breaking news
Deemed Universities
-
ఎంట్రెన్స్ పరీక్షలు, ఫలితాల కోసం నిరీక్షించలేకే..
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 మహమ్మారి సృష్టించిన కలకలంతో ఎంట్రెన్స్ పరీక్షల కోసం ఎదురు చూడకుండా పలువురు నగర విద్యార్థులు ప్రైవేట్ వర్సిటీల వైపు దృష్టి సారిస్తున్నారు. అత్యుత్తమ బోధన, ల్యాబ్ సదుపాయాలు, ప్రాక్టికల్‌గా ఆయా సబ్జెక్టులను బోధించే ప్రైవేట్ వర్సిటీలు, డీమ్డ్ వర్సిటీల్లో అడ్మిషన్లు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రధానంగా ఇంజినీరింగ్, మెడిసిన్, ఫార్మా, మేనేజ్మెంట్ తదితర కోర్సుల విషయంలో మెజార్టీ విద్యార్థులు ప్రైవేటు వర్సిటీల్లో అడ్మిషన్ల కోసం పరుగులు తీస్తున్నట్లు విద్యారంగ నిపుణులు చెప్తున్నారు. అక్కడ విద్యాబోధన అనంతరం క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగం దక్కించుకునే అవకాశాలుండటంతో ఆయా సంస్థల వైపు మొగ్గు చూపుతున్నారంటున్నారు. ఇక ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీలు సైతం కోవిడ్ కారణంగా ఎంట్రెన్స్ పరీక్షలను రద్దు చేయడంతో ఆయా విద్యాసంస్థలకు నగర విద్యాసంస్థల నుంచి అడ్మిషన్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుండటం విశేషం. ప్రైవేటు వర్సిటీలకు భారీగా దరఖాస్తులు.. ప్రధానంగా మన పొరుగునే ఉన్న చెన్నై, బెంగళూరు నగరాల్లోని పలు ప్రైవేటు డీమ్డ్ వర్సిటీలు, విద్యాసంస్థల్లో అడ్మిషన్ పొందేందుకు సిటీ విద్యార్థులు వేలాది మంది దరఖాస్తు చేస్తున్నారు. ఇటీవల కోవిడ్ కారణంగా ఎంట్రెన్స్ పరీక్షను రద్దు చేయడంతో వెల్లూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అడ్మిషన్ పొందేందుకు నిత్యం ఏపీ, తెలంగాణా, గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచి సుమారు పదివేల దరఖాస్తులు తమకు అందుతున్నాయని వీఐటీ వైస్ ప్రెసిడెంట్ జీవీ సెల్వమ్ తెలిపారు. ఇందులో సింహభాగం హైదరాబాద్ నుంచే వస్తున్నాయంటున్నారు. ఏటా తమ విద్యాసంస్థలో ప్రవేశం పొందేందుకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి సుమారు 2 లక్షలకు పైగా దరఖాస్తులు అందుతాయని తెలిపారు. అడ్మిషన్ ఇచ్చేందుకు.. ఇంటరీ్మడియెట్ లేదా ప్లస్‌టు మార్కులు, జేఈఈ లేదా స్కాలస్టిక్ అసెస్మెంట్ టెస్ట్‌లో విద్యార్థులు చూపిన ప్రతిభ ఆధారంగా తమ విద్యాసంస్థలో ప్రవేశం పొందిన విద్యార్థుల జాబితాను ఆగస్టు నెలలో విడుదల చేస్తామన్నారు. ఇక లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి సైతం ఈ ఏడాది 25 శాతం మేర దరఖాస్తులు పెరిగినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులోనూ నగర విద్యార్థుల దరఖాస్తులే అధికమని సంస్థ అడిషనల్ డైరెక్టర్ అమన్ పేర్కొన్నారు. పరుగులు ఎందుకంటే.. కోవిడ్ పంజా విసరడంతో పలు ఎంట్రెన్స్ పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి ,అడ్మిషన్లు పొందే ప్రక్రియ ఆలస్యమౌతోందని నగరానికి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు భావిస్తున్నారు. సెపె్టంబర్, అక్టోబర్ వరకు నిరీక్షించేకంటే ప్రైవేటఫ్ విద్యా సంస్థలు, డీమ్డ్ వర్సిటీల్లో తమ పిల్లలను చేరి్పస్తేనే బాగుంటుందని తల్లిదండ్రులు చెబుతున్నారు. కోవిడ్ కారణంగా ఇళ్లకే పరిమితమైన తమ పిల్లలు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే క్రమంలో తీవ్రంగా మానసిక ఒత్తిడికి గురవుతున్న కారణంగా ప్రైవేట్, డీమ్డ్ వర్సిటీల్లో సీటు సాధించేందుకు యతి్నస్తున్నట్లు మరికొందరు పేరెంట్స్ తెలిపారు. డీమ్డ్ వర్సిటీల్లో బోధన, ప్రాక్టికల్ ఎక్స్‌పీరియెన్స్, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ లభిస్తాయన్న నమ్మకం కూడా ఆ దిశగా సిటీ విద్యార్థులు తరలి వెళ్లేలా చేస్తోంది. -
