breaking news
deregulated
-
పొగాకు ఉత్పత్తులపై ఆంక్షలు ఎత్తేస్తాం
వెల్లింగ్టన్: ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పొగాకు వాడకంపై గత ప్రభుత్వం తీసుకువచి్చన నియంత్రణలను తొలగిస్తామని న్యూజిలాండ్ నూతన ప్రధాని క్రిస్టొఫర్ లక్సాన్ చెప్పారు. మాజీ వ్యాపారవేత్త, నేషనల్ పార్టీ నేత అయిన లక్సాన్తో సోమవారం గవర్నర్ జనరల్ సిండీ కిరో ప్రధానిగా ప్రమాణం చేయించారు. గత నెలలో జరిగిన ఎన్నికల్లో నేషనల్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. మరో రెండు పారీ్టలతో కలిసి తాజాగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రమాణ స్వీకారం అనంతరం క్రిస్టొఫర్ మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం గత ఏడాది పొగాకు వినియోగంపై తీసుకువచి్చన నియంత్రణలను తొలగిస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు ఏదేశంలోనూ లేని విధంగా సిగరెట్లలో నికొటిన్ స్థాయిలను తగ్గించడం, యువతపై జీవిత కాల ధూమపాన నిషేధం, సిగరెట్ విక్రేతల తగ్గింపు వంటివి అప్పటి ప్రభుత్వం ప్రకటించిన చర్యల్లో ఉన్నాయి. -
రూ.3.37 తగ్గనున్న డీజిల్ ధర!
-
రూ.3.37 తగ్గనున్న డీజిల్ ధర!
న్యూఢిల్లీ: డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం నియంత్రణ ఎత్తివేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. దీంతో డీజిల్ లీటర్ ధర 3.37 రూపాయల నుంచి నాలుగు రూపాయల వరకు తగ్గే అవకాశం ఉంది. ఈ ధరల తగ్గింపు ఈ అర్ధరాత్రి నుంచే అమలులోకి వస్తుంది. ఇక నుంచి పెట్రోల్ మాదిరిగా అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా డీజిల్ ధరలో మార్పు వస్తుంటుంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో డీజిల్ ధర తగ్గినందున ఇక్కడ కూడా తగ్గనుంది. **