breaking news
Diabetic sandals
-
Life Style: మీకు తరచూ కాళ్ల వాపు వస్తుందా.. ఐతే ఈ చిక్కులు తప్పవు!!
మనం ధరించే దుస్తుల నుంచి చెప్పుల వరకు అన్నీ సరైన కొలతలలో ఉండకపోతే చూడ్డానికి ఎబ్బెట్టుగానే కాదు... అసౌకర్యంగా కూడా అనిపిస్తుంది. దుస్తులు మాత్రం ఇంచుమించు అందరూ సరయిన కొలతల్లోనే ఉండేలా చూసుకుంటారు కానీ, చెప్పుల విషయంలో అంతగా పట్టించుకోరు. నిజానికి దుస్తులకు ఎంత ప్రాధాన్యత ఇస్తామో, పాదరక్షలకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్లినప్పటి నుంచి తిరిగి ఇంటికి వచ్చేవరకు మన పాదాలను అంటిపెట్టుకుని ఉండి, జాగ్రత్తగా కాపాడేది పాదరక్షలే కాబట్టి ఎలాంటి పాదరక్షలను, ఎప్పుడు ఎంచుకోవాలి అనే విషయాలపై అవగాహన కోసం... చెప్పుల విషయంలో అలక్ష్యంగా వ్యవహరిస్తే చిక్కులు తప్పవు. ముఖ్యంగా పాదరక్షలు కొనేటప్పుడు సౌకర్యంగా ఉండేలా చూసుకోవడమే కాదు, సరైన సైజును ఎంచుకోవాలి. ముఖ్యంగా ఆర్థోపెడిక్, డయాబెటిస్ రోగులు, వివిధ రకాల శస్త్ర చికిత్సలు చేయించుకున్న వాళ్లు సరైన పాదరక్షలను ఎంచుకోకపోతే ఇబ్బందులే. చదవండి: Wonder of Science: బాప్రే.. ఒక్క చెట్టుకే 40 రకాల పండ్లా..!! చిన్నసైజు వద్దు... పాదం పరిమాణం కంటే చిన్నగానూ, బిగుతుగానూ ఉండే చెప్పులు ధరిస్తే అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లే. సరైన చెప్పులు వేసుకోకపోతే పాదాలకు పగుళ్లు, ఇన్ఫెక్షన్లూ తప్పవు. బిగుతైన బూట్లు ధరించడం వల్ల గోళ్ల పెరుగుదల నిలిచిపోవడమే కాక గోటి చివర్లు వేళ్లలోనికి గుచ్చుకుని ఇన్ఫెక్షన్ల బారిన పడాల్సి వస్తుంది. షుగర్ రోగులకు ఇలాంటివి తీవ్రం గా మారే ప్రమాదం ఉంది. అలాగని పెద్ద సైజు చెప్పులు, బూట్లు వేసుకోవడమూ ఏమంత మంచిది కాదు. మడమల సమస్యలు ఎదురవుతాయి. వీటిమూలంగా కాళ్లు బెణకడం, నడకలో తేడా రావడం తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చెప్పుల షాపింగ్‌కి మధ్యాహ్నాలు లేదా సాయంత్రాలే ఉత్తమం గుండె సంబంధిత వ్యాధులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, బీపీ, డయాబెటిస్ వంటి లైఫ్‌స్టైల్ సంబంధిత రోగులకు సహజంగానే కాళ్ల వాపులుంటాయి. అలాగే ఎక్కువసేపు కుర్చీలో కూర్చొని పనిచేసే వాళ్లకు సైతం పాదాల వాపు సర్వసాధారణం. ఎందుకంటే ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కండరాలల్లో కదలికలు నిలిచిపోయి పాదాలలో వాపు వస్తుంది. ఇది ఎక్కువగా మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల సమయంలో వాపు ఉంటుంది. ఈ సమయంలో చెప్పులు కొనుగోలు చేస్తే సాధారణ సైజు కంటే కొంచెం పెద్దవి తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పులు కొనడానికి మధ్యాహ్నం లేదా సాయంత్రాలే మంచిది. సరైన సైజ్ చెప్పులు, బూట్లు వేసుకోవడం వల్ల సౌకర్యంగా ఉండటంతోపాటు పాదాలు కూడా పదిలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. చదవండి: రెస్టారెంట్ విచిత్ర షరతు.. ఫైర్ అవుతున్న నెటిజన్లు! ఒక కాలితో ట్రయల్ వద్దే వద్దు... పాదరక్షలు కొనుగోలు చేసేటప్పుడు ఒక కాలికి మాత్రమే ట్రయల్ వేసి సరిపోయిందని సంతృప్తి పడవద్దు. రెండు కాళ్లకూ వేసుకుని నాలుగడుగులు అటూ ఇటూ నడిచి, అవి సౌకర్యంగా అనిపిస్తేనే కొనుగోలు చేయాలి. అదేవిధంగా బూట్లు కొనేటప్పుడు సాక్స్ తొడుక్కోకుండా ట్రయల్ చేయడం సరి కాదు. బూట్లకు ముందు కనీసం అర అంగుళం ఖాళీగా ఉండేలా చూసుకోవాలి. లేకుంటే కాలిగోర్ల పెరుగుదల నిలిచిపోవడం, తద్ద్వారా ఇన్ఫెక్షన్ల సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. అదే విధంగా పాదరక్షలు ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవడం కూడా ఎంతో అవసరం. ఒక్కోసారి చెప్పుల నుంచి వాటిని తయారు చేసిన మెటీరియల్ మూలాన ఘాటైన వాసనలు వస్తుంటాయి. మంచి నాణ్యత గల చెప్పులు ఈ ఘాటైన వాసనను విడుదల చేయవు, చెప్పుల వాసన ఘాటుగా ఉంటే, మైకం, కళ్లు తిరగడం, కడుపులో తిప్పడం వంటి అసౌకర్యాలు కలుగుతాయి. రంగు కూడా ముఖ్యమే! చెప్పుల రంగు మామూలుగా ఉందో లేదో గమనించండి. సాధారణంగా మంచి నాణ్యత గల చెప్పుల రంగు ముదురుగా ఉండదు. అదే చవక రకం చెప్పుల రంగు చాలా బ్రైట్‌గా ఉంటుంది, ఈ రంగులలో ఎక్కువగా కాడ్మియం, సీసం, ఇతర హెవీ మెటల్ అంశాలు ఉంటాయి, ఇది పిల్లల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది కాబట్టి లేత రంగులే మంచిది. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలు పెద్ద చెప్పులు వేసుకుంటే బ్యాలన్స్ చేసుకోలేక పడిపోతారని, మెత్తటి చెప్పులయితే నడక సరిగా ఉండదనే అపోహతో బిగుతుగా ఉండే గట్టి చెప్పులు కొంటారు. నిజానికి, బిగుతైన చెప్పులు ధరించిన పిల్లలు పాదాల, కాలి వేళ్ల పెరుగుదలకు ఆటంకం కలిగించినట్లే. స్లిప్పర్ లోపల ఉన్న పొడవు పిల్లల పాదం కంటే కనీసం ఒక సెం.మీ అయినా ఎక్కువుండాలని నిపుణుల సలహా. బరువైన చెప్పులు వద్దు... మీరు కొనాలనుకుంటున్న చెప్పులను ఒకసారి చేతితో పట్టుకుని చూడండి. బరువు తక్కువగా ఉండి, చేతుల్లో భారమైన అనుభూతి లేనట్లయితే, అది కొత్త మెటీరియల్‌తో తయారయిందని చెప్పవచ్చు. బరువుగా అనిపిస్తే వాటిని కొనుగోలు చేయవద్దు. చివరగా ఒక మాట... చెప్పులే కదా అని తేలిగ్గా తీసేయద్దు. వీటి గురించి చెప్పుకోవాలంటే ఇంకా బోలెడన్ని సంగతులున్నాయి. చదవండి: 150 ఏళ్లు పట్టేదట! కానీ.. కేవలం 18 ఏళ్లలోనే.. !! -
ఓల్డ్ ఏజ్ గోల్డ్!
