breaking news
Dental Surgeon
-
పురుషులకు సరోగసి హక్కు ఉండద్దా !
పేరెంట్‌హుడ్‌ని ఆస్వాదించని వారెవరు? అమ్మా.. నాన్నా.. అని పిలిపించుకోవాలని ఉవ్విళ్లూరని వాళ్లెవరు? కానీ మన దేశంలోని సరోగసీ యాక్ట్ –2021 అందరికీ ఆ ఆవకాశాన్నివ్వట్లేదు. విడాకులు తీసుకున్న పురుషులకు, ట్రాన్స్పీపుల్కి సరోగసీ ద్వారా పేరెంట్ అయ్యే చాన్స్‌కి నో అంటోంది! దీన్నే సవాలు చేస్తూ కర్ణాటకకు చెందిన 45 ఏళ్ల డెంటల్ సర్జన్.. సరోగసీ ద్వారా ఒంటరి పురుషులకూ తండ్రి అయ్యే భాగ్యం కల్పించమంటూ సుప్రీంకోర్ట్‌లో దావా వేశాడు. ఇప్పుడది చర్చగా మారింది.. అడ్వకేట్లు, జెండర్ రైట్స్ కోసం పనిచేస్తున్న యాక్టివిస్ట్లూ దీనిమీద తమ అభిప్రాయాలను చెబుతున్నారు.సరోగసీ.. గర్భంలో బిడ్డను మోసే ఆరోగ్యపరిస్థితులు లేని వాళ్లకు ఆధునిక వైద్యశాస్త్రం అందించిన వరం! ఇది ఒంటరి పురుషులు, ట్రాన్స్ పీపుల్‌కీ పేరెంట్ అయ్యే అదృష్టాన్ని కలిగిస్తోంది. అలా బాలీవుడ్లో ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ పెళ్లి చేసుకోకుండానే కవల పిల్లలకు తండ్రి అయ్యాడు. అలాగే నటుడు తుషార్ కపూర్ కూడా ఓ బిడ్డను కన్నాడు. అయితే అది 2021కి ముందు. ఈ చట్టం వచ్చాక పురుషులకు ఆ వెసులుబాటును తీసేసింది. ఒంటరి మహిళలు (విడాకులు పొందిన వారు, అలాగే వితంతువులు), స్త్రీ పురుషులు మాత్రమే పెళ్లి చేసుకున్న జంటలకూ మాత్రమే ఈ చట్టం పేరెంట్స్ అయ్యే అవకాశాన్ని కల్పిస్తోంది. దీనిమీద సమాజంలోని పురుషులు సహా ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీలోనూ అసంతృప్తి ఉంది. విడాకులు పొందిన స్త్రీకి సరోగసీ ద్వారా తల్లి అయ్యే హక్కు ఉన్నప్పుడు, విడాకులు పొందిన పురుషుడికి ఎందుకు ఉండకూడదు? ఇది చట్టం చూపిస్తున్న వివక్ష తప్ప ఇంకోటి కాదని కర్ణాటక డెంటల్ సర్జన్ వాదన. పిల్లల్ని కనాలా వద్దా అనే చాయిస్ స్త్రీకెప్పుడూ ఇవ్వని ఈ సమాజంలో.. ఒంటరి పురుషులు, ట్రాన్స్ పీపుల్ని అనుమతించడం లేదు సరికదా... పురుషుడు సంపాదించాలి, స్త్రీ ఇంటిని చూసుకోవాలనే లింగవివక్షను ప్రేరేపించే మూస ధోరణిని ప్రోత్సహిస్తోందని జెండర్ యాక్టివిస్ట్‌ల అభి్ప్రాయం. కారా (సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ) నివేదికలను బట్టి ఒంటరి పురుషులకు దత్తత తీసుకునేందుకు అనుమతించినవీ, అలాగే.. మగవాళ్లు కూడా పిల్లల్ని పెంచగలరని నిరూపించిన ఉదాహరణలున్నాయి. కాబట్టి డెంటల్ సర్జన్ పిటిషన్లో న్యాయం