breaking news
deepavali festival offer
-
కొనకుండానే పేలుతున్న టపాకాయలు..!
-
దీపావళికి గోల్డ్ అండ్ డైమండ్స్ కలెక్షన్స్ ...
-
దీపావళి షాపింగ్: ఈ స్పెషల్ ఆఫర్స్ తెలుసుకుంటే బోలెడు డబ్బు ఆదా!
భారత్‌లో అక్టోబర్ నెల వచ్చిందంటే పండుగ సంబురాలు ప్రారంభమైనట్లే. కంపెనీలు కూడా కస్టమర్ల కోసం ఫెస్టివల్ ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. దసరా ముగిసిందో లేదో కొద్ది రోజుల్లోనే దీవాళి కూడా దగ్గర పడడంతో ఈ ఆఫర్ల సందడి మరింత పెరిగింది. సాధారణ రోజుల్లో షాపింగ్ చేసే ప్రజలు పండుగ సమాయాల్లో మరింత ఆసక్తి చూపుతారు. అందుకే ఆ సమయాల్లో వాహనాలు, గృహోపకరణాలు, స్మార్ట్ఫోన్లుతో పాటు ఇతర వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో కంపెనీలు కూడా భారీగా డిస్కౌంట్లు ఆఫర్ చేస్తుండగా, మరో వైపు బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు కూడా వివిధ రకాల డిస్కౌంట్లతో కస్టమర్లని పలకరిస్తుంటాయి. అయితే ప్రజలు మాత్రం ఈ పండుగ సమయాల్లో.. మార్కెట్లో ఉండే ప్రత్యేక ఆఫర్లు ద్వారా ఎక్కువ లబ్ధి పొందే వాటిని తెలుసుకుని ఆపై షాపింగ్ చేస్తే మంచిదని నిపుణులు సూచన. క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్లు క్యాష్‌బ్యాక్‌లు, డిస్కౌంట్లు అత్యంత ప్రజాదరణ పొందినవి. కొనుగోలు చేసేటప్పుడు ముందస్తు ఖర్చులలో కొంత భాగాన్ని ఇవి తగ్గిస్తాయి. అవి సాధారణంగా ఏడాది పొడవునా ఉన్నప్పటికీ పండుగ సమయాల్లో ఇవి మరింత డిస్కౌంట్లను ప్రకటిస్తుంటాయి. గాడ్జెట్లు, దుస్తులు, ఇల్లు & వంటగదికి అవసరమైన వస్తువులు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలను కొనుగోలు చేయాలని చూస్తున్న కస్టమర్లు ఇలాంటి ఆఫర్లతో లబ్ధి పొందవచ్చు. క్రెడిట్ కార్డ్‌లు కూడా మీకు బెస్ట్ డీల్సీను అందిస్తాయి. ముఖ్యంగా ఎంపిక చేసుకునే ఆన్లైన్ ప్లాట్‌ఫాంలో కొన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులతో జరిపే లావాదేవీలపై మరింతగా ప్రయోజనం ఉంటుందండోయ్. ప్రీ అప్రూవ్డ్ లోన్స్ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ సంస్ధలో కస్టమర్లుగా ఉన్న వారితో పాటు ప్రైమ్ కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తాయి. అంటే ప్రీ అప్రూవ్డ్ లోన్లను అందిస్తుంటాయి. వీటి ప్రాసెసింగ్ చాలా వేగంగా ఉంటుంది. సాధారణంగా మనం లోన్ కోసం అప్లై చేసుకుంటే.. జరిగే సాగదీత ప్రక్రియ మొత్తం కూడా ఇందులో కనిపించదు. చాలా సులభంగా రుణాలు పొందవచ్చు. పలు బ్యాంకులు ప్రీమియం క్రెడిట్ కార్డులపై, ప్రిఫరెన్షియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ROI)పై పర్సనల్ లోన్ , హై లోన్-టు-వాల్యూ (LTV)పై హోం లోన్ ప్రీ-క్వాలిఫైడ్ ఆఫర్లను అందిస్తాయి. ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలు, కారు రుణాలు, ఆస్తిపై రుణాలు (LAP) మొదలైన వాటిపై ప్రాసెసింగ్ ఫీజులను పాక్షికంగా లేక పూర్తిగా మాఫీ చేస్తుంటాయి. దీని వల్ల కస్టమర్లు వారి డబ్బును చాలా వరకు ఆదా చేసుకోవచ్చు. వలన, రూ. 50 లక్షల గృహ రుణంపై ప్రాసెసింగ్ రుసుము రూ. 10,000 వరకు పెరగవచ్చు కాబట్టి గణనీయమైన మొత్తాన్ని ఆదా చేయవచ్చు. కారు లోన్, హోమ్ లోన్ లేదా LAP వంటి పెద్ద లోన్ల కోసం దరఖాస్తు చేసే వారు ప్రాసెసింగ్ ఫీజు మాఫీ వంటి వాటితో నగదు ఆదా అవుతుంది. చదవండి: యూజర్లకు బంపరాఫర్.. రూ.10కే మూడు నెలల సబ్స్క్రిప్షన్! -
ఉద్యోగులకు దీపావళి కానుక: హెల్త్ కార్డుల జీవో జారీ
కిరణ్ సర్కార్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి పండగ ఆఫర్ ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ కార్డులపై రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. హెల్త్ కార్డుల పథకానికి సంబంధించి 174,175,176 జీవోలను జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు అందుకు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆ జీవోలో పొందుపరిచింది. హెల్త్ కార్డులు పథకంలో చేరే గెజిటెడ్ అధికారులు రూ.120, నాన్ గెజిటెడ్ ఉద్యోగులు రూ.90 ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు క్యాష్‌లెస్ వైద్యసేవలు అంద చేసేందుకు ప్రభుత్వం హెల్త్‌కార్డుల పథకాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డుల జారీపై ప్రభుత్వ జీవో జారీ చేయడంపై సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు నరేంద్రరావు, మురళీకృష్ణ శనివారం హైదరాబాద్‌లో స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వారు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.