breaking news
dharalu
-
దళారీ వ్యవస్థకు దన్ను.. బాబే
సాక్షి, అమరావతి: రైతన్నలు పండించిన ప్రతి ధాన్యం గింజను ఆర్బీకే వ్యవస్థ ద్వారా గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రైతుల దగ్గర నుంచి ఆఖరి గింజ వరకు కొనటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దళారీ వ్యవస్థ లేకుండా రైతుల ఖాతాలకే నేరుగా డబ్బులు జమ చేస్తున్నామన్నారు. ధాన్యం కొనుగోళ్లలో దళారీ వ్యవస్థను ప్రోత్సహించింది చంద్రబాబేనన్నారు. ప్రజలకు మంచి చేస్తున్న సీఎం జగన్ ప్రభుత్వంపై ఈనాడు రామోజీరావుకు ఎందుకింత కక్ష? అని ప్రశ్నించారు. రామోజీరావు ఎలాంటి వారో ఆయన తోడల్లుడిని అడిగినా చెబుతారన్నారు. మంత్రి కారుమూరి ఆదివారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబువి అబ్రకదబ్ర హామీలని, నయ వంచనకు ఆయన కేరాఫ్ అని ధ్వజమెత్తారు. రైతులకు చంద్రబాబు ఎంత ద్రోహం చేసినా రామోజీకి కనపడదు, వినపడదు. టీడీపీ పాలనలో దోచుకో దాచుకో పద్ధతిని అనుసరించారు. చంద్రబాబు హయాంలో 2.65 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తే గత నాలుగేళ్లలో సీఎం జగన్ 3.10 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 2014 – 19 మధ్య 17.94 లక్షల మంది రైతులకు రూ.40,236 కోట్లు మాత్రమే చెల్లింపులు జరిగాయి. నాలుగేళ్లలో సీఎం జగన్ 32.78 లక్షల మంది రైతులకు పారదర్శకంగా రూ.58,765 కోట్లు చెల్లింపులు చేశారు. రైతులకు చంద్రబాబు ఎంత ద్రోహం చేసినా, గిట్టుబాటు ధర కల్పించకపోయినా రామోజీరావు, దత్తపుత్రుడు ఏనాడూ మాట్లాడలేదు. చంద్రబాబు ఎంత దుర్మార్గాలకు పాల్పడ్డారో రైతులందరికీ తెలుసు.ఇన్పుట్ సబ్సిడీని ఎగ్గొట్టారు. 2014 ఇన్పుట్ సబ్సిడీ కూడా సీఎం జగన్ వచ్చాకే ఇచ్చారు. ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూ్యరెన్స్ ఆ పంట కాలంలోనే ఇస్తున్నాం. తెలంగాణలో ధాన్యాన్ని ఇతరులు ఎవరూ కొనరు. ఆ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఏపీలో స్వర్ణ రకం, ఇతర అన్ని రకాల ను పండిస్తారు. మన దగ్గర పండే ధాన్యాన్ని రైతుల నుంచి ఎంఎస్పీ కంటే ఎక్కువ ధరకు బయ్యర్లు కొనుగోలు చేస్తారు. ఐదేళ్ల నుంచి బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయని కేంద్ర ప్రభుత్వంతో కొనిపించే ఏర్పాట్లు చేశాం. బొండాలను కొనుగోలు చేయాలనుకుంటే కొంత మాత్రమే వచ్చింది. విక్రయించాలని రైతులను కోరినా అమ్మలేదు. కేరళ అడిగిన బొండాలు రకం కూడా కొనుగోలు చేశాం. కేరళలో ఓనమ్ పండుగ వరకు మన రైతులు నిల్వ చేస్తారు. అలా నిల్వ చేయటం వల్ల రూ.1900లకు అమ్మటంతో రైతులకు ఎంతో లాభం వచ్చింది. -
మండుతున్న పప్పుల ధరలు