ఉందని అంటున్నారు యాక్టివిస్ట్‌లు. అంతేకాదు అతని ఈ ΄ోరాటం ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీకి ఒక ఊతమవుతుందని.. లింగ అసమానతలను రూపుమాపే ప్రయత్నానికీ ఒక అడుగు పడుతుందనే ఆశనూ వ్యక్తం చేస్తున్నారు. – సరస్వతి రమవివక్ష చూపిస్తోందిడైవర్స్ తీసుకున్న మగవారికి, ఒంటరి పురుషులకు, స్వలింగ సంపర్కులకు, ట్రాన్స్ జెండర్స్‌కి సరోగసి పద్ధతిలో పిల్లలని కనడాన్ని సరోగసీ చట్టం నిషేధించింది. ఈ చట్టంలోని సెక్షన్ ంలు ఈ నిబంధన విధించాయి. ఈ చట్టం ప్రకారం కేవలం విడాకులు పొందిన లేదా వితంతువులకు, హెటిరో సెక్సువల్ దంపతులకు మాత్రమే సరోగసీ ద్వారా పిల్లలని కనే హక్కు ఉంది. ఒంటరి పురుషుడికి ఆడపిల్లను దత్తత తీసుకునే వీలు లేనప్పటికీ, జువెనైల్ జస్టిస్ చట్టంలోని సెక్షన్ 57, హిందూ అడాప్షన్ – మెయింటెనెన్స్ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం ఒంటరి/విడాకులు తీసుకున్న పురుషుడికి కూడా పిల్లలను దత్తత తీసుకునే హక్కు ఉన్నది. సరోగసీ చట్టం ఇందుకు భిన్నంగా ఉండటం రాజ్యాంగం కల్పించిన సమానత్వం, జీవించే స్వేచ్ఛ హక్కుల స్ఫూర్తికి వ్యతిరేకమే! ఇతర దేశాలు చాలామటుకు స్త్రీ పురుషుల మధ్య సరోగసీ పద్ధతిలో పిల్లల్ని కనటం పై సమాన హక్కులే కల్పించాయి. –శ్రీకాంత్ చింతల హైకోర్టు న్యాయవాదిఆ అవకాశం, వాతావరణం ఉన్నాయా? ప్రతి ఒక్కరికీ పేరెంట్‌హుడ్‌ను ఆస్వాదించే హక్కు ఉంది. ఆ హక్కు కోసం కర్ణాటక డెంటల్ సర్జన్ న్యాయ ΄ోరాటంలో తప్పులేదు. స΄ోర్ట్ కూడా చేస్తాను. అయితే వ్యక్తిగతంగా మాత్రం అందులో నాకు భిన్నమైన అభి్ప్రాయం ఉంది. అడుగడుగునా అసమానతలు, వివక్ష, అభద్రతలున్న ఈ సమాజంలో పుట్టబోయే పిల్లలను భద్రంగా కాపాడుకోగలమా? మనముందున్న సెక్సువల్ ఐడెంటిటీలనే గుర్తించి, గౌరవించడానికి సిద్ధంగా లేము. ఈ నేపథ్యంలో పుట్టబోయే పిల్లల భవిష్యత్ ఏంటీ? వాళ్లు చక్కగా పెరిగే అవకాశం, వాతావరణం ఉన్నాయా అనే విషయంలోనే నా భయం, ఆందోళన అంతా! – బోయపాటి విష్ణు తేజ, చైల్డ్ రైట్స్ యాక్టివిస్ట్స్టీరియోటైప్స్ని బలపరుస్తోంది.. పేరెంట్‌హుడ్ అనేది ఒక జెండర్‌కి మాత్రమే పరిమితమైనది కాదు. పేరెంట్ అవ్వాలని ఆశపడేవాళ్లందరూ ఆ హక్కును వినియోగించుకునే అవకాశం ఉండాలి. కొంతమంది మగవాళ్లు పేరెంట్ కావాలనుకున్నా ఇలాంటి చట్టాల వల్ల పేరెంట్‌హుడ్ చాయిస్‌ని కోల్పోతున్నారు. స్టీరియోటైప్స్ కొన్నిటిని ఈ చట్టం బలపరుస్తోంది. సింగిల్‌గా ఉన్న ఆడవాళ్లకు, హెటరో