యూనివర్సిటీ అనే పదం వాడుకోరాదు
సాక్షి, అమరావతి : దేశంలోని డీమ్డ్ యూనివర్సిటీలుగా ఉన్న సంస్థలు విశ్వవిద్యాలయాలు(యూనివర్సిటీలు)గా పేర్కొంటూ కార్యకలాపాలు సాగిస్తున్నాయని, ఇకపై అవి యూనివర్సిటీలుగా కాకుండా డీమ్డ్ వర్సిటీలుగానే తమ పేర్లను స్పష్టంగా పేర్కొనాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) ఆదేశిం చింది. ఈ మేరకు ఆయా డీమ్డ్ యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లకు, డైరెక్టర్లకు లేఖ రాసింది. ఇటీవల సుప్రీంకోర్టులో ఒక కేసులో విచారణ సందర్భంగా ఈ సంస్థలు డీమ్డ్ యూనివర్సిటీలుగా కాకుండా యూనివర్సిటీల పేరిట కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించిందని యూజీసీ పేర్కొంది. ఇకపై ఆయా సంస్థలు యూనివర్సిటీలుగా పేరును వాడరాదని, డీమ్డ్ యూనివర్సిటీలుగానే తమ కార్యకలాపాలు సాగించాలని స్పష్టంచేసింది. దేశంలో ఇలాంటి సంస్థలు 123 ఉన్నాయని గుర్తించామంటూ.. వాటి వివరాలను తన లేఖలో పొందుపరిచింది. వీటిలో ఐదు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవి ఉన్నాయి. విశాఖపట్నంలోని గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్(గీతం), గుంటూరు జిల్లాలోని కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్, తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠ్, అనంతపురంలోని శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్, గుంటూరు జిల్లాలోని విజ్ఞాన్ ఫౌండేషన్ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ఉన్నాయి. -
కోటాలు కొట్టేసే ’నీట్’ గాళ్లు
-
పునఃసమీక్ష జరపండి
న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వ ప్రతిపాదిత నిషేధిత జాబితా(బ్లాక్‌లిస్ట్)లో ఉన్న 44 డీమ్డ్ యూనివర్సిటీల భవితవ్యంపై బుధవారం సుప్రీంకోర్టు స్పందించింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) నుంచి సలహా తీసుకుని.. ఆ అంశంపై పునఃసమీక్ష జరపాలని ధర్మాసనం కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ వర్సిటీల్లో ప్రభుత్వ మార్గదర్శకాల అమలులో జరిగిన వైఫల్యానికి సంబంధించిన నివేదికలని పరిశీలించి, రెండు నెలల్లోగా కేంద్రప్రభుత్వానికి సూచనలను ఇవ్వాలని యూజీసీని ధర్మాసనం ఆదేశించింది. వాటి ఆధారంగా కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. యూజీసీ సూచనలకు కచ్చితంగా తలొగ్గాల్సిన అవసరం కేంద్రప్రభుత్వానికి లేదని, అయితే, నిపుణులతో కూడిన చట్టబద్ధ సంస్థ అయిన యూజీసీ ఇచ్చే సూచనలకు తగిన విలువ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఆ 44 విశ్వవిద్యాలయాలను డీనోటిఫై చేయాలని సిఫారసు చేసిన మానవ వనరుల శాఖ.. ఆయా విద్యార్థుల భవితవ్యానికి నష్టం కలగకుండా చూస్తామని గతంలోనే సుప్రీంకోర్టుకు నివేదించింది. -
ఇంజనీరింగ్‌కు డీమ్డ్ మార్గాలు..