గతేడాది వర్షాభావ పరిస్థితులే కారణం ఈ సీజన్లో ఇంకా చేతికందని పంటలు వైరా :వరుస పండగల వేళ పప్పుల ధరలకు రెక్కలొచ్చాయి. దసరా, మొహర్రం, దీపావళి పర్వదినాల నేపథ్యంలో పప్పులు.. నిప్పులుగా మారాయి. కందిపప్పు ధర కొండెక్కితే.. పెసర, ఎర్రపప్పు, మినప పప్పు ధరలు కూడా అదే స్థాయిలో మండిపోతున్నాయి. గతవారం రోజుల్లోనే పప్పుల ధరలు అమాంతంగా పెరిగాయి. కంది, శనగ, మినపప్పు, కేజీ రూ.20చొప్పున పెరిగింది. మరోవారం రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు వెల్లడిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్ణయించే ధరలను బట్టి మార్కెట్లో పప్పులు విక్రయిస్తారు. ఇటీవల పదిహేనురోజులపాటు కురిసిన అకాల వర్షం కారణంగా ఇతర రాష్ట్రాల్లో కంది, శనగ పంటల దిగుబడులు తగ్గిపోయాయి. దీంతో ఒక్కసారిగా మార్కెట్లో పప్పుల నిల్వలు తగ్గిపోయి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇటీవల వినాయక చవితి, బక్రీద్ పండుగలకు తెప్పించిన సరుకునే ప్రస్తుత మార్కెట్లో ధర పెంచి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్లోని వరుస పండగల తర్వాత నవంబర్‌లో పప్పుల ధరలు మళ్లీ తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. దీనికి తోడు రెండేళ్లుగా కంది, శనగ పంటల దిగుబడి తగ్గిపోవడంతో మహరాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి పప్పులను దిగుమతి చేసుకోవడంతో ధరలు పెరుగుతున్నాయని మార్కెట్‌వర్గాలు అంటున్నాయి. ఖరీఫ్ పంటలు చేతికొస్తే కొంత తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. శనగకు ప్రసిద్ధి చెందిన రాయలసీమలో పంటలు బాగానే ఉన్నప్పటికీ మరో రెండు నెలల్లో కోతకు వస్తే పప్పురేటు తగ్గవచ్చని చెబుతున్నారు. రేషన్ దుకాణాల్లో నిలిచిన సరఫరా.. కొన్ని నెలల క్రితం వరకు ప్రభుత్వం రాయితీపై పేద, మధ్యతరగతి కుటుంబాలకు కందిపప్పు, మంచినూనె, గోధుమలు సరఫరా చేసేది. కొద్ది రోజులుగా సరఫరాను నిలిపివేశారు. ప్రభుత్వం ఒక రేషన్ కార్డుపై ప్రతినెలా కేవలం 400 గ్రాముల గోధుమలు, 500 గ్రాముల చక్కెర ఇవ్వాలని ఆదేశించగా, పౌరసరఫరాల శాఖ నుంచి గోధుమలు తీసుకునేందుకు డీలర్లు జంకుతున్నారు. చక్కెర మాత్రం ప్రతి నెలా ఒక్కో రేషన్ కార్డుపై అరకిలో చొప్పున ఇస్తున్నారు. గోధుమల కోసం డీలర్లు డీడీలు చెల్లించడం లేదు. ------------------------------------------------------ అక్టోబర్‌లో పప్పుల ధరలు (రూ.ల్లో).. ------------------------------------------------------ పప్పు 2015 2016 ------------------------------------------------------ కంది 120 140 శనగ 70 130 పెసర 85 100 ఎర్ర 80 100 మినప 140 160 ------------------------------------------------------- పప్పులు కొనాలంటే భయమేస్తోంది.. ఇది వరకు కూరగాయలతోపాటు పప్పు తప్పకుండా వండుకునేవాళ్లం. పెరిగిన ధరలకు పప్పును వారంలో ఒక్కరోజు తినాలంటేనే ఆలోచించాల్సి వస్తోంది. ప్రభుత్వాలు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి. కనీసం రేషన్‌షాపుల్లో కొంత ఇచ్చినా సర్దుకుపోయేవాళ్లం. పూర్తిగా బయట కొనుగోలు చేయాలంటే ఇంటి సామానులో ఎక్కువ పప్పులకే ఖర్చు చేయాల్సి వస్తోంది. - కంచర్ల వీణాకుమారి, మాజీ జెడ్పీటీసీ, వైరా