సెక్సువల్ ఫ్యామిలీస్‌కి మాత్రమే వెసులుబాటు కల్పిస్తూ! సింగిల్ ఉమెన్‌కి ఎందుకిచ్చిందంటే కేర్ గివింగ్ అనే లక్షణం సహజంగానే వాళ్లకుంటుంది కాబట్టి అనే. అంటే ఈ రెండు స్టీరియోటైప్స్‌ని ఆ చట్టం బలపరుస్తున్నట్టే కదా! వివక్షే కాకుండా స్టీరియోటైప్స్నీ బలపరుస్తున్నట్టున్న ఈ చట్టాన్ని చాలెంజ్ చేయడం మంచిదే! పురుషుడు సంపాదిస్తాడు, స్త్రీ ఇల్లు చూసుకుంటుంది లాంటి జెండర్ రోల్స్‌ను ఈ చట్టం బలపరుస్తోంది. ఈ చట్టం వల్ల ఎల్‌జిబీటీక్యూ కమ్యూనిటీస్కీ నష్టమే! ఏమైనా ఈ చట్టంలో మార్పులు రావాలి. ఎక్స్΄్లాయిటేషన్ను ఆపేలా చట్టాలుండాలి కానీ.. పేరెంట్‌హుడ్ కావాలనుకునే వారిని నిరుత్సాహపరచేలా కాదు.– దీప్తి సిర్ల, దళిత్ అండ్ జెండర్ యాక్టివిస్ట్ -
చదువు వేరైనా.. అనుభవం లేకున్నా..పట్టుదలతో రాణించింది!
చదివిన డిగ్రీలకు సంబంధించిన ఉద్యోగాలు చేసేవాళ్లు కొందరైతే, తమ చదువు, అర్హతలకు సంబంధం లేని రంగాల్లో ప్రవేశించి రాణించేవాళ్లు మరికొందరు. చూడగానే ఇట్టే పట్టేసే నేర్పరితనం, విభిన్నంగా ఆలోచించే శైలి, చక్కని పరిశీలనా శక్తి ఉంటే వృత్తిలోనే కాదు, అనుభవం లేని వ్యాపారంలో కూడా అవలీలగా రాణించవచ్చని నిరూపించి చూపిస్తోంది ఢిల్లీకి చెందిన ఎంట్రప్రెన్యూర్ డాక్టర్ సిమ్రన్ మన్ సచ్దేవ. డెంటల్ సర్జన్‌గా పనిచేసిన సిమ్రన్ విభిన్న ఆలోచనతో ఏకంగా చెప్పులు, షూలు విక్రయించే స్టార్టప్‌ను ప్రారంభించింది. వృత్తిరీత్యా వైద్యురాలు అయినప్పటికీ పరిస్థితుల దృష్ట్యా స్టార్టప్‌ను ఏర్పాటు చేసి చక్కగా నడిపిస్తూ లాభాలను ఆర్జిస్తూ, ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది. చండీగఢ్‌లో న్యాయసంబంధ మూలాలున్న కుటుంబంలో పుట్టింది సిమ్రన్. కుటుంబ సభ్యుల ఆలోచనలకు ఎప్పుడూ భిన్నంగా ఆలోచించే సిమ్రన్‌కు చిన్నప్పటి నుంచి పెంపుడు జంతువులంటే ఎంతో ఇష్టం. పెద్దయ్యాక వెటర్నరీ డాక్టర్ కావాలనుకుంది. ఇంటర్మీడియట్ తర్వాత వెటర్నరీ ఇంటర్న్ షిప్ చేసింది. కానీ ఆమెకు అంతగా నచ్చకపోవడంతో అమెరికాలో డెంటల్ సర్జరీ డిగ్రీ చేసింది. చదువు పూర్తయ్యాక ఢిల్లీలో మూడేళ్లపాటు పనిచేసింది. తర్వాత పెళ్లి అయ్యి పిల్లలు పుట్టడడంతో వారిని చూసుకోవడంతో బిజీగా ఉంటూ తన వృత్తికి విరామం ఇచ్చింది. పిల్లలకు ఐదేళ్లు వచ్చాక.. స్కూల్లో చేర్పించింది. స్కూలుకెళుతోన్న పిల్లలకు తన బంధువులు, స్నేహితులతో విదేశాల నుంచి రకరకాల చెప్పులు, షూస్ తెప్పించి వేసేది. కానీ అవి