్ లు వాట్సాప్ వృద్ధికి తోడ్పడ్డాయి. బ్లాక్ బెర్రీ, సింబియాన్ ఫోన్లకు వాట్సాప్ పనిచేయదని ఆ కంపెనీ ప్రకటించిన కొన్ని రోజులకే, బ్లాక్ బెర్రీ 10 డివైజ్ లకు మార్చి 31 నుంచి ఫేస్ బుక్ సపోర్టును ఆపివేస్తున్నామని ఫేస్ బుక్ కంపెనీ కూడా ప్రకటించింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ డివైజ్ విఫలమవుతుండటంలో ఈ సర్వీసును నిలిపివేయనున్నట్టు కంపెనీలు పేర్కొంటున్నాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ లు ప్రతి ఏడాది కొత్త వెర్షన్ లతో స్మార్ట్ ఫోన్లను తయారుచేసి, మార్కెట్లోకి ఆవిష్కరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే బ్లాక్ బెర్రీ, ఆండ్రాయిడ్ ఫోన్ల తయారీకి పూనుకోగా.. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్స్ తయారీదారు ఫిన్ లాండ్ ఆధారిత హెచ్ ఎమ్డీ కంపెనీతో కలిసి నోకియా పనిచేయడం ప్రారంభించింది.