breaking news
Directors Hunt
-
ఐడియా నంబర్ 2 : జ్యూరీమెంబర్-మదన్
-
ఐడియా నంబర్ 1: జ్యూరీమెంబర్- సునీల్‌కుమార్‌రెడ్డి
-
పూరి జగన్నాథ్ డైరెక్టర్స్ హంట్
లాస్ట్ డేట్ 14 ఫిబ్రవరి 2015 సాక్షి ‘ఫ్యామిలీ’లో జనవరి 2 నుంచి 11 వరకు మొత్తం 10 స్టోరీ ఐడియాలు చెప్పారు పూరి జగన్నాథ్. వాటిల్లో మీకు నచ్చిన కథకు మీరే స్క్రిప్ట్ రెడీ చేసి చక్కగా డైలాగులు రాసుకుని 10 నిమిషాల లోపు నిడివితో ఒక షార్ట్ ఫిల్మ్ తీయండి. ఆ ఫిల్మ్‌ని directorsakshi @gmail.comకి పంపించండి. ఇందుకు సంబంధించిన మిగతా వివరాలు కూడా మీకు పై సంచికలలోనే లభ్యం అవుతాయి. -
పూరి Idea-4
ఇప్పటికి మీకు మూడు కథలు చెప్పాను. ఈరోజు మాత్రం కథ చెప్పడంలేదు. ఓ ఐడియా చెబుతాను. ఇది 2015 సంవత్సరం కదా! నెక్ట్స్ ఇయర్ ఏం జరుగుతుందో ఓసారి ఊహించండి. కొంచెం కష్టమే అయినా, చాలా థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది కదూ! అలా... పాతికేళ్ల తర్వాత అంటే 2040లో ఎలా ఉంటుందో ఊహించండి. 2040కి రోడ్లు ఎలా మారాయి... టెక్నాలజీ ఎంతలా డెవలప్ అయింది... జనాలు ఏం చేస్తుంటారు.. లాంటివేమీ చూపించనవసరం లేదు. 2040లో ఓ ఇంట్లో కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. వాళ్లు ఎలా మాట్లాడుకుంటారో నాకు కావాలి. ఎలా బిహేవ్ చేస్తారో నాకు కావాలి. ఈ వ్యవస్థలో ఎలాంటి మార్పులొచ్చాయి... పెళ్లిళ్లలో ఏవేం మార్పులొచ్చాయి... విధానాల్లో ఎటువంటి తేడాలొచ్చాయి. కొత్త దేవుళ్లు ఎవరైనా పుట్టుకొచ్చారా...! పాత దేవుళ్లలో ఎవరైనా తగ్గిపోయారా...! ఇవన్నీ డిస్కస్ చేసినా ఓకే.అయితే నాకు ప్రధానంగా కావలసింది... 2040లో మనుషులు ఎలా ఉంటారన్నదే! వాళ్ల కేరెక్టర్స్... వాళ్ల బిహేవియర్స్... వాళ్ల కాన్వర్జేషన్స్తో చక్కగా మీరు షార్ట్ ఫిల్మ్ తీస్తే... నేను చూస్తా! ప్రెజెంటేషన్: పులగం చిన్నారాయణ పూరి జగన్నాథ్ డైరెక్టర్స్ హంట్ స్టోరీ: పూరి డెరైక్షన్: మీరే!! ఈ పది రోజుల్లో... నేను చెప్పే పది ఐడియాల్లో ఏ ఐడియా నచ్చినా దాంతో మీరు ఓ షార్ట్ ఫిల్మ్ తీసేయండి. మొత్తం 10 ఐడియాలూ తీస్తానన్నా మాకు ఓకే! నెల రోజులు టైం ఇస్తున్నాం. ఫిబ్రవరి 14 వేలంటైన్స్‌డే మీ ఎంట్రీలకు లాస్ట్ డే. మీరు తీసిన షార్ట్ ఫిల్మ్‌ని directorsakshi@gmail.com కి పంపించండి. ఒక్కో కథకు ఒక్కో డైరెక్టర్ని ఎంపిక చేస్తాం. అంటే పది కథలకూ పదిమంది దర్శకులు. వీళ్లందరికీ తగిన బహుమతులు ఇస్తాం. వాళ్లు తీసిన షార్ట్ ఫిల్మ్స్ ‘సాక్షి’ ఛానల్లో ప్రసారం చేస్తాం. యూ ట్యూబ్‌లో పెడతాం. దీంతో మీకు ఎక్స్‌పీరియెన్స్ వస్తుంది. ఎక్స్పోజర్ వస్తుంది. సినిమా ఇండస్ట్రీ నుంచి అవకాశాలూ రావొచ్చు. 10 డేస్...10 స్టోరీ ఐడియాస్ 10 మినిట్స్... నిన్న మూడో కథ చెప్పా. ఇవాళ నాలుగోది. ఇలా మొత్తం పది కథలు చెప్తా. వీటిల్లో మీకు నచ్చిన కథకు మీరు స్క్రిప్ట్ రెడీ చేసి చక్కగా డైలాగులు రాసుకుని 10 నిమిషాల లోపు నిడివితో ఒక షార్ట్ ఫిల్మ్ తీయండి. మీ ఇష్టం... ఏ డిజిటల్ కెమెరాతోనైనా తీయొచ్చు. ఏమీ లేకపోతే ఐ ఫోన్తోనైనా తీయొచ్చు. యాక్టర్స్ అంటారా? మీ ఇంట్లో, మీ చుట్టుపక్కల బోలెడంత మంది యాక్టర్స్ ఉన్నారు. వాళ్లతోనే షూట్ చేయండి. ఏమో..! మీలో ఎవరైనా నాకు నచ్చితే ... నా బేనర్లో నేనే డైరెక్షన్ ఛాన్స్ ఇస్తానేమో! అయితే కొన్ని కండిషన్స్... చాలా తక్కువ ఖర్చుతో ఈ షార్ట్ ఫిల్మ్ తీయాలి. అనవసరంగా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టకూడదు ఈ షార్ట్ ఫిల్మ్ పేరు చెప్పి మీ ఇంట్లో వాళ్లను డబ్బుల కోసం వేధించకూడదు. అసలు మీ సొంత డబ్బు వాడకూడదు. ఎవరో ఒకర్ని కన్విన్స్ చేసి ఈ షార్ట్ ఫిల్మ్ తీయాలి. పది నిమిషాల షార్ట్ ఫిల్మ్ కోసమే ఒకరిని కన్విన్స్ చేయలేనివాళ్లు జీవితంలో డైరెక్టర్ కాలేరు. రేపు సినిమా తీయడానికి ఏ నిర్మాతను ఒప్పించగలరు? అర్థమైందిగా.. లాస్ట్ అండ్ ఫైనల్... మీరు తీయబోయే షార్ట్ ఫిల్మ్ ఎలా ఉండాలంటే, అది మీ జీవితాన్ని మార్చేసేలా ఉండాలి. గమనిక: నా జీవితం కూడా ఇలా షార్ట్ ఫిల్మ్‌లతోనే మొదలైంది. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. - పూరి జగన్నాథ్ బహుమతులు అందించేవారు..