కొద్దినెలల్లోనే పాడవుతుండేవి. దీంతో తరచూ షూస్ కొనాల్సి వచ్చేది. ఇండియా లో కొన్న చెప్పులు ఎక్కువ కాలం ఉంటున్నాయి. కానీ విదేశాల నుంచి తెచ్చినవి ఎక్కువ కాలం ఉండడంలేదు. మనదేశం లో చెప్పులుగానీ, షూస్ గానీ ఒకసారి కొన్నామంటే రెండుమూడేళ్లపాటు చెక్కుచెదరకుండా ఉంటాయి. ఇక్కడ మాత్రం ఎంత ఖరీదు పెట్టి కొన్నప్పటికీ మూడు నెలల్లోనే పాడవుతున్నాయి. అక్కడ నుంచి నాసిరకం చెప్పులను ఎందుకు తెచ్చుకోవాలి. మనదేశంలో తయారైన నాణ్యమైన షూలను నేనెందుకు విక్రయించకూడదన్న ఆలోచన వచ్చింది సిమ్రన్‌కు. కజార్‌మ్యాక్స్ ఏమాత్రం అనుభవం లేని వ్యాపారం ఎలా చేయాలి అనుకుంటూనే చెప్పుల బిజినెస్ ప్రారంభించడానికి అనేక పుస్తకాలు చదివి అవగాహన పెంచుకుంది. తరవాత వస్త్ర వ్యాపారం చేస్తోన్న తన మామగారి దగ్గర కొన్ని సలహాలు సూచనలు తీసుకుని 2017లో ‘కజార్‌మ్యాక్స్’ పేరుతో ఫుట్‌వేర్ బ్రాండ్‌ను ప్రారంభించింది. ఇండియాలో దొరికే ముడి పదార్థాలతో పిల్లల చెప్పులు, షూస్‌ను నాణ్యంగా రూపొందించి ‘లోకల్ ఫర్ వోకల్’ పేరిట విక్రయిస్తోంది. పర్యావరణ హితంగా, తక్కువ ధరలో నాణ్యమైన చెప్పులు దొరుకుతుండడంతో అతికొద్దికాలంలోనే ఏడు లక్షల రూపాయలతో ప్రారంభించిన కజార్ మ్యాక్స్ ఇరవై కోట్లరూపాయల టర్నోవర్‌కు చేరుకుంది. కజార్‌మ్యాక్స్ బ్రాండ్ ఉత్పత్తుల తయారీ లో ఎటువంటి జంతుచర్మాలనూ ఉపయోగించడంలేదని పెటా కూడా ఈ బ్రాండ్‌కు అనుమతి ఇచ్చింది. క్లాత్, కొన్ని రకాల ప్లాస్టిక్, రబ్బరుతో ఆకర్షణీయమైన రంగులతో చెప్పులు, షూస్ తయారు చేసి ఆఫ్‌లైన్, ఆన్లైన్ మాధ్యమాల్లో విక్రయిస్తోంది. ‘‘సమయం, చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి ఒక్కోసారి మన చదువుకు సంబంధం లేని పనులు చేయాల్సి ఉంటుంది. వాటిని అనుసరించి నడిస్తే భవిష్యత్ బావుంటుందనుకున్నప్పుడు ఏది ఎంచుకున్నా తప్పుకాదు. నాకు వ్యాపార అనుభవం లేకపోయినప్పటికీ పుస్తకాలు, ఇంటర్నెట్లో సెర్చ్ చేసి అనేక విషయాలు నేర్చుకున్నాను. జీవితాల్లో అనేక మలుపులు, ఆటుపోట్లు వస్తాయి. వాటిని సానుకూలంగా మలుచుకుంటూ ముందుకు సాగాలే గానీ, అక్కడే ఆగిపోకూడదు. ఏది చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందో దానిని క్రియేటివ్ గా చేసుకుంటూ ముందుకు సాగితే, విజయం దానంతట అదే వస్తుంది’’ అని చెబుతూన్న సిమ్రన్ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. -
పక్కా ప్లాన్‌తో మానస హత్య.. క్యాబ్ డ్రైవర్ సాయంతో గన్ కొని..
