breaking news
Dhillukku Dhuttu
-
‘మళ్లీ కమెడియన్‌గా మారలేను’
మళ్లీ కమెడియన్‌గా మారడం జరగదు అంటున్నాడు కమెడియన్ నుంచి కథానాయకుడిగా మారిన నటుడు సంతానం. ఈయన హీరోగా నటించి నిర్మించిన తాజా చిత్రం దిల్లుక్కు దుడ్డు 2. ఇంతకుముందు సంతానం హీరోగా రాంబాలా దర్శకుడిగా పరిచయమై తెరకెక్కించిన చిత్రం దిల్లుక్కు దుడ్డు. ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడంతో దానికి సీక్వెల్‌గా అదే కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం దిల్లుక్కు దుడ్డు 2. మలయాళీ నటి శ్రితా శివదాస్ హీరోయిన్గా పరిచయం అవుతున్న ఈ సినిమాలో మొట్టరాజేంద్రన్, విజయ్ టీవీ.రామర్. బిపిన్, శివశంకర్‌మాస్టర్, మారిముత్తు, జయప్రకాశ్, ప్రశాంత్, విజయ్ టీవీ ధనశేఖర్, సీఎం.కార్తీక్, నటి ఊర్వశి ముఖ్య పాత్రల్లో నటించారు. షబ్బీర్ సంగీతాన్ని, దీపక్‌కుమార్ పది ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదలకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శనివారం ఉదయం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో విలేకరులు సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దిల్లుక్కు దుడ్డు చిత్రంలో చివరి 20 నిమిషాలకు ప్రేక్షకులు విరగబడి నవ్వుకున్నారన్నారు. అలా ఈ సీక్వెల్లో చిత్రమంతా ఉండాలని భావించామన్నారు. అదేవిధంగా తన చిత్ర టీమ్ కథను తయారు చేసిందని చెప్పారు. దిల్లుక్కు దుడ్డు చిత్రంలో కథకు ముస్లిం యువతి అవసరం కావడంతో బాలీవుడ్ నటిని హీరోయిన్గా ఎంపిక చేసుకున్నామని, ఈ చిత్రంలో మలయాళీ యువత కథకు అవసరం అవడంతో కేరళ నటి శ్రితాశివదాస్‌ను ఎంపిక చేసినట్లు చెప్పారు. హర్రర్, కామెడీ చిత్రంగా రూపొందిన ఈ చిత్రం బాగా వచ్చిందని తెలిపారు. నటుడిగా కంటే నిర్మాతగా చిత్రం చేయడం కష్టం అని అన్నారు. అదేవిధంగా ఏడాదికి ఒక చిత్రమే చేయాలని తాను అనుకోలేదని, ఇప్పటికే నటించిన మూడు చిత్రాలు విడుదల కావలసి ఉన్నాయని అన్నారు. హీరోగా అవకాశాలు లేకపోతే మళ్లీ కమెడియన్‌గా నటించే ఆలోచన లేదన్నారు. దర్శకత్వం చేస్తానని, అలా తన తొలి చిత్రాన్ని ఆర్య హీరోగా చేస్తానని అన్నారు. ఎలాంటి కథా చిత్రం చేసినా, అది మంచి చిత్రంగా ఉండాలన్నదే తన భావన అని చెప్పారు. ఇకపోతే ఆర్య పెళ్లి గురించి అడుగుతున్నారని, ఆ విషయాన్ని ఆయన్ని అడిగి చెబుతానని సంతానం అన్నారు. -
దిల్లుకు దుడ్డు దర్శకుడితో జీవీ
తమిళసినిమా; యువ సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్ కుమార్ హీరోగా నటించింది తక్కువ,నటిస్తున్నది, నటించనున్నది చాలా ఎక్కువ. ఈయన నటించి తెరపైకి వచ్చిన నాలుగు చిత్రాలు విశేష ప్రేక్షకాదరణ పొందడంతో అవకాశాలు వరుస కడుతున్నాయని చెప్పవచ్చు. తమిళ సినిమాలో ప్రామిసింగ్ హీరోగా మారిన జీవీ నటిస్తున్న బ్రూస్లీ, కడవుల్ ఇరుక్కాన్ కుమారు చిత్రాల నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. కాగా తాజాగా అడంగాదే చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇప్పుడు మరో నూతన చిత్రానికి జీవీ పచ్చజెండా ఊపారు. ఇంతకు ముందు సంతానంతో దిల్లుకు దుడ్డు చిత్రం చేసి సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు రామ్‌బాల జీవీ.ప్రకాశ్‌కుమార్ హీరోగా చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఈ హిట్ కాంబినేషన్లో నవ నిర్మాత స్టీఫెన్ తన స్టీవ్ కార్నర్ పతాకంపై చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీని గురించి ఆయన తెలుపుతూ లొల్లుసభ కార్యక్రమాన్ని చూసి తాను చాలా ఎంజాయ్ చేశానన్నారు. దర్శకుడు రామ్‌బాల టైమింగ్ కామెడీ, సెన్సాఫ్ హ్యూమర్‌తో కూడిన సంభాషణలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయన్నారు. ఆయన తెరకెక్కించిన దిల్లుకు దుడ్డు చిత్రం ఇందుకు ఒక నిదర్శనం అని అన్నారు. అలాంటి క్రేజీ కాంబినేషన్లో చిత్రం చేస్తుండడం సంతోషంగా ఉందన్నారు. కాగా ఈ చిత్రంలో ఒక ప్రముఖ నటుడు నటించనున్నట్లు తెలిపారు. ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందని తెలిపారు. చిత్ర షూటింగ్‌ను నవంబర్ రెండో వారంలో ప్రారంభించనున్నట్లు నిర్మాత స్టీఫెన్ వెల్లడించారు.