సౌత్‌జోన్ పోటీలకు ఐశ్వర్య
దుగ్గిరాల (పెదవేగి రూరల్): యూనివర్సిటీ 11వ సౌత్‌జోన్ ఆటల పోటీలకు తమ కళాశాల విద్యార్థిని మోటూరి ఐశ్వర్య ఎంపికయ్యిందని దుగ్గిరాల దంత కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ నెల్లి జార్జ్ తెలిపారు. కళాశాలలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ తృతీయ సంవత్సరం బీడీఎస్ విద్యార్థిని ఐశ్వర్య డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడలో జరిగిన సౌత్‌జోన్ పోటీల్లో సత్తాచాటిందన్నారు. ఈనెల 10 నుంచి 14 వరకు బాస్కెట్‌బాల్, 24 నుంచి 28వ తేదీవరకు వాలీబాల్ పోటీల్లో తలపడుతుందని చెప్పారు. ప్రిన్సిపాల్ ఎన్ స్లీవరాజ్, అడ్మినిస్టేటర్ ఫాదర్ బల్తజర్, పీడీ నిట్టా నల్లయ్య ఆమెను అభినందించారు.