కొచ్చి: గత నెలలో జరిగిన డెంటల్ విద్యార్ధిని మానస హత్య కేసులో కీలక విషయాలు బయటికొస్తున్నాయి. కేసుకు సంబంధించి బీహార్‌లోని మంగేర్ జిల్లాలో 21 ఏళ్ల సోను కుమార్ మోదీని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీవీ మానస(24) ఇందిరా గాంధీ కాలేజీలో డెంటల్ కోర్సు ఫైనల్ ఇయర్ చదువుతోంది. అక్కడే స్నేహితులతో కలిసి రూమ్‌లో ఉంటోంది. రాఖిల్ (32) కూడా అదే జిల్లాకు చెందిన వాడు. రెండేళ్ల క్రితం ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యారు. వారి స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఆ తరువాత రాఖిల్ నువ్వు ఏ అబ్బాయితోనూ మాట్లాడొద్దు, చాటింగ్ చెయ్యొద్దంటూ కంట్రోల్ చెయ్యడం ప్రారంభించాడు. కొన్నాళ్లకు అతడు పెడుతున్న షరతులు భరించలేక బ్రేకప్ చెప్పింది. అతడిని అవాయిడ్ చేయడం మొదలు పెట్టింది. దీనిని భరించలేని రాఖిల్ మనస్ఫూర్తిగా ప్రేమిస్తే.. నన్నే కాదంటుందా అని ఆమెపై పగ పెంచుకున్నాడు. మానస లేని జీవితం తనకి వద్దనుకున్నాడు. ప్రతి రోజూ మానసనే తలచుకుంటూ ఓ సైకోలా తయారయ్యాడు. తనకు దక్కని మానస ఇంకెవరికీ దక్కకూడదనుకున్నాడు. చివరికి ఓ ఉబర్ క్యాబ్ డ్రైవర్ సాయంతో బీహార్‌లో సోను కుమార్ మోదీ అనే వ్యక్తి దగ్గర నాటు తుపాకీ కొన్నాడు. కేరళలోని కొత్తమంగళంలో మానస రూమ్‌కు దగ్గర్లోనే ఓ రూమ్ అద్దెకు తీసుకున్నాడు. అక్కడే ఒక ప్లైవుడ్ కంపెనీలో పనిచేయడానికి వచ్చానని గది ఓనర్‌కి చెప్పాడు. అక్కడే మానసను ఎలా హతమార్చాలో పక్కా ప్లాన్ రచించాడు. గత వారం మానసను గన్‌తో కాల్చిన తర్వాత తనూ సూసైడ్ చేసుకున్నాడు. మరి రాఖిల్‌కి ఈ హత్యలో ఇంకెవరైనా సహకరించారా? అనేదానిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
పాజిటివ్ డెంటిస్ట్
ఆర్థోడాంటిక్స్ అంటే ఏమిటి? ఎత్తు పళ్ళ సమస్యను సరిచేయుటకు సంబంధించిన బ్రాంచ్ని ఆర్థోడాంటిక్స్ అంటారు. దీనిలో వంకరపళ్ళను కూడా సరిచేయవచ్చు. ఎత్తుపళ్ళ సమస్యను ఎలా అరికట్టవచ్చు? ఎత్తు పళ్ళ సమస్య వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముందుగా ఒక ఎక్స్‌రే తీయవలసి ఉంటుంది. దానివల్ల ఎత్తు పళ్ళ సమస్య దంతాలకు సంబంధించినదా లేక ఎముకకు సంబంధించినదా అని నిర్థారిస్తారు. అది