breaking news
degree final year
-
ప్రేమను బతికించుకోలేక..
మానవపాడు : చిన్నవయసులో అర్థంకాని ఆకర్షణను ప్రేమ అనుకుని ఎలాగైనా బతికించుకోవాలనే తపనతో ఆ ఇద్దరూ ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. దీనికి తల్లిదండ్రులు ఒప్పుకోరని బయటకు వెళ్లిన 24 గంటల్లోపే చావులోనైనా ఒకటి కావాలని తలచి తనువు చాలించారు. హృదయ విదారకమైన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. కొన్ని రోజులుగా మండలంలోని చిన్నపోతులపాడుకు చెందిన సుమన్ (20), మాధవి (15) ప్రేమించుకుంటున్నారు. సుమన్ కర్నూలు పట్టణంలోని ఎస్టీబీసీ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్, మాధవి మానవపాడులోని ఉన్నతపాఠశాలలో పదో తరగతి చదవుతున్నారు. వీరి మధ్య కొంత కాలంగా ప్రేమవ్యవహారం కొనసాగుతుండటంతో ఇంట్లోవారు గమనించి మందలించి బాగా చదువుకోవాలని హెచ్చరించారు. దీంతో శనివారం ఉదయం ఇద్దరూ కలిసి కర్నూలు జిల్లాలోని నంద్యాలకు చేరుకున్నారు. అదే రాత్రి పది గంటలకు అన్న సురేష్‌కు ఫోన్‌చేసి ‘మా ప్రేమ బతకడం కష్టంగా ఉండటంతో ఆత్మహత్య చేసుకుంటున్నాం...’ అని సుమన్ చివరిసారిగా మాట్లాడారు. ఆ తర్వాత వారి ఫోన్ అందుబాటులో లేకపోవడంతో ఇరు కుటుంబాలవారు మానవపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతలోనే ఆదివారం ఉదయం 9.30 గంటలకు నంద్యాల రైల్వే స్టేషన్ సమీపంలోని పొన్నూర్ శివారులో ఆత్మహత్య పాల్పడినట్టు తెలుసుకుని కన్నీరుమున్నీరయ్యారు. -
ప్రేమి‘కుల’ విషాదాంతం
సారంగాపూర్, న్యూస్‌లైన్: పెద్దలు తమ పెళ్లికి అంగీకరించరని, ఇక తాము కలిసి బతికే అవకాశం లేదని భావించిన ప్రేమికులు కలిసే చనిపోయారు. సారంగాపూర్ మండలం మంగేళ గ్రామానికి చెందిన రొండి రంజిత్(22), అదే గ్రామానికి చెందిన పడిగెల వనజ(19) ఆదిలాబాద్ జిల్లా జన్నారంలో శని వారం ఆత్మహత్య చేసుకున్నారు. రంజిత్ జగి త్యాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుండగా, వనజ పదవ తరగతి చదివి ఇంటిలో బీడీలు చుడుతూ, కుట్టుమిషన్ నేర్చుకుంటోంది. ఇద్దరి ఇండ్లు ఎదురెదురుగా ఉండడంతో రోజు కలుసుకొని మాట్లాడునేవారు. ఇదే క్రమంలో మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేర్వేరు కావడంతో ఇద్దరివైపు పెళ్లికి నిరాకరించారు. వనజ తల్లితండ్రులు.. మీ అబ్బాయి తరచూ మా అమ్మాయి వైపు చూస్తున్నాడని, మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడని రంజిత్ తల్లితండ్రులతో చాలాసార్లు గొడవకు దిగారు. ఏడాది క్రితం ఈ విషయంలో పంచాయితీ జరిగినప్పటి నుంచి రెండు కుటుంబాల మధ్య మనస్పర్థలు పెరిగాయి. రెండు నెలల క్రితం వనజకు పెళ్లి చేసేందుకు నిశ్చయించిన పెద్దలు వరపూజ చేశారు. మార్చిలో పెళ్లి జరిపించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక తమ పెళ్లి జరగదని మనస్తాపం చెందిన రంజిత్, వనజ శనివారం మధ్యాహ్నం 3గంటల సమయంలో వేర్వేరుగా ఆటోల్లో జిల్లా జన్నారం చేరుకున్నారు. క్రిమిసంహారక మందు తాగి బస్టాండ్ ప్రాంతం నుంచి కాలినడకన వస్తూ పాతబస్టాండ్ మార్కెట్ ప్రధాన రహదారి వద్దకు చేరుకోగానే కిందపడిపోయూరు. అక్కడున్నవారు గమనించి 108 సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం లక్సెట్టిపేటకు తరలిస్తుండగా మార్గమధ్యంలో ఇద్దరూ చనిపోయూరు. సంఘటన స్థలాన్ని ఇన్చార్జి ఎస్సై చంద్రమోహన్ పరిశీలించారు. యువకుడి వద్ద లభించిన ఆధార్ కార్డు, సెల్ఫోన్లో ఉన్న నంబర్ల ఆధారంగా ప్రేమజంటది మంగేళ గ్రామంగా గుర్తించినట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో అందరూ అక్కడికి తరలివెళ్లారు. రంజిత్, వనజల కుటుం బాలు ఆర్థికంగా మంచి స్థితిలోనే ఉన్నాయి. రంజిత్ తండ్రి కొండయ్య, తల్లి లక్ష్మి వ్యవసాయం చేసుకుంటారు. వీరికి రాజేశ్, రంజిత్ ఇద్దరు కుమారులు. ఇద్దరు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. వనజ తల్లితండ్రులు బుగ్గవ్వ, చిన్నయ్యలకు వనజ ఒక్కగానొక్క కుమార్తె కాగా, కుమారుడు రాములు ఉన్నాడు.