breaking news
Delhi Metro Rail Corporation Ltd.
-
మెట్రో రీ ఓపెన్.. ఫైన్ల మోత
సాక్షి, న్యూఢిల్లీ: దాదాపు ఆరు నెలలుగా నిలిచి పోయిన మెట్రో రైళ్లు.. అన్‌లాక్ 4.0లో భాగంగా వచ్చే నెల తొలివారంలో పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనలను పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించిన నేపథ్యంలో మెట్రో రైళ్ల రాకపోకలకు కూడా అనుమతులు లభించనున్నట్లు మెట్రో వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రయాణికుల కోసం నూతన విధివిధానాలను రూపొందించే పనిలో ఉన్నారు మెట్రో అధికారులు. ఈ మేరకు గురువారం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు సమావేశం అయ్యి చర్చించారు. దీని ప్రకారం ఫేస్ మాస్క్ లేకుండా ప్రయాణం చేయడం, రైళ్లు లేదా ప్లాట్‌ఫామ్‌లలో సామాజిక దూరం పాటించకపోవడం, ఉమ్మి వేయడం, చెత్తాచెదారం పడేయడం.. ఖాళీగా ఉండటానికి ఉద్దేశించిన సీట్లపై కూర్చోవడం వంటివి చేస్తే భారీ జరిమానాలు విధించాలని భావిస్తున్నట్లు సమాచారం. (చదవండి: కోవిడ్-19 : దీదీ కీలక నిర్ణయం) అంతేకాక సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) ఫ్లయింగ్ స్క్వాడ్ ఒకరు నిత్యం మెట్రో రైలు, స్టేషన్లో ఉంటారని.. కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా చూస్తారని సమాచారం. ఇక నిబంధనలు పాటించని వారిపై ఫైన్ల మోత మోగనున్నట్లు తెలుస్తోంది. నిబంధనలు పాటించని వారికి మొదటిసారి 500 వందల రూపాయల జరిమానా విధిస్తారని.. పలుమార్లు నిబంధలు ఉల్లంఘించేవారి విషయంలో ఈ మొత్తం భారీగా పెరగనున్నట్లు సమాచారం. జనతా కర్ఫ్యూ విధించిన నాటి నుంచి ఢిల్లీ మెట్రో సేవలు నిలిచిపోయాయి. అయితే ప్రస్తుతం ఇతర రవాణా మార్గాలను అనుమతిస్తున్నారు కానీ మెట్రో మాత్రం ప్రారంభం కాలేదు. దీని ద్వారా ప్రతి రోజు ఢిల్లీలో 2.4 మిలియన్ల మంది ప్రయాణిస్తారు. -
మెట్రో ఉద్యోగుల జీతభత్యాల్లో కోత
సాక్షి, న్యూఢిల్లీ : మెట్రో రైలు ఉద్యోగుల జీతభత్యాల్లో కోత విధిస్తూ ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ లిమిటెడ్ ( డిఎంఆర్సి ) నిర్ణయం తీసుకుంది. ఆగస్టు నెలనుంచి ఉద్యోగులకు ఇచ్చే ప్రోత్సాహకాలు, భత్యాలను 50 శాతం తగ్గించనున్నట్లు మంగళవారం డిఎంఆర్సి ఒక ఉత్తర్వులో పేర్కొంది. మార్చి 22న దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి మెట్రో సేవలు నిలిచిపోయాయి. దీంతో దాదాపు 1500 కోట్ల మేర నష్టం వాటిల్లినందున ఉద్యోగుల జీతంలో కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. మెట్రో సేవలు తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయన్న దానిపై స్పష్టత లేకపోవడంతో డిఎంఆర్సి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దాదాపు ఐదు నెలలుగా మెట్రో సేవలు నిలిచిపోయినందున తీవ్ర ఆర్థిక భారం నేపథ్యంలో ఉత్యోగుల జీతభత్యాలను 50 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాం. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిబంధనలు కొనసాగుతాయి అంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. (రూ.3,756 కోట్లు ప్లీజ్) ఢిల్లీ మెట్రో రైలు ఉద్యోగులకు లభించే అన్ని రకాల అడ్వాన్సులను తదుపరి ఉత్తర్వుల వరకు నిషేధించారు. అయితే ఇప్పటికే అనుమతి పొందిన వారికి మాత్రమే అడ్వాన్సులు ఇస్తారు. అయితే మెట్రో ఉద్యోగులు వైద్య చికిత్స, టీఏ, డీఏ వంటి ఇతర సౌకర్యాలను ఆంక్షల నుంచి మినహాయింపు కల్పించారు. దేశంలో లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి మెట్రో మినహా దాదాపు అన్ని రవాణా సౌకర్యాలకు అనుమతించారు. ఈ నేపథ్యంలో మెట్రో తీవ్ర నష్టాన్ని చవిచూసింది. ఈ నేపథ్యంలో గతంలో రైల్వే కార్పేరేషన్ నిర్మాణం కోసం కేంద్రం నుంచి తీసుకున్న 35,198 కోట్ల రుణాన్ని ఇప్పటి పరిస్థితుల్లో తిరిగి చెల్లించడం సాధ్యం కాదని కేంద్రానికి లేఖ రాసింది. వచ్చే ఏడాది వరకు రుణాన్ని వాయిదా వేయాలని డిఎంఆర్సి గత నెలలోనే లేఖ రాసింది. ఈ 2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ 1242.83 కోట్ల రూపాయలను కేంద్రానికి చెల్లించాల్సి ఉందని డిఎంఆర్సి అధికారి ఒకరు వెల్లడించారు. (రిలయన్స్ చేతికి నెట్‌మెడ్స్ ) -