ఇంటర్మీడియెట్ ఎంపీసీని విజయవంతంగా పూర్తిచేసిన వారు ఉన్నత ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశించేందుకు వీలుకల్పించే వివిధ జాతీయ స్థాయి ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలతో పాటు తమిళనాడు, కర్ణాటకలోని ప్రముఖ కళాశాలల ఎంట్రన్స్‌ల గురించి గతవారం చర్చించాం. ఈ వారం రాష్ట్రంలోని డీమ్డ్ యూనివర్సిటీలు నిర్వహించే ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలపై స్పెషల్ ఫోకస్.. ఎం.ఎన్.రావు, శ్రీ చైతన్య విద్యా సంస్థలు. విజ్ఞాన్ యూనివర్సిటీ గుంటూరు జిల్లాలోని వడ్లమూడిలో ఉన్న విజ్ఞాన్ యూనివర్సిటీ బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు వి-శాట్ (2014) ఎంట్రన్స్‌ను నిర్వహిస్తుంది. ఈ పరీక్షలను ఆన్లైన్లో 2014, ఏప్రిల్ 23 నుంచి 27 వరకు నిర్వహిస్తారు. వి-శాట్ దరఖాస్తులు యాక్సిస్ బ్యాంక్ ముఖ్య బ్రాంచ్‌ల్లో, తపాలా కార్యాలయాల్లో, అన్ని విజ్ఞాన్ కార్యాలయాల్లో లభిస్తాయి. యూనివర్సిటీ వెబ్సైట్ నుంచి కూడా దరఖాస్తును డౌన్లోడ్ చేసుకోవచ్చు. నిర్దేశిత ఫీజుతో దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 10, 2014. వి-శాట్ ప్రశ్నపత్రం: మ్యాథమెటిక్స్ 30 ప్రశ్నలు, ఫిజిక్స్ 30 ప్రశ్నలు, కెమిస్ట్రీ 30 ప్రశ్నలు, ఇంగ్లిష్/ఆప్టిట్యూడ్ 30 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. నెగిటివ్ మార్కులుండవు. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్/ఆప్టిట్యూడ్‌లలో పరీక్ష రాసిన విద్యార్థులు అన్ని బీటెక్ ప్రోగ్రామ్స్‌కు అర్హులు. వెబ్సైట్: www.vignanuniversity.org కేఎల్ యూనివర్సిటీ విజయవాడలో ప్రధాన కార్యాలయం, గుంటూరు జిల్లాలోని వడ్డేశ్వరంలో క్యాంపస్‌ను కలిగి ఉన్న కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ.. కేఎల్‌యూ ఇంజనీరింగ్ ఎంట్రన్స్-2014 నిర్వహిస్తుంది. పరీక్ష 2014, మే 3న ఆఫ్‌లైన్ పద్ధతిలో జరుగుతుంది. దరఖాస్తు విధానం: ఆన్లైన్/ఆఫ్‌లైన్ విధానాల్లో దరఖాస్తుల విక్రయానికి చివరి తేదీ: ఏప్రిల్ 22, 2014. దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 25, 2014. ఇంజనీరింగ్‌లో చేరేందుకు ఇంటర్లో 60 శాతం మార్కులు రావాలి. కేఎల్యూఈఈఈ-2014 తోపాటు ఎంసెట్, జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకుల ఆధారంగా కూడా సీట్లు పొందొచ్చు. ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్‌లో వివిధ బ్రాంచ్‌లతో పాటు బీటెక్+ఎంబీఏ కోర్సు కూడా అందుబాటులో ఉంది. ఐదేళ్ల కాలవ్యవధిగల బీటెక్+ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ కోర్సు ఉంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కాంబినేషన్లతో కేఎల్‌యూ ఎంట్రన్స్ రాసిన వారు బీటెక్ బయోటెక్నాలజీ కోర్సుకు అర్హులు. అదే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాంబినేషన్లతో కేఎల్‌యూ ఎంట్రన్స్ రాసిన విద్యార్థులు ఇతర బీటెక్ (నాలుగేళ్ల కోర్సు)లోని బ్రాంచ్‌ల్లో ప్రవేశాలకు అర్హులు. పరీక్షలో మ్యాథమెటిక్స్ 80 ప్రశ్నలు, ఫిజిక్స్ 40 ప్రశ్నలు, కెమిస్ట్రీ 40 ప్రశ్నలుంటాయి. మొత్తం 160 ప్రశ్నలు ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. నెగిటివ్ మార్కులు లేవు. వెబ్సైట్: www.kluniversity.in గీతం యూనివర్సిటీ రాష్ట్రంలోని గీతం యూనివర్సిటీ.. బీటెక్ (4 ఏళ్ల కోర్సు); బీటెక్ + ఎంటెక్ (ఐదేళ్ల డ్యూయల్ డిగ్రీ కోర్సు) లలో ప్రవేశానికి గీతం అడ్మిషన్ టెస్ట్ (ఎఅఖీ) - 2014ను నిర్వహించనుంది. గాట్‌ను ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. గాట్ పరీక్షలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంజనీరింగ్ కళాశాలల్లో సివిల్, మెకానికల్, ఈసీఈ, కంప్యూటర్ సైన్స్ వంటి సంప్రదాయ బ్రాంచ్‌లతో పాటు హైదరాబాద్ క్యాంపస్‌లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ కూడా అందుబాటులో ఉంది. మొదటి ప్రయత్నంలోనే ఇంటర్లో ఉత్తీర్ణులై మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో కనీసం 60 శాతం మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. ప్రశ్నపత్రం: గాట్- 2014 పరీక్షలో మ్యాథమెటిక్స్ 40 ప్రశ్నలు, ఫిజిక్స్ 30 ప్రశ్నలు, కెమిస్ట్రీ 30 ప్రశ్నలుంటాయి. ప్రతి సరైన సమాధానానికి 3 మార్కులు, తప్పు సమాధానానికి -1 మార్కు ఉంటుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకులలో దరఖాస్తులు లభిస్తాయి. ఆన్లైన్లో కూడా దరఖాస్తులను పూరించవచ్చు. డీడీ ద్వారా కూడా దరఖాస్తు పొందొచ్చు. వెబ్సైట్: www.gitam.edu ప్రిపరేషన్ ప్లాన్ మ్యాథమెటిక్స్ ఐపీఈ పరీక్షల తర్వాత తక్కువ వ్యవధిలో ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలుంటాయి కాబట్టి మొత్తం సిలబస్‌ను వీలైనంత త్వరగా పూర్తిచేయాలి. ప్రాధాన్యతగల చాప్టర్లను బాగా చదవాలి. కొన్ని పరీక్షల్లో నెగిటివ్ మార్కులుంటాయి. అందువల్ల ఎన్ని ప్రశ్నలకు సమాధానాల్ని గుర్తించామనే కన్నా ఎన్నింటికి కచ్చితమైన సమాధానాలు గుర్తించామన్నదే ముఖ్యం. సంకీర్ణ సంఖ్యలు; మాత్రికలు; ప్రస్తారాలు, సంయోగాలు, సంభావ్యత; అవకలనం- వాటి అనువర్తనాలు; నిశ్చిత సమాకలనం; వైశాల్యాలు; అవకలన సమీకరణాలు; వృత్తాలు, శాంకవాలు; సదిశలు, సరళరేఖలు, త్రికోణమితి సమీకరణాలు, విలోమ త్రికోణమితి ప్రమేయాలు, త్రిభుజ ధర్మాలు నుంచి కచ్చితంగా ప్రశ్నలు వస్తాయి కాబట్టి వీటిని పూర్తిగా చదవాలి. కచ్చితమైన వ్యూహంతో ప్రిపరేషన్ కొనసాగిస్తే మంచి ర్యాంకు సొంతమవుతుంది. ఒక్కో యూనిట్‌కు ఎంత సమయం అవసరమవుతుందో చూసుకుని, ప్రిపరేషన్ ప్రణాళిక వేసుకోవాలి. రెండో సంవత్సరం విద్యార్థులు ఐపీఈ ప్రిపరేషన్‌తో పాటు ఆబ్జెక్టివ్ ప్రశ్నల సాధన పూర్తయ్యేటట్లు ప్రణాళిక రూపొందించుకోవాలి. ఇలాచేస్తే ఐపీఈ పరీక్షల తర్వాత అందుబాటులో ఉన్న స్వల్ప వ్యవధిలో మెరుగైన పునశ్చరణకు అవకాశముంటుంది. పోటీ పరీక్షల్లో ఫార్ములా ఆధారిత ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటితో పాటు కాన్సెప్టులపై పట్టు సాధించాలి. గత ప్రశ్నపత్రాలను పరిశీలించి, ఏ అంశాలకు ఎక్కువ వెయిటేజీ ఇస్తున్నారో పరిశీలించి, వాటిపై శ్రద్ధపెట్టాలి. ఫిజిక్స్ ఫిజిక్స్‌కు సంబంధించి మూలసూత్రాలతో పట్టికలను రూపొందించుకొని, వీలైనన్ని సార్లు చదవాలి. మొదటి ఏడాది సిలబస్‌లోని ముఖ్య మూలసూత్రాలైన శక్తి, ద్రవ్యవేగ, కోణీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమాలపై అవగాహన పెంపొందించుకొని, వాటిని ఏ సందర్భాల్లో అనువర్తించాలో తెలుసుకోవాలి. సరళ హరాత్మక చలనం (ఎస్హెచ్ఎం)లో లఘు లోలక డోలనావర్తన కాలాన్ని, వాటి అనువర్తనాలను క్షుణ్ణంగా ప్రాక్టీస్ చేయాలి. సీనియర్ ఇంటర్ ఫిజిక్స్‌లో కిర్కాఫ్ నియమాలు; ఫ్లెమింగ్ ఎడమ, కుడిచేయి సూత్రాలు; అర్ధ వాహక పరికరాలు; ఎంసీజీ, ప్రవాహ విద్యుత్ శాస్త్రంలోని మూల సిద్ధాంతాలను, సమీకరణాలను పట్టిక రూపంలో పొందుపరచుకొని ప్రాక్టీస్ చేస్త్తే ఎంత కష్టమైన పాఠ్యాంశాన్నయినా ఇష్టంగా చదవొచ్చు. ఫార్ములా ఆధారిత ప్రశ్నలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం వల్ల మంచి స్కోర్‌ను సొంతం చేసుకోవచ్చు. వీలైనన్ని నమూనా ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయాలి. చీలికల ప్రయోగం; ఫిజికల్ ఆప్టిక్స్ వంటి చిన్న యూనిట్లపైనా ప్రత్యేక శ్రద్ధ చూపాలి. కాన్సెప్టులు, వాటి అనువర్తనాలను క్షుణ్ణంగా నేర్చుకోవాలి. పోటీ పరీక్షల్లో ఇచ్చే ప్రశ్నలు విభిన్నంగా ఉంటాయి. అందువల్ల బలహీనంగా ఉన్న అంశాలకు కొంత ఎక్కువ సమయం కేటాయించి, వాటిపై పట్టుసాధించాలి. రిఫరెన్స్ బుక్స్: ఎన్సీఈఆర్టీ 11, 12 తరగతి పుస్తకాలు. హెచ్.సి.వర్మ- ఫిజిక్స్. కెమిస్ట్రీ కెమిస్ట్రీలోని ఆర్గానిక్, ఇనార్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ విభాగాల్లో ఆర్గానిక్ కెమిస్ట్రీ కీలకమైంది. ఇందులోని చాలా అంశాలు అంతర్గత సంబంధం కలిగి ఉంటాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ప్రతిచర్యల క్రమం, ఫ్లోచార్ట్స్, మూలకాలు-తయారీ పద్ధతులు-ధర్మాలను వరుస క్రమంలో రివిజన్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆల్కహాల్స్, ఎమైన్స్, ఫినోల్స్, నేమ్డ్ రియాక్షన్స్ చాప్టర్లలోని ఆర్డర్ ఆఫ్ యాసిడ్స్, బేసిక్ స్ట్రెంగ్త్ అంశాలను సీక్వెన్స్ ఆఫ్ రియాక్షన్స్, ఇంటర్ కన్వర్షన్స్ రూపంలో ప్రాక్టీస్ చేయాలి. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలలో సమస్యల ఆధారిత ప్రశ్నలు ఎక్కువగా వస్తాయి. ఫిజికల్ కెమిస్ట్రీ మొత్తం ఫార్ములాల ఆధారంగా ఉంటుంది. మ్యాథమెటిక్స్, న్యూమరికల్స్ సంబంధితంగా ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి ఫిజికల్ కెమిస్ట్రీ విషయంలో ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యమైన టాపిక్స్: అటామిక్ స్ట్రక్చర్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియూడిసిటీ ఇన్ ప్రాపర్టీస్, కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్, స్ట్రక్చర్, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్/గ్యాసెస్, సొల్యూషన్స్, స్టైకోమెట్రీ, ఎలక్ట్రో కెమిస్ట్రీ, కెమికల్ కైనటిక్స్, యాసిడ్స్ అండ్ బేసిస్, పి బ్లాక్ ఎలిమెంట్స్- గ్రూపు 13-17, బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, హైడ్రో కార్బన్స్, థర్మోడైనమిక్స్, ఆల్కైన్స్ అండ్ అరోమాటిక్ హైడ్రో కార్బన్స్, హాలో ఆల్కేన్స్ అండ్ హాలో అరేన్స్, ఆల్కహాల్స్/ ఫినాల్స్, ఈథర్స్, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్. భౌతిక రసాయన శాస్త్రంలో ప్రతి చాప్టర్ నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా సమతాస్థితి, విద్యుత్ రసాయన శాస్త్రం, థర్మో కెమిస్ట్రీ, ద్రావణాల్లోని collegativeప్రాపర్టీస్, ఘనస్థితి వంటి చాప్టర్స్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. రిఫరెన్స్: ఎన్సీఈఆర్టీ 11,12 తరగతి పుస్తకాలు, ఫిజికల్ కెమిస్ట్రీ-పి.బహదూర్; ఆర్గానిక్ కెమిస్ట్రీ-ఆర్.జె.మారిసన్.