ఎముకలకు సంబంధించినదైతే స్కెలిటల్ ఎనామలీ అంటారు. ఒకవేళ స్కెలిటల్ ఎనామలీ అయితే ఆర్థోగ్నాతిక్ సర్జరీ చేయవలసి ఉంటుంది. ఎత్తు పళ్ళను ఆర్థో ద్వారా సరిచేయుటకు ఎంత కాలం పడుతుంది? ఇది నిర్థారించుటకు రెండు ఎక్స్‌రేలు తీయవలసి ఉంటుంది. ఒకటి - ఆర్థోపెంటమొగ్రామ్. రెండవది - లెటరల్ సెఫలోగ్రామ్. దాన్ని బట్టి నిపుణులు ఎంతకాలం పడుతుందో నిర్థారిస్తారు. ఆర్థోడాంటిక్ ప్రొసీజర్ని ఎలా చేస్తారు? దీనికి ముందుగా ఒక పళ్ళ నమునా తీసి మోడల్ ఎనాలిసిస్ చేస్తారు. దానివల్ల పళ్ళు తీయవలసిన అవసరం ఉంటుందా లేదా అని నిర్థారిస్తారు. తరువాత ఆర్థోడాంటిక్స్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. దాని తరువాత బ్రెసెస్ని పళ్ళకి అమర్చుతారు. కాంపోసిట్ అనే మెటీరియల్‌తో బ్రెసెస్ని పళ్ళకి అమర్చుతారు. ఈ ప్రాసెస్‌ని బౌండింగ్ అంటారు. దీనికి ఒక గంట సమయం పడుతుంది. దాని తరువాత నెలకి ఒకసారి అపాయింట్మెంట్స్ ఉంటాయి. ఆర్థోడాంటిక్ బ్రెసెస్ ఎన్ని రకాలు ఉంటాయి? స్టెన్‌లెస్ స్టీల్ బ్రెసెస్ ఒక రకం. ఇప్పుడు ఆధునికంగా వచ్చిన వాటిలో సిరమిక్ బ్రెసెస్ ఒకటి. ఇందులో బ్రెసెస్ పళ్ళ రంగులో ఉంటాయి. దీనివల్ల బ్రెసెస్ పెట్టినట్టు కనిపించవు. ఇంకో ఆధునిక పద్ధతి ఏమనగా లింగువల్ ఆర్థోడెంటెక్స్. దీనిలో బ్రెసెస్ పంటి మీద అంటే పంటి ముందు భాగం మీద కాకుండా వెనుక భాగంలో అమర్చుతారు. దానివల్ల బ్రెసెస్ అసలు కనబడవు. ఒకసారి ఎత్తుపళ్ళు సరిచేసిన తరువాత తిరిగి యథాస్థానంలోకి వచ్చే అవకాశం ఉంటుందా? ఇది జరుగకుండా ఉండడానికి ఆర్థోట్రీట్మెంట్ అయిపోయిన వెంటనే రీటేనర్స్ ఇస్తారు. రీటేనర్స్ రెండు రకాలు ఉంటాయి. ఒకటి రీమూవబుల్, ఇంకొకటి ఫిక్సెడ్. దీనిని ఆరు నెలల వరకు వాడాల్సి ఉంటుంది. వీటివల్ల ఎత్తు పళ్ళు తిరిగి వచ్చే సమస్య అనగా రిలాప్స్ని నివారించవచ్చు. ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ ఏ వయస్సు వారికి చేయవచ్చు? పదిహేనేళ్ళు దాటిన తరువాత ఆర్థోడాంటిక్స్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. డా. సృజనారెడ్డి గారు, సీనియర్ డెంటల్ సర్జన్ www.positivedental.com హైదరాబాద్: ఎస్.ఆర్. నగర్ దిల్సుఖ్నగర్, మాదాపూర్, కెపిహెచ్బి, నిజాంపేట, కర్నూల్ 9246567874