♦ వృద్ధులకు ప్రత్యేకం... ఓల్డ్ఈజ్గోల్డ్స్టోర్ ♦ టాయిలెట్ రెయిజర్ల నుంచి వీల్ చెయిర్ల వరకూ అన్నీ ఆన్లైన్లోనే ♦ ఈ ఏడాది చివరి నాటికి బెంగళూరు, హైదరాబాద్‌లో స్టోర్లు ♦ రూ.35-40 కోట్ల నిధుల సమీకరణపై దృష్టి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ‘అమ్మా నాకిది కావాలి’ అని అడగడం ఆలస్యం.. క్షణాల్లో అమరిపోతుంది!‘నాన్నా ఇంటికొచ్చేటప్పుడు ఫలానా వస్తువు తీసుకురా’ అని చెబితే చాలు.. రాత్రికల్లా ఆ వస్తువు ఇంట్లో ఉండి తీరుతుంది!! అదండీ... ఇప్పటి పిల్లల పవర్. కాకపోతే పిల్లలు అడిగిందే ఆలస్యం అన్నీ కొనిచ్చేసే తల్లిదండ్రులకు... తీరా వాళ్లు వేరొకరిపై ఆధారపడే పరిస్థితి వచ్చేసరికి అన్నీ సమస్యలే. చదువనో, కొలువనో పిల్లలు విదేశాల్లో స్థిరపడటం... ఆఫీసు పనుల్లో బిజీగా ఉండటం... కారణాలేవైనా పెద్దవాళ్లకి ఏదైనా కావాల్సొస్తే మాత్రం ఎప్పుడూ ఇబ్బందే. దీనికి తోడు ఆరోగ్య సమస్యలెదురైతే ఆ బాధ మరీను!! అందుకే బ్యాక్ సపోర్ట్‌లు, టాయిలెట్ రెయిజర్లు, పడక కుర్చీలూ, డయాబెటిక్ శాండల్స్ అంటూ వృద్ధుల జీవన శైలిని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు మార్కెట్లోకి బోలెడన్ని వస్తువులొచ్చాయి. మరి వాటిని కొనుగోలు చేయడమెలా!! ప్రతిదానికీ పిల్లలను అడగలేరూ, అలాగని వెళ్లి తెచ్చికోనూ లేరు! ఇలాంటి సమస్య నుంచే పుట్టింకొచ్చిందే ‘ఓల్డ్‌ఈజ్‌గోల్డ్ స్టోర్’. ఎవరి సహాయం అవసరం లేకుండా, ఒక్కో దుకాణం వెతుక్కుంటూ తిరక్కుండా వృద్ధులకు అవసరమైన అన్ని వస్తువులనూ ఒక్క చోటే అందించడమే ఓల్డ్‌ఈజ్‌గోల్డ్ స్టోర్ ప్రత్యేకత. మరిన్ని వివరాలు సంస్థ వ్యవస్థాపకుడు పృథ్వీరాజ్ మాటల్లోనే... లాభాలతో పాటు ఇతరులకు సహాయపడేలా ఉండే చాలా వ్యాపారాలు... ఏదో ఒక సమస్య నుంచి పుట్టినవే. ఓల్డ్‌ఈజ్‌గోల్డ్ ప్రయాణమూ అలాంటిదే. పదేళ్ల క్రితం మా అమ్మకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో మంచానికే పరిమితమైంది. తప్పనిసరి పరిస్థితుల్లో అమెరికాలోని సొంత సాఫ్ట్వేర్ కంపెనీని వదిలేసి ఇండియాకు వచ్చేశా. అమ్మ ఆరోగ్య బాగోగులు చూస్తున్న సమయంలో ప్రతిసారీ ఎవరిపైనా ఆధారపడకుండా, ప్రతి చిన్న విషయానికి ఎవరినీ పిలవాల్సిన అవసరం లేకుండా కొన్ని పనులైనా సొంతంగా చేసుకునేలా వృద్ధులకు సౌకర్యవంతంగా ఉండే వస్తువులను కొనాలనుకున్నా. కానీ, అప్పుడొక ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. ఎక్కడికెళ్లినా పెద్దవాళ్లకు అవసరమయ్యే వస్తువులంటే షుగర్‌ని కొలిచే పరికరాలో, వీల్ చెయిర్ల వంటివో కనిపించేవి. కానీ, విదేశాల్లో మాదిరిగా ఆధునిక సాకేంతిక పరిజ్ఞానంతో పనిచేసే చాలా వస్తువులు ఇండియాలో దొరకట్లేదని!! మా అమ్మ లాంటి వాళ్లందరి అవసరాలు తీర్చాలంటే ఆన్లైనే సరైన వేదికని నిర్ణయించుకున్నా. నా భార్యతో పాటు మరో