breaking news
Delhi highcour
-
ఫేస్బుక్, వాట్సాప్‌లకు నోటీసులు..
సాక్షి, న్యూఢిల్లీ : జేఎన్‌యూ క్యాంపస్‌లో ఈనెల 5న జరిగిన హింసకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, వాట్సాప్ సంభాషణలను నిక్షిప్తం చేయాలని కోరుతూ ముగ్గురు జేఎన్‌యూ ప్రొఫెసర్లు దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఫేస్బుక్, వాట్సాప్‌లకు నోటీసులు జారీ చేసింది. హింసకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్, వాట్సాప్ సంభాషణలను నిక్షిప్తం చేయాలని తాము ఇప్పటికే జేఎన్‌యూలో సంబంధిత అధికారులను కోరగా ఇప్పటివరకూ ఎలాంటి స్పందనా రాలేదని పోలీసులు హైకోర్టుకు నివేదించారు. కేసుకు సంబంధించిన ఇరు పక్షాల వివరాలు తెలపాలని తాము వాట్సాప్‌కు లేఖ రాశామని, స్పందన కోసం వేచిచూస్తున్నామని చెప్పారు. కాగా, జేఎన్‌యూలో చెలరేగిన హింసకు సంబంధించి ‘యూనిటీ ఎగనెస్ట్ లెఫ్ట్’ , ‘ఫ్రెండ్స్ ఆఫ్ ఆరెస్సెస్’ వాట్సాప్ గ్రూపుల డేటాను సెక్యూర్ చేయాలని డిలీట్ అయిన పక్షంలో ఆ డేటాను తిరిగి పొందాలని వాట్సాప్, గూగుల్, యాపిల్‌లకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ జేఎన్‌యూ ప్రొఫెసర్లు అమిత్ పరమేశ్వరన్, అతుల్ సూద్, శుక్లా వినాయక్ సావంత్‌లు ఈనెల 10న ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ దిశగా ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఢిల్లీ ప్రభుత్వాలకు అవసరమైన ఆదేశాలు ఇవ్వాలని కూడా పిటిషనర్లు కోర్టును కోరారు. -
ప్రియా పిళ్లై లుకౌట్ నోటీసును రద్దు చేయండి
న్యూఢిల్లీ: స్వచ్ఛంద సంస్థ ‘గ్రీన్ పీస్’ కార్యకర్త ప్రియా పిళ్లై విషయంలో ఢిల్లీ విమానాశ్రయంలో అధికారులు వ్యవహరించిన తీరుపై ఢిల్లీ హై కోర్టు మండిపడింది. ఆమెకు జారీ చేసిన ‘లుకౌట్ నోటీసు’ ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. ప్రజాస్వామ్యంలో ఎవరి గొంతు నొక్కలేరని....అభివృద్ధి విధానాలపై భిన్నాభిప్రాయాలువ్యక్తం చేసే హక్కు పౌరులకు ఉంటుందని హైకోర్టు అభిప్రాయపడింది. మధ్యప్రదేశ్‌లోని మహాన్‌లో ఎస్సార్, హిండాల్కో సంస్థలకు విద్యుదుత్పాదన కోసం కేటాయించిన బొగ్గు గనులవల్ల అక్కడున్న అడవులు ధ్వంసమవుతాయని, ఆదివాసుల జీవిక దెబ్బతింటుందని గ్రీన్‌పీస్ భావించి మహాన్ సంఘర్ష సమితి(ఎంఎస్ఎస్) ఏర్పాటుచేసి ఉద్యమం నడుపుతున్నది. తమ అవగాహనను బ్రిటన్ ఎంపీలకు తెలియజెప్పేందుకు ప్రియా పిళ్లై లండన్ వెళ్తున్న సందర్భంలో ఆమెను అధికారులు అడ్డగించారు. గత జనవరి 1l న లండన్ వెళ్లే విమానం ఎక్కబోతున్న ప్రియా పిళ్లైను అధికారులు నిలువరించి ‘లుకౌట్ నోటీసు’ ఉందని చెబుతూ వెనక్కు పంపిన సంగతి తెలిసిందే.