ఉద్యోగ సమాచారం
యూపీఎస్సీలో 169 పోస్టులు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు.. అసిస్టెంట్ డెరైక్టర్ ఆఫ్ ఆపరేషన్స (ఖాళీలు-11), సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (ఖాళీలు-4), అసిస్టెంట్ ప్రొఫెసర్ - కార్డియాలజీ, కార్డియోవాస్క్యులర్ అండ్ థొరాసిక్ సర్జరీ (ఖాళీలు-8), అసిస్టెంట్ కెమిస్ట్ (ఖాళీలు-4), అసిస్టెంట్ జియాలజిస్ట్ (ఖాళీలు-139), డిప్యూటీ డెరైక్టర్ (ఖాళీలు-2), ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఖాళీలు-1). ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేది నవంబర్ 12. వివరాలకు www.upsconline.nic.in చూడొచ్చు. ఢిల్లీ మెట్రోలో 1,509 పోస్టులు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్.. వివిధ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ (ఖాళీలు-2), నాన్ ఎగ్జిక్యూటివ్ (ఖాళీలు-1,507) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 25. వివరాలకు www.delhimetrorail.com చూడొచ్చు. ఈస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్‌లో వివిధ పోస్టులు ఈస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఈసీఎల్).. రె గ్యులర్, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు.. మైనింగ్ సిర్దార్ (ఖాళీలు-631), డిప్యూటీ సర్వేయర్ (ఖాళీలు-43), ఓవర్సీర్ (ఖాళీలు-48). వయసు 30 ఏళ్లకు మించకూడదు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 12. వివరాలకు www.easterncoal.gov.in చూడొచ్చు. యూకో బ్యాంక్‌లో 100 చార్టర్‌డ అకౌంటెంట్ పోస్టులు యూకో బ్యాంక్.. వివిధ విభాగాల్లో చార్టర్‌డ అకౌంటెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 100. వయసు 35 ఏళ్లకు మించకూడదు. ఆన్లైన్ దర ఖాస్తుకు చివరి తేది నవంబర్ 20. వివరాలకు www.ucobank.com చూడొచ్చు. ఎన్ఎఫ్సీలో సైంటిఫిక్ ఆఫీసర్, స్టెనోగ్రాఫర్లు హైదరాబాద్‌లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్..వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు.. సైంటిఫిక్ ఆఫీసర్ (ఖాళీలు-2), సైంటిఫిక్ అసిస్టెంట్ (ఖాళీలు-4), స్టెనోగ్రాఫర్ (ఖాళీలు-12). ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 14. వివరాలకు www.nfcrecruitment.in చూడొచ్చు. సీఆర్పీఎఫ్లో జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు సెంట్రల్ రిజర్వ పోలీస్ ఫోర్స.. కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ విభాగాల్లో స్పెషలిస్టు డాక్టర్లు (ఖాళీలు-2), జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు (ఖాళీలు-10) పోస్టుల భర్తీకి నవంబర్ 16న ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. వివరాలకు www.crpf.nic.in చూడొచ్చు. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్‌లో స్పెషల్ రిక్రూట్మెంట్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్.. వికలాంగుల కోటాలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్(నాన్-టెక్నికల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీలు 122. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 23. వివరాలకు www.ssc.nic.in చూడొచ్చు. సీసీఐలో మేనేజర్, డిప్యూటీ మేనేజర్లు ఢిల్లీలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సీసీఐ).. వివిధ విభాగాల్లో జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్/జోనల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, కెమికల్ ఇంజనీర్, ప్రాసెస్ ఇంజనీర్, ఎగ్జ్జిక్యూటివ్ సెక్రటరీ, జూనియర్ స్టాఫ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 31. దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 19. వివరాలకు www.cementcorporation.co.in చూడొచ్చు. భోపాల్ ఎయిమ్స్‌లో వివిధ పోస్టులు భోపాల్‌లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్).. మూడేళ్ల వ్యవధికి వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 81. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేది నవంబర్ 25. వివరాలకు www.aiimsbhopal.edu.in చూడొచ్చు. కిరోరి మాల్ కాలేజ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ పరిధిలోని కిరోరి మాల్ కాలేజ్.. వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 43. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 13. వివరాలకు www.kmcollege.ac.in చూడొచ్చు. చాచా నెహ్రూ బాల చికిత్సాలయలో సీనియర్,జూనియర్ రెసిడెంట్స్ ఢిల్లీలోని చాచా నెహ్రూ బాల చికిత్సాలయ.. అడ్హాక్ పద్ధతిలో వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ (ఖాళీలు- 12), జూనియర్ రెసిడెంట్ (ఖాళీలు-10) పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఇంటర్వ్యూ తేది అక్టోబర్ 30. వివరాలకు www.delhi.gov.in చూడొచ్చు. హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టులో పోస్టులు హైకోర్ట ఆఫ్ హిమాచల్‌ప్రదేశ్.. క్లర్క/ప్రూఫ్ రీడర్ (ఖాళీలు-9), జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్స్ (ఖాళీలు-16) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 17. వివరాలకు www.hphighcourt.nic.in చూడొచ్చు. నాల్కోలో డిప్యూటీ మేనేజర్లు/మేనేజర్లు నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (నాల్కో).. డిప్యూటీ మేనేజర్/ మేనేజర్ (ఖాళీలు-9), డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఖాళీలు-2), అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఖాళీలు-1) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 31. వివరాలకు www.nalcoindia.com చూడొచ్చు. డా. హరిసింగ్ గౌర్ యూనివర్సిటీలో నాన్‌టీచింగ్ పొజిషన్లు మధ్యప్రదేశ్‌లోని డాక్టర్ హరిసింగ్ గౌర్ యూనివర్సిటీ.. వివిధ విభాగాల్లో నాన్ టీచింగ్, అకడమిక్ పొజిషన్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 21. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 9. వివరాలకు www.dhsgsu.ac.in చూడొచ్చు. పుదుచ్చేరి నిట్‌లో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులు పుదుచ్చేరిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్).. వివిధ విభాగాల్లో టీచింగ్ (ఖాళీలు-3), నాన్ టీచింగ్ (ఖాళీలు-11) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 10. వివరాలకు www.nitpy.ac.in చూడొచ్చు. ఎన్ఐఐఎస్టీలో వివిధ పోస్టులు తిరువనంతపురంలోని సీఎస్ఐఆర్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్‌డిసిప్లినరీ సైన్స అండ్ టెక్నాలజీ (ఎన్ఐఐఎస్టీ).. తాత్కాలిక ప్రాతిపదికన ఎస్పీఎఫ్ (ఖాళీలు-1), ప్రాజెక్ట్ అసిస్టెంట్ (ఖాళీలు- 16 ), రీసెర్చ అసోసియేట్ (ఖాళీలు-4), ప్రాజెక్ట్ అసోసియేట్ (ఖాళీలు-1), ప్రాజెక్ట్ ఫెలో (ఖాళీలు -1) పోస్టుల భర్తీకి అక్టోబర్ 27 నుంచి నవంబర్ 5 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. వివరాలకు www.niist.res.in చూడొచ్చు.