స్నేహితుడితో కలిసి సీనియర్ సిటిజన్లకు కావాల్సిన అన్ని పరికరాలను విక్రయించేందుకు 2012లో ఓల్డ్ఈజ్గోల్డ్స్టోర్ను ప్రారంభించా. టాయిలెట్ రెయిజర్ల నుంచి వీల్ చెయిర్ల వరకూ.. మందులతో వెంటనే నయంకాని ఆర్థరైటిస్, స్పాండిలైటిస్, డయాబెటిస్ లాంటి రకరకాల సమస్యల నుంచి ఉపశమనాన్నిచ్చే పరికరాలు చాలానే ఉన్నాయి. డయాబెటి క్ శాండిల్స్, యాంటీ స్లిప్పరీ మ్యాట్స్, టాయ్‌లెట్ రెయిజర్లు, భూతద్ధం అమర్చిన నెయిల్ క్లిప్లర్లూ, బ్యాక్ సపోర్ట్, పడక కుర్చీలు, సీనియర్ ఫ్రెండ్లీ సెల్ఫోన్లూ, షేవర్లూ, బ్యాగుల వంటి సుమారు 200కు పైగా వస్తువులు అందుబాటులో ఉన్నాయి. రూ.30 నుంచి 30 వేల వరకు ధరలుండే వస్తువులున్నాయిందులో. రూ.35-40 కోట్ల నిధుల సమీకరణ.. ఓల్డ్ఈజ్గోల్డ్లోని చాలా వరకు ఉత్పత్తులు చైనా, తైవాన్, మలేషియా వంటి దేశాల నుంచి దిగుమతి అవుతుంటాయి. మొత్తం ఉత్పత్తుల్లో 90 శాతం దిగుమతివే. ఎక్కువ డిమాండున్న వస్తువులను దిగుమతి చేసుకుంటే ధర ఎక్కువవుతుంది. అందుకే వాటిని మేమే సొంతగా తయారు చేయడం మొదలుపెట్టాం. దీంతో ధర కూడా తగ్గుతుంది. కొత్త ఉత్పత్తుల తయారీ, స్టోర్ల విస్తరణ నిమిత్తం రూ.35-40 కోట్ల నిధులను సమీకరిస్తున్నాం. ఈ ఏడాది ముగింపు నాటికి డీల్‌ను క్లోజ్ చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తాం. బెంగళూరు, హైదరాబాద్‌లోనూ స్టోర్లు.. ప్రస్తుతం ఓల్డ్ఈజ్గోల్డ్కు చెన్నైలోని అన్నానగర్, అడయార్‌లో రెండు స్టోర్లున్నాయి. రెండేళ్లలో దేశంలోని అన్ని మెట్రో నగరాల్లోనూ విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. తొలిదశగా ఈ ఏడాది చివరి నాటికి బెంగళూరు, హైదరాబాద్‌లో స్టోర్లను ప్రారంభించనున్నాం. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఆఫీసు స్థలం ఎంపిక, మౌలిక వసతుల కల్పన వంటి వాటిని పూర్తి చేశాం. తమిళనాడులో అయితే ఆర్డరిచ్చిన రోజే డెలివరీ చేస్తాం. ఇతర నగరాలకైతే 2-3 రోజుల పడుతుంది. పట్టణ కస్టమర్లే ఎక్కువ.. ఓల్డ్‌ఈజ్‌గోల్డ్ కస్టమర్లలో పట్టణ ప్రాంతాలు, ఎన్నారైల వాటా ఎక్కువ. మొత్తం మార్కెట్లో బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల నుంచి వచ్చే ఆర్డర్ల వాటా 15 శాతం వరకుంటుంది. తల్లిదండ్రుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని విదేశాల నుంచి రకరకాల పరికరాలను ఆర్డరిచ్చే వాళ్లు కొందరైతే.. వాళ్ల పుట్టిన రోజు, ఇతర వేడుకల సమయంలో బహుమతులుగా కొన్ని పరికరాలు అందించే వాళ్లు ఇంకొందరు. తల్లిదండ్రులకు డబ్బులిచ్చి ప్రేమను చూపించలేకపోవచ్చు. కానీ, ప్రేమగా వాళ్లకు ఉపయోగపడే వస్తువులను కొనిచ్చి మీ బాధ్యత నాది అన్న భరోసానైతే ఇవ్వగలం కదా!. అందుకే మా మార్జిన్ల గురించి కాకుండా వాళ్లకు ఆ వస్తువులు ఎంతలా ఉపయోగపడతాయన్నదే లక్ష్యంగా పనిచేస